నేడు నెక్లెస్‌రోడ్‌లో నీరాకేఫ్‌కు శంకుస్థాపన | Srinivas Goud Will Open Neera Cafe At Necklace Road | Sakshi
Sakshi News home page

నేడు నెక్లెస్‌రోడ్‌లో నీరాకేఫ్‌కు శంకుస్థాపన 

Published Thu, Jul 23 2020 4:34 AM | Last Updated on Thu, Jul 23 2020 4:34 AM

Srinivas Goud Will Open Neera Cafe At Necklace Road - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో నీరా కేఫ్‌కు నేడు శంకుస్థాపన జరగనుందని, గీత కార్మికుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేందుకే ఈ కేఫ్‌లను ఏర్పాటు చేస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. గత ప్రభుత్వాలు గౌడ వృత్తిదారులు కట్టే పన్నును మాత్రమే చూశాయని, వారి సంక్షేమాన్ని మరిచాయని మంత్రి విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదు గా జరిగే ఈ నీరాకేఫ్‌ శంకుస్థాపనకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా హాజరవనున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లను బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆ శాఖ అధికారులు, గౌడ సంఘాలనేతలతో కలిసి పరిశీలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement