Laknavaram lake
-
పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారా.. సరికొత్త హంగులతో లక్నవరం తప్పక చూడాల్సిందే (ఫొటోలు)
-
Warangal: అందుబాటులోకి ఎకో టూరిజం.. చుట్టేద్దాం రండి!
బిజీ లైఫ్‌లో కాస్త ఊరట కోసం.. ఒత్తిడితో కూడిన జీవన విధానంలో కొంత మార్పుకోసం.. మానవ జీవితంతో ముడిపడిన అద్భుతమే ప్రక్రియ పర్యాటకం. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పలు ప్రదేశాల వీక్షణకు ప్రస్తుతం మరోసారి అవకాశం లభించనుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎకో టూరిజానికి కరోనా తర్వాత తిరిగి అనుమతి లభించడంతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. సాక్షి, వరంగల్: కరోనా కారణంగా నిలిచిన ఎకో టూరిజం పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. గత రెండేళ్ల క్రితం ఏటూరునాగారం అభయారణ్యం తాడ్వాయిలో పర్యాటకుల ఆనందం కోసం ఎకో టూరిజాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఆన్లైన్ ద్వారా ఈ ఎకో టూరిజం కోసం బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో సైకిల్ ట్రాకింగ్, చిల్ర్డన్ ప్లే ఏరియా, వాక్ కెనాపిను వన కుటీరం ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం నుంచి కరోనా కారణంగా ఎకో టూరిజం నిలిచిపోయింది. మళ్లీ ఎకో టూరిజం ఆన్లైన్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ వారంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ఎకో టూరిజం అందుబాటులోకి రానుంది. చిల్ర్డన్స్ ప్లే ఏరియా తెరుచుకోనున్న అధ్యయన కేంద్రం ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ గురించి తెలిపేలా.. పర్యావరణ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేశారు. అభయారణ్యంలో ఉండే పక్షలు, అటవీ జంతువుల, చెట్లు బొమ్మలను కళ్లకు కట్టినట్లుగా చూపారు. వాక్ కెనాపీని మరమ్మతులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ట్రెకింగ్ సైకిళ్లు మరమ్మతులకు రావడంతో కొత్త సైకిళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వన కుటీరాల్లో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. పర్యావరణ అధ్యయన కేంద్రం కొత్త సఫారి పర్యాటకులు అడవుల్లో నేరుగా పర్యటించేందుకు కొత్తగా సఫారీ ఏర్పాటు చేయనున్నారు. తాడ్వాయి ఆర్చి నుంచి గ్రాస్ ప్లాంట్ దారి గుండా హైవే రోడ్డు అడవిలో నుంచి మేడారం మార్గంలోకి.. తాడ్వాయి సమీపంలోని సారలమ్మ గుడి నుంచి కామారం సమీపాన రాక్షస గుహలను సందర్శించి, అక్కడి నుంచి చిన్నబోయినపల్లి నుంచి కొండాయి మీదుగా కొండేటి వాచ్‌టవర్ వ్యూ పాయింట్ వరకు అటవీ మార్గాన పర్యటనకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లు చేస్తున్నాం ఎకో టూరిజం ఆన్లైన్ సేవలకు ఏర్పాట్లు చేస్తున్నాం. తాడ్వాయి వన కుటీరాల నుంచి ఆరు కిలోమీటర్లు అడవి మార్గం గుండా పర్యాటకులు సైకిల్ ట్రాకింగ్ నిర్వహించేలా ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నాం. ఈ వారంలో ఎకో టూరిజం సేవలను ప్రారంభిస్తాం. – చౌకాట్ హుసేన్, వైల్డ్‌లైఫ్ రేంజ్ అధికారి బొగత వద్ద ట్రెక్కింగ్.. ములుగు జిల్లా వాజేడు మండల మరిధిలోని బొగత జలపాతం వద్ద కొత్తగా ఏర్పాట్లను చేపట్టనున్నారు. కరోనా కాలంలో బొగత జలపాతం పర్యాటకుల సందడి లేక వెల వెల బోయింది. ఎకో టూరిజం కూడా దూరంగా ఉండటంతో పర్యాటకుల రాక పూర్తిగా తగ్గింది. మళ్లీ ఎకో టూరిజానికి పర్యాటక శాఖ ఉత్తర్వులతో జలపాతం వద్ద కొత్త హంగులను ఏర్పాటు చేయనున్నారు. గతంలో 2 కిలో మీటర్ల వరకు ట్రెక్కింగ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం రహదారి సౌకర్యం లేకుండాపోయింది. దానిని అభివృద్ధి చేయడానికి ఉన్నతాధికారుల అనుమతులకు నివేదికలను పంపగా అనుమతులు వచ్చాయి. సైక్లింగ్ ప్రారంభిస్తున్న అటవీ శాఖ అధికారులు కొత్తగా 1.50 కిలో మీటర్ల పరిధిలో సఫారీ ట్రావెలింగ్కు అనుమతులను కోరగా ఆమోదం లభించింది. వీటిని త్వరలోనే అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, గతంలో ఉన్న సైక్లింగ్ ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినడంతో దానిని మరమ్మతులు చేసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. జిఫ్ లైన్ సైతం దెబ్బ తిన్నప్పటికీ దానిని మరమ్మతులు చేసి పర్యాటకుల ఉత్సాహ పర్చడానికి వీలుగా అందించనున్నారు. బొగత వద్ద ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలను చేపడుతున్నారు. లక్నవరం గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పరి ధిలోని లక్నవరం సరస్సు సందర్శనకు పర్యాటక శాఖ అనుమతి లభించింది. కరోనా కాలంలో ఆపేసిన పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కాజేట్లో ఉండేందుకు కరోనా కాలంలో అనుమతి నిరాకరించిన అధి కారులు ప్రస్తుతం అనుమతిస్తున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జింకల పార్క్ తిరిగి ప్రా రంభించారు. సస్పెన్షన్ బ్రిడ్డిల నుంచి తూముల వరకు సైక్లింగ్, సమీపంలోని గుట్టలపై ట్రెక్కింగ్‌కు ఒక్కరికి రూ.100చొప్పున ప్రారంభించా రు. మరో పది రోజుల్లో నైట్ క్యాంపింగ్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో లక్నవరం ప్రాంతంలో వండర్ లా ను తలపించే విధంగా స్విమింగ్ ఏర్పాట్లను చేస్తున్నారు. -
లక్నవరం కేబుల్ బ్రిడ్జి సేఫెనా..?
-
Mulugu: లక్నవరం చెరువులో మునిగి యువతీ, యువకుడు మృతి
సాక్షి, ములుగు : జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. లక్నవరం చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాగా, వారిద్దరూ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) చెందినవారు. వివరాల ప్రకారం.. ఐఎస్బీకి చెందిన ఆరుగురు(నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు) విద్యార్థుల బృందం లక్నవరం చెరువును చూసేందుకు వచ్చారు. అనంతరం సరదాగా సరస్సులోకి దిగారు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు యువతీ, యువకుడు నీటిలో మునిగిపోయారు. తోటి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. వారిద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను సాయి ప్రీతమ్ (24), తరుణి (20)గా గుర్తించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
Photo Feature: ‘సూపర్’ వ్యాక్సినేషన్ కంటిన్యూ
సూపర్ స్ప్రెడర్లుగా పేర్కొన్న వారికి తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మే 28 నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
ఆగని వాన
ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, ఆకేరు, చలివాగు అలుగుపోస్తున్న లక్నవరం, పాకాల చెరువులు 66 చెరువులకు గండ్లు.. నీట మునిగిన పంటలు సహాయక చర్యలు ముమ్మరం సెలవు రోజు కూడా విధుల్లోనే అధికారులు హన్మకొండఅర్బన్ : జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం కూడా వర్షం కురిసింది. కొన్ని చోట్ల శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం పెద్దగా లేకపోవడంతో యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు వర్షాల ప్రభావంతో నలుగురు మృత్యువాత పడ్డారు. 34 ఇండ్లు పూర్తిగా, 251 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు 7వేల మంది వర్షాల కారణగా నిరాశ్రయులయ్యారు. దెబ్బతిన్న రోడ్లను తాత్కాలిక మరమ్మతులతో అధికారులు పునరుద్ధరించారు. 13వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వరదలు పూర్తిగా తగ్గిన తరువాత పంట నష్టం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వదర తాకిడికి 66 చెరువులకు బుంగలు పడ్డాయి. వీటిలో చాలా వాటిని అధికారులు అప్రమత్తమై పూడ్చివేసే పనులు చేపట్టారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం- ధర్మారావుపేట గ్రామాల మధ్యన ఉన్న మోరంచవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాగు అవతలకు చెందిన 15 గ్రామాలకు రవాణా సౌకర్యాలు స్తంభించాయి. చిట్యాల మండలంలోని చలివాగు, మానేరు ఉప్పొంగుతున్నాయి. వరదనీటి కారణంగా పత్తి, మిరప, వరి పంటలు నీట మునిగాయి. వరదకు ములుగు మండలంలోని కాశిందేవిపేట-రామయ్యపల్లి సమీపంలోని కెనాల్ కాలువ తెగింది. దీంతో దిగువన ఉన్న పంట పొలాలు కోతకు గురయ్యాయి. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు 34 అడుగులకు చేరి అలుగు పోస్తోంది. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు పూర్తి స్థాయి (30.03 ఫీట్లు)లో నిండి అలుగు పారుతోంది. భారీ వర్షానికి పాలకుర్తి మండలంలో వాగులు పొంగి పొర్లడంతో వల్మిడి- ముత్తారం గ్రామాల మధ్య ఉన్న బీటీ రోడ్డు తెగి పోయింది. శుక్రవారం ఉధృతంగా ప్రవహించిన హన్మకొండ నయీంనగర్‌లోని పెద్దమోరీ శనివారం తగ్గుముఖం పట్టింది. వరుస వర్షాలతో భూపాలపల్లి ఏరియాలోని గనులు బురదమయంగా మారాయి. గనుల వద్ద ఉన్న బంకర్ ప్రాంతాల్లో నీరు నిలిచింది. బొగ్గు లారీల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెలవురోజు విధుల్లోనే... ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ప్రధాన శాఖల అధికారులు ఉద్యోగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూం కొనసాగింపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. -
29 అడుగులు దాటిన లక్నవరం నీటిమట్టం
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు నీటిమట్టం 29 అడుగులు దాటింది. ఆదివారం మధ్యాహ్నం సరస్సులో 29 అడుగుల 3 అంగుళాల నీరుంది. ఈ మేరకు సరస్సు ప్రధాన కాల్వల్లోని నర్సింహుల, రంగాపురం కాల్వల కోసం నీటిని సద్దిమడుగులోకి వదిలారు. తర్వాత అక్కడి నుంచి కాల్వలకు నీటిని వదిలారు. ఇదిలా ఉండగా, సరస్సు తూముల వద్ద 24 అడుగుల ఎత్తులో రాళ్ల మధ్య నుంచి నీరు ఎక్కువగా లీకవుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, నీటిని విడుదల చేయాల్సిన సమయంలో కూడా నీటిపారుదల శాఖ అధికారులు రాకుండా స్థానిక గ్యాంగ్మెన్లతోనే పనులు చేయించడం గమనార్హం. పదివేల ఎకరాలకు సాగునీరందిస్తూ, పర్యాటక ప్రాంతంగా ప్రభు త్వానికి ఆదాయం సమకూరుస్తున్న సరస్సుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. -
లక్నవరం సరస్సు వద్ద సందడి
గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు వద్ద ఆదివారం సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు లక్నవరం ఉయ్యాల వంతెనపై నుంచి కాకరకాయల బోడు వద్దకు నడుచుకుంటూ వెళ్లి రెస్టారెంట్లో సేదతీరారు. అనంతరం సరస్సులో బోటు షికారు చేస్తూ ఆనందంగా గడిపారు. చిన్న పిల్లలు పార్కులో ఆట వస్తువులతో ఆడుకుంటూ కేరింతలు కొట్టారు. – గోవిందరావుపేట