సూపర్ స్ప్రెడర్లుగా పేర్కొన్న వారికి తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మే 28 నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
1/7
ముంబై నగరం మలాడ్‌లోని మైండ్‌స్పేస్ ప్రాంతంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కొత్తగా నిర్మిస్తున్న జంబో కోవిడ్ సెంటర్
2/7
జీహెచ్‌ఎంసీలో చేపట్టిన స్పెషల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నాంపల్లిల్లోని ఓ ఫంక్షన్ హాలులో వ్యాక్సిన్ కోసం వచ్చిన ట్రేడ్ వర్కర్స్.
3/7
కరోనా రెండో దశ ఉధృతి, లాక్‌డౌన్ కారణంగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు వద్ద జన సంచారం లేకపోవడంతో సరస్సులోని ఉయ్యాల వంతెనపై కోతులు సందడి చేస్తున్నాయి. ఆదివారం ఆ దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. – గోవిందరావుపేట
4/7
ఢిల్లీలోని గురుద్వారా వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌లో చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అవుతున్న చిన్నారి రుద్ర సింగ్, అతని కుటుంబసభ్యులకు సంతోషంగా వీడ్కోలు పలుకుతున్న ఆరోగ్య కార్యకర్త.
5/7
యూకేలో కోవిడ్ ఆంక్షలను సడలించడంతో ఆదివారం ఆటవిడుపు కోసం ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. దక్షిణాన ఉన్న బిగ్టన్ బీచ్‌లో సేదతీరుతున్న ప్రజలు
6/7
చైనా శనివారం హైనాన్ ప్రావిన్సులోని వెన్‌చాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్–7 రాకెట్‌ను ప్రయోగించింది. ఆ దేశం తలపెట్టిన అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని ఇది మోసుకెళ్లింది.
7/7
యూరప్‌లోనే అత్యంత యాక్టివ్‌గా ఉండే ఇటలీలోని ఎట్నా అగ్ని పర్వతం లావా వెదజల్లుతోంది
Comments
Please login to add a commentAdd a comment