నెక్లెస్ రోడ్డుపై గొయ్యి.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని నెక్లెస్ రోడ్డుపై గొయ్యి పడింది. దీంతో ఆ ప్రాంతంలో రోడ్డు భారీగా కుంగిపోయింది. అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గొయ్యిను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు వైపు వాహనదారులు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి మరమ్మతు పనులను ప్రారంభించారు.