Photo Feature: క్లీన్‌ హుస్సేన్‌ సాగర్‌.. స్పీడ్‌ వ్యాక్సినేషన్‌ | Local to Global Photo Feature in Telugu: Saraswati Barrage, Hussain Sagar, Farmer Seeding | Sakshi
Sakshi News home page

Photo Feature: క్లీన్‌ హుస్సేన్‌ సాగర్‌.. స్పీడ్‌ వ్యాక్సినేషన్‌

Published Sat, Jun 26 2021 5:14 PM | Last Updated on Sat, Jun 26 2021 5:22 PM

Local to Global Photo Feature in Telugu: Saraswati Barrage, Hussain Sagar, Farmer Seeding - Sakshi

ప్రాణహిత నీటిని ఎత్తిపోస్తుండటంతో సరస్వతీ బ్యారేజీకి జలకళ సంతరించుకుంది. సీజన్‌ మొదలు కావడంతో వ్యవసాయం పనుల్లో రైతులు బిజీ అయిపోయారు. హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ను పరిశుభ్రం చేసేందుకు.. సాగర్‌ పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దేశవ్యాప్తంగా స్పీడ్‌గా  కొనసాగుతోంది. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/9

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

2
2/9

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌ సాగర్‌ను క్లీన్‌ చేసేందుకు.. సాగర్‌ పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు గత కొద్దిరోజులుగా అత్యాధునిక యంత్రాలతో సాగర జాలల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. సంజీవయ్య పార్కు వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో పచ్చని గడ్డితోపాటు వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. – సాక్షి, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్లు

3
3/9

ఇటీవల కురిసిన తొలకరి జల్లులతో సూర్యాపేట జిల్లా రైతాంగం ఏరువాక సాగించి విత్తనాలు విత్తే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా నారుమళ్లను సిద్ధం చేసుకుని వరి మొలక చల్లుతున్నారు. దుక్కులను చదునుచేసుకుని విత్తనాలను విత్తి.. నారు చల్లి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జోరుగా రైతాంగం విత్తనాలు విత్తడం, దుక్కులు దున్నడం పనిలో పడిపోయారు. –సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట

4
4/9

అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ జలకళ సంతరించుకుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్‌లో ఈనెల 16వ తేదీ నుంచి దశలవారీగా మోటార్లతో ప్రాణహిత నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో జలాలు సరస్వతీ బ్యారేజీ చేరుతున్నాయి.

5
5/9

హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేస్తున్న తెలంగాణ అద్దె బస్సుల యాజమానులు

6
6/9

ముంబైలోని కాందివలీలో శుక్రవారం బీఎంసీ డ్రైవ్‌–ఇన్‌ వ్యాక్సినేషన్‌ శిబిరంలో లబ్ధిదారుకు టీకా వేస్తున్న ఆరోగ్య సిబ్బంది

7
7/9

ఇండోనేసియాలోని ట్రెంగలెక్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుని, లాటరీలో మేకను గెలుచుకున్న ఓ మహిళ

8
8/9

ముంబైలోని నారిమన్‌ పాయింట్‌ వద్ద వర్షం కురుస్తుండగా గొడుగులు పట్టుకుని వెళ్తున్న మహిళలు

9
9/9

నల్లసముద్రంలో బ్రిటన్‌ యుద్ధ వాహన నౌక సంచరిస్తుండగా శుక్రవారం మద్యధరా సముద్రంలో రష్యా భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement