కరోనా నుంచి అధిక ముప్పు ఎదుర్కొంటున్న ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి తెలంగాణలో వ్యాక్సిన్లు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కాగా, హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డుకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టారు.
1/9
హైదరాబాద్ పోలీసులు వినూత్న పద్ధతిలో నగర పౌరులకు కోవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. జేఎన్‌టీయూ చౌరస్తాలో కరోనాపై అవగాహన కార్యక్రమం.
2/9
లాక్‌డౌన్ వెసులుబాటు సమయం ముగిసిన తర్వాత హైదరాబాద్ ఉస్మాన్‌గంజ్‌లో భారీగా స్తంభించిన ట్రాఫిక్
3/9
వాక్సినేషన్ కోసం హైదరాబాద్‌లో బారులు తీరిన క్యాబ్, ఆటో డ్రైవర్లు
4/9
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు పేరును పీవీ నరసింహారావు మార్గ్‌గా మార్చాలని తెలంగాణ మంత్రి మండలి ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో ‘పీవీ నరసింహారావు మార్గ్’ పేరిట అధికారులు కొత్త బోర్డును ఏర్పాటు చేశారు.
5/9
ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కళాశాల వ్యాక్సినేషన్ సెంటర్‌లో టీకా వేయించుకుంటూ యువతుల సెల్ఫీలు
6/9
ఢిల్లీలోని మూల్‌చంద్ ఆస్పత్రిలోని డ్రైవ్‌ఇన్ వ్యాక్సినేషన్ సెంటర్‌లో వాహనదారుడికి టీకా వేస్తున్న ఆరోగ్య కార్యకర్త
7/9
నవీముంబైలోని ఎన్‌ఎంఎంసీ ఆస్పత్రికి గురువారం బ్లాక్‌ఫంగస్ లక్షణాలతో వచ్చిన ఓ బాధితుడికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యురాలు
8/9
మహారాష్ట్రలోని దాదర్ రైల్వేస్టేషన్‌లో బాలుడికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న ఆరోగ్య కార్యకర్త
9/9
మహారాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లను రద్దుచేయడంతో గురువారం థానేలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment