seeding
-
నెలకావట్టే.. నేల చదునాయే! మేఘమా.. మరువకే!
నేలకొండపల్లి (ఖమ్మం): వానాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. వరుణుడి రాక కోసం రైతన్న ఆకాశం వైపు చూడక తప్పడం లేదు. ఇంకా పెద్ద వర్షం రాకపోదా.. అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజూ మేఘాలు ఊరిస్తున్నప్పటికీ చిరుజల్లులకే పరిమితమవుతుండడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. పూర్తిస్థాయిలో విత్తనాలు విత్తేందుకు సరిపడా వర్షాలు కురవడం లేదు. రైతులు ఇప్పటికే ఏదో ఒక చోట దొరికిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఇళ్లకు తెచ్చుకున్నారు. 60 మిల్లీ మీటర్ల వర్షపాతం వరకు రెండు, మూడు దఫాలు వర్షాలు కురిస్తేనే పూర్తిస్థాయిలో విత్తనాలు వేసుకునేందుకు అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అదును అయ్యే వరకు విత్తనాలు వేయకపోవటమే మేలని పేర్కొంటున్నారు. తప్పని ఎదురుచూపులు.. సాధారణంగా వరుణుడు ముందస్తుగా కురిస్తే రోహిణిలో లేదంటే మృగశిర కార్తెలో వానాకాలం ప్రారంభమవుతుంది. సీజన్ ప్రారంభమై నెల రోజులవుతున్నా పాలేరు డివిజన్లో 10 శాతం విత్తనాలు కూడా విత్తుకోలేదు. దీంతో పెసర, మినుము విత్తుకోవటమే మేలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయినా కొందరు ధైర్యం చేసి విత్తనాలు విత్తుకోగా, మరికొందరు ఇళ్లలోనే పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. విత్తుకున్న విత్తనాలు సైతం ఇంకా మొలకెత్తలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తుకున్న వారు.., విత్తుకోవాల్సిన వారి చూపులు ఆకాశం వైపు చూడక తప్పడం లేదు. ఆగిన సబ్సిడీ పథకాలు.. గతంలో వ్యవసాయ యాంత్రీకరణ యంత్రలక్ష్మి పథకాలు కింద ట్రాక్టర్లు, యంత్రాలు, వ్యవసాయ పరికరాలు, పిచికారీ యంత్రాలు తదితర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చేవారు. గత నాలుగేళ్లుగా వాటిని ఇవ్వకపోవడంతో రైతులు పూర్తి ధరలు చెల్లించి మార్కెట్లో కొనుగోలు చేసుకుంటున్నారు. నిధులు కోసం ప్రతిపాదనలు పంపుతున్నా మంజూరు కావటం లేదని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు కూడా అందుబాటులో లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
వర్షం కోసం గంగాలమ్మ పండగ
కొయ్యూరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): వర్షంతో తడిపి భూములను సస్యశ్యామలం చేయాలని గిరిజనులు ఏటా ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు గంగాలమ్మ తల్లి పండగను నిర్వహిస్తారు. దాదాపుగా 300 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. నాడు అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి వచ్చిన ఆంగ్లేయులు కూడా ఈ పండగను చూశారు. పంటలు పండాలంటే నీరు కావాలి. అందుకే గంగమ్మను పూజిస్తే.. తల్లి వర్షాన్ని కురిపించి పంటలను పండిస్తుందని ఇక్కడి గిరిజనుల నమ్మకం. ఇక్కడి భూములు చాలా వరకు వర్షాధారం కావడంతో వర్షం తప్పనిసరి. ఒకప్పుడు నెల రోజుల పాటు పండగ చేస్తే.. ఇప్పుడు వారానికే పరిమితమైంది. గిరిజన గ్రామాల్లో విత్తనాలు చల్లికతో ప్రతీ చోట పండగ ప్రారంభిస్తారు. కొన్ని రకాల పప్పులు, వరి విత్తనాలను గంగాలమ్మ తల్లి పేరు చెప్పి పొలంలో చల్లుతారు. ఆ విత్తనాల్లో కొన్నైనా మహిళల చీరకొంగులో పడే విధంగా చూస్తారు. అలా పడిన విత్తనాలను దాస్తారు. తర్వాత వారు వేసే విత్తనాల్లో వీటిని కలిపివేస్తారు. ఇలా వేస్తే తల్లి ఆశీస్సులతో పంటలు బాగా పండుతాయని భావిస్తారు. గ్రామాన్ని క్షేమంగా చూడాలని చిన్న ఈరేడును తయారు చేసి దానిలో బుట్టను ఉంచుతారు. చిన్న కోడిపిల్లను బలి ఇచ్చి గ్రామంలో రెండు వైపులా పొలిమేర వరకు తీసుకువచ్చి వదిలిపెడతారు. దీనిని జడిగా పిలుస్తారు. వారం రోజులే తల్లి ఊరేగింపు ప్రతి రోజూ సాయంత్రం సమయంలో తల్లిని ఊరేగింపుగా అన్ని గృహాల వద్దకు తీసుకెళ్తారు. కుండపై దీపం పెట్టి గంధం, పాల ఆకుల పూలు పెడతారు. ఇలా ఊరేగించిన తర్వాత అసలు పండగ చేపడతారు. ఈ సందర్బంగా గ్రామాల్లో ఊయలను ఏర్పాటు చేస్తారు. ఇందులో పెద్దల నుంచి పిల్లల వరకు అంతా సంతోషంగా ఊగుతారు. గతంలో తల్లి ఊరేగింపును దాదాపుగా నెల రోజుల పాటు చేసేవారు. ఇప్పుడు వారం రోజులకే పరిమితమైంది. కోలాటం.. గంగాచెల్లు.. తల్లికి మేకలను బలి ఇస్తారు. అనేకచోట్ల మంగళవారం రాత్రి అంతా కోలాటం, గంగా చెల్లు పాటలతో జాగారం చేస్తారు. బుధవారం ఉదయాన్నే మేకలను బలి ఇస్తారు. గతంలో కోలాటం, గంగాచెల్లు ఆటలను రాత్రి నుంచి తెల్లవారే వరకు పాడే వారు. ఇప్పుడు ఆ గంగా చెల్లును చాలా చోట్ల మానేశారు. కొంత సేపు కోలాటం ఆడుతున్నారు. బాసికాలు వసూలు మరోవైపు మేకపోతులను వేసిన తర్వాత నుంచి మహిళలు రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టి బాసికాల పేరిట డబ్బులు వసూలు చేస్తారు. వాహనచోదకులకు పసుపు నీటిని రాస్తారు. పురుషులు కోలాటం చేస్తూ ఇంటింటికీ తిరిగి డబ్బులు వసూలు చేస్తారు. గతంలోలా కాకపోయినా.. ప్రతి గ్రామంలో ఈ పండగ నిర్వహిస్తున్నారు. తగ్గిన గొర వేషం, వేటలు మేకలను బలి ఇచ్చిన తర్వాత గ్రామంలో పెద్దలు సంప్రదాయ ఆయుధాలతో వేటకు వెళ్తారు. వేటకు వెళ్లే ముందు పూజలు నిర్వహించి పనసకాయకు బాణాలు వేస్తారు. మరికొన్ని చోట్ల అయితే పంది పిల్లకు బాణాలు వేస్తారు. గతంలో అడవి విస్తరించి ఉండడంతో పాటు వేటాడే నిపుణులు ఉండేవారు. దీంతో వేటకు వెళ్తే ఏదో ఒక జంతువును తెచ్చేవారు. ఇప్పుడు వేటలను చాలా వరకు తగ్గించారు. ఇలా వేటకు వెళ్లే ప్రతి రోజూ రాత్రి సమయంలో గొర వేషాన్ని నిర్వహిస్తారు. జంతువు వేషధారణతో ఒకరిని తయారు చేస్తారు. అతన్ని వేటాడుతున్నట్టుగా బాణాలు వేస్తారు. చుట్టూ జనాలు ఉండి ఆటలాడుతారు. ఈ సందర్భంగా అతని తోకకు పేడ లేదా పసుపు నీరు పూస్తారు. ఇంటింటికీ తిరిగి తోకకు రాసిన పేడ లేదా పసుపు నీరును అందరికీ అంటిస్తారు. ఇదంతా సరదా సాగుతుంది. చిన్నతనంలో బాగుండేది మా చిన్నతనంలో పండగ చాలా బాగుండేది. నెల రోజులకు పైగా జరిగేది. ఇప్పుడు పండగ చేసే రోజులు తగ్గిపోయాయి. అప్పటి మాదిరిగా మహిళలు ఇప్పుడు గంగాచెల్లు ఆడేందుకు రావడం లేదు. పండగ సంప్రదాయ ప్రకారం చేస్తున్నారు. – కె.గంగరాజు, రాజేంద్రపాలెం అన్నిచోట్ల నిర్వహణ మన్యంలో వందల ఏళ్ల నుంచి ఈ పండగ కొనసాగుతోంది. నేడు అనేక చోట్ల బాగానే జరుగుతోంది. అయితే పండగ జరిగే రోజుల సంఖ్య తగ్గిపోయింది. వేటలను చాలా వరకు తగ్గించారు. నాడు కోలాటం, గంగా చెల్లు ఆటలు జరిగితే.. నేడు దానికి భిన్నంగా ఆధునిక పద్ధతిలో పండగ నిర్వహిస్తున్నారు. – డి.వి.డి.ప్రసాద్, ధర్మ జాగరణ సమితి గిరిజన పరియోజన ప్రముఖ్ -
Photo Feature: క్లీన్ హుస్సేన్ సాగర్.. స్పీడ్ వ్యాక్సినేషన్
ప్రాణహిత నీటిని ఎత్తిపోస్తుండటంతో సరస్వతీ బ్యారేజీకి జలకళ సంతరించుకుంది. సీజన్ మొదలు కావడంతో వ్యవసాయం పనుల్లో రైతులు బిజీ అయిపోయారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్రం చేసేందుకు.. సాగర్ పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా స్పీడ్‌గా కొనసాగుతోంది. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
గొర్రు కట్టి.. నాట్లు వేసి...
చెన్నారావుపేట మండలం సూరుపల్లిలో రోడ్లు వర్షానికి బురదమయంగా మారాయి. దీంతో మంగళవారం ఆ రోడ్లపై గ్రామస్తులు గొర్రు కొట్టి, నాట్లు వేసి నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి బురద రోడ్డుపై గట్టి మొరం పోయించాలని కోరారు. – చెన్నారావుపేట -
భారత్‌కు టాప్ సీడింగ్
రియో డి జనీరో: అంతర్జాతీయ చాలెంజ్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత పురుషుల రికర్వ్ జట్టుకు టాప్ సీడింగ్ లభించింది. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు టెస్ట్ ఈవెంట్‌గా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో రాహుల్ బెనర్జీ, జయంత తాలుక్దార్, మంగళ్ సింగ్ చాంపియాలతో కూడిన భారత జట్టు క్వాలిఫయింగ్‌లో 1996 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ బ్రెజిల్‌తో భారత్ తలపడుతుంది. దీపిక కుమారి, రిమిల్ బురిలీ, లక్ష్మీరాణి మాఝీలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు క్వాలిఫయింగ్‌లో 1894 పాయింట్లు స్కోరు చేసి 12వ సీడింగ్‌ను పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ మెక్సికోతో భారత్ ఆడుతుంది. -
‘జంట’ జిల్లాలతో తంటా
పూర్తికాని ఓటరు కార్డు, ఆధార్ అనుసంధానం రంగారెడ్డి, హైదరాబాద్‌లో 40 శాతం దాటని వైనం మిగతా ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికిపైగా సీడింగ్ రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఓటర్లకు చెక్ పెడుతూ.. ఓటరు జాబితాలో అక్రమాలకు కళ్ళెం వేయాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఓటరు కార్డు వివరాలను ఆధార్‌తో అనుసంధానం(సీడింగ్) చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో రాష్ట్ర లక్ష్యం నీరుగారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,81,52,182 మంది ఓటర్లుండగా.. ఇప్పటివరకూ 2,13,04,942 ఓటరు కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 75.67 శాతం సీడింగ్ పూర్తయింది. రెండు జిల్లాల్లోనే వెనుకబాటు.. రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాలకుగానూ ఎనిమిది జిల్లాల్లో ఓటర్ కార్డులు, ఆధార్ వివరాల అనుసంధాన ప్రక్రియ 90 శాతానికి పైగా పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 99.98 శాతం ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత స్థానాల్లో కరీంనగర్ (99.94%), మహబూబ్‌నగర్(99.86%) జిల్లాలున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 90 శాతానికి పైగా సీడింగ్ పూర్తయింది. కానీ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం ఈ ప్రక్రియ 40 శాతం దాటలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భూక్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలనకు దిగిన రెవెన్యూ యంత్రాంగం దాదాపు ఆరు నెలలుగా కుస్తీపడుతున్నా ఇప్పటికీ క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన పూర్తికాలేదు. ఈ క్రతువులో అధికారులు బిజీగా ఉండడంతో ఎపిక్, ఆధార్ సీడింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. వచ్చే నెలలో పట్టాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో సీడింగ్ ప్రక్రియ అటకెక్కినట్లైంది. ఫలితంగా క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకూ సీడింగ్ ప్రక్రియ నెమ్మదిగానే సాగుతుందని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
నత్తనడకన ఓటర్,ఆధార్ అనుసంధానం
జిల్లాలో 33.61 లక్షల ఓటర్లు 5.24లక్షలే ఆధార్‌తో సీడింగ్ ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ సాక్షి, విశాఖపట్నం : ఆధార్‌తో ఓటరు జాబితా అనుసంధానం ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రాష్ర్టంలో తొలిసారిగా విశాఖలోనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత నెల 3వ తేదీ నుంచి దీనిని చేపట్టినప్పటికీ 11న అధికారికంగా జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్చి31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నది అధికారుల సంకల్పం. పని ఒత్తిడితో యంత్రాంగం దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. జిల్లాలో 33 లక్షల 61 వేల 767 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 5లక్షల 24 వేల 654 మంది నుంచి మాత్రమే ఆధార్ నంబర్లు బూత్ లెవెల్ అధికార్ల ద్వారా సేకరించి ఓటరు కార్డులతో అనుసంధానం చేయగలిగారు. ఇంకా సుమారు 28 లక్షల మంది ఓటర్లకు సంబంధించి ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఓటర్-ఆధార్ సీడింగ్ కార్యక్రమానికి బూత్ స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ శిబిరాల్లో ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు, ఓటరు ఐడీ నంబర్లు, మొబైల్ నంబర్లు, మెయిల్ ఐడీలు సేకరించడం, బహుళ ఎంట్రీలు తొలగించేందుకు ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరణ,ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణ చేపట్టాలి. ప్రతీ బూత్ లెవెల్ అధికారి ఓటరు నమోదుకు సవరణ,తొలగింపునకు అవసరమైన ఫారాలు-6, 6ఏ, 7,8,8ఏ, అవసరమైనఫారాలను ఓటర్లకు అందుబాటులో ఉంచనున్నారు. బహుళ ఎంట్రీలు నమోదయితే తొలిగించేందుకు ఫారం నంబరు-7ను స్వీకరించనున్నారు. జిల్లాలోని ఓటర్లందరూ ఈ ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని బూత్ లెవెల్ అధికారికి నిర్ణీత ఫార్మెట్ ఎనగ్జర్-1లో ఆధార్ నంబర్, ఎపిక్ నంబర్ వివరాలు అందజేస్తూ ఈ జాతీయ ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగేశ్వరరావు విజ్ఞప్తిచేశారు. జాతీయ ఓటర్ల సేవా పోర్టల్ (జ్ట్టిఞః//164.100.132.184)లోకి వెళ్లి ఎపిక్ నంబర్, ఆధార్ నంబర్, సెల్ నంబర్, ఇతర వివరాలను పొందుపరిస్తే జనరేట్ అయ్యే ఓటీపీ నంబర్ సెల్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. రెండో పద్ధతిలో మొబైల్ నుంచే ఎపిక్సీడింగ్ ఫోన్ నంబరు-0890499899కు ఎస్ఎంఎస్రూపంలో కడా ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు. సీడ్ ఎపిక్ అని కంపోజ్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు ఐడీ నంబర్ కంపోజ్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ కంపోజ్ చేసి పై నంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ ఎపిక్ నంబర్-ఆధార్ నంబర్‌తో అనుసంధానమైనట్టుగా సెల్‌కు సమాచారం వస్తుంది. మూడో పద్ధతిలో స్టేట్‌లెవల్ హెల్ప్ డెస్క్ నంబర్1950కు ఫోన్ చేసి పేరు, ఎపిక్ నంబర్,ఆధార్ నంబర్లను చెబితే ఆటోమేటిక్‌గా సీడింగ్అవుతుంది.చివరగా కలెక్టరేట్లోనిటోల్ ఫ్రీ నంబరు- 1800- 4250-0001కు ఫోన్ చేసి మీ వివ రాలు చెప్పినా ఆటోమేటిక్‌గా సీడింగ్ అవుతుంది. వివరాలు ఇచ్చిన 24 గంటల్లోగా మీఎపిక్ నంబర్-ఆధార్ నంబర్‌తో సీడింగ్ జరిగిందో లేదో పైనున్న టోల్ ఫ్రీ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో కానీ వెబ్‌పోర్టల్‌లో కానీ వెళ్లి తెలుసుకునే వీలుంది. -
ఆధార్ బేజార్
రవాణా శాఖ సిబ్బందికి తలనొప్పి గడువు ముగిసినా పూర్తికాని రిజిస్ట్రేషన్ జిల్లాలో 33 శాతం సీడింగ్ నమోదు అయినా రాష్ట్రంలో మన జిల్లానే ఫస్ట్ విజయవాడ : వాహనాలకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ రవాణా శాఖకు తలనొప్పిగా మారింది. నగరంలోని కార్యాలయ ఉద్యోగులు మొదలుకుని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల వరకూ అందరూ సాధారణ విధులు మానుకుని ఈ ప్రక్రియలోనే తలమునకలవుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ కోసం రోడ్డున పడి శ్రమిస్తున్నా ఆశిం చిన స్థారుులో ప్రయోజనం కనిపించట్లేదు. మూడు నెలల కిందట రాష్ట్రం లోని 13 జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. ఈనెల పదోతేదీ నాటికే పూర్తి చేయూలని రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు నిర్ణయించారు. కానీ, ఇప్పటికి రాష్ట్రంలో కేవలం 24శాతం ఆధార్ లింకేజ్ మాత్రమే పూర్తరుుంది. అత్యధికంగా 33 శాతంతో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిల వడం విశేషం. డెడ్‌లైన్ దాటినా.. వాహనాల రికార్డులు భద్రపరచటమే లక్ష్యంగా రవాణా శాఖ తన సేవలన్నింటికీ ఆధార్ నంబర్ తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే తొలుత కృష్ణా జిల్లాలోని గుడివాడ, కర్నూలు జిల్లాలోని నంద్యాల మున్సిపాలిటీలను పెలైట్ ప్రాజెక్ట్‌లుగా ఎంపికచేసి ఆధార్ వివరాలు సేకరించారు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత పెలైట్ ప్రాజెక్ట్‌ను అధ్యయనం చేయకుండానే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేశారు. అంతేకాదు.. ఈ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయూలని రవాణా శాఖ కమిషనర్, మంత్రి తరచూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. రెండు వారాలుగా ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిన క్రమంలో ప్రతి జిల్లాలో సగంమందికి పైగా సిబ్బందిని ఆధార్ లింకేజ్కే పురమారుుంచారు. మనజిల్లాలో రవాణాశాఖ, మెప్మా సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్ణీత లక్ష్యంలో 33 శాతానికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈనెల ఒకటో తేదీన నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ వాహనాలకు ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఈనెల పదో తేదీ డెడ్‌లైన్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశించిన గడువులోగా కేవలం 30శాతం మాత్రమే పూర్తికావటంతో దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో నూరు శాతం పూర్తికావటానికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. లక్ష్యం బారెడు జిల్లాలో ఆధార్ లింకేజ్ ప్రక్రియను వేగవంతం చేసినా ఫలితం లేదు. రవాణా శాఖ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు దీనిలో భాగస్వాములయ్యూరు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మనజిల్లా మొదటిస్థానంలో నిలిచింది. అరుుతే, జిల్లాలో 13,72,316 రికార్డులు సేకరించాల్సి ఉండగా, పదో తేదీ నాటికి 4,47,242 మాత్రమే పూర్తయ్యూరుు. విస్సన్నపేటలోని శ్రీసిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థులు మూడు రోజుల వ్యవధిలో 15వేల రికార్డులు సేకరించారు. రాష్ట్రంలోనే అత్యధిక వాహన రికార్డులు తక్కువ రోజుల్లో పూర్తిచేసి రికార్డు సృష్టించారు. దీంతో రవాణా శాఖ అధికారులు అన్ని ప్రైవే ట్ కళాశాలల్లో దీనిని నిర్వహించాలని భావించినా పరీక్షల కాలం దగ్గర పడటంతో విద్యార్థులకు ఇబ్బందిగా ఉం టుందని భావించి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లతోనే పూర్తి చేయిస్తున్నారు. -
ఆధార్.. బేజార్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ‘పింఛన్-ఆధార్’ సీడింగ్ ప్రహసనంగా మారింది. నెలలు గడుస్తున్నా కొలిక్కిరావడంలేదు. డీఆర్డీఏ-ఐకేపీ పింఛన్ విభాగం అధికారులు, సిబ్బంది కంప్యూటర్ల ముందు కూర్చుని కుస్తీ పడుతున్నారు. మరోవైపు సీడింగ్ లేనిదే అక్టోబర్ నుంచి పింఛన్ ఇవ్వబోమని అధికారులు చెబుతుండడంతో వేలాది మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల పెంపు అక్టోబర్ నుంచి అమలులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. సామాజిక భద్రతా పథకం కింద వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు.. ఇతరత్రా లబ్ధిదారులకు రూ.200 నుంచి రూ.వెయ్యి, 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారికి రూ.1,500 ప్రకారం పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆధార్ కార్డుతో లింక్ పెట్టింది. జిల్లా వ్యాప్తంగా 4,10,388 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో వృద్ధాప్య 2,21,687, వితంతు 1,04,854, చేనేత 11,667, అభయహస్తం 18,079, వికలాంగ 53,972, కల్లుగీత పింఛన్‌దారులు 129 మంది ఉన్నారు. ప్రతినెలా కాస్త అటూ ఇటుగా రూ.11.02 కోట్లు పంపిణీ చేస్తున్నారు. అన్ని రకాల పెన్షన్‌కార్డు ఐడీలకు ఆధార్ అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో డీఆర్డీఏ-ఐకేపీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఆధార్ వివరాలను సేకరిస్తున్నారు. రెండు నెలల నుంచి 3.60 లక్షల మంది వివరాలను సేకరించారు. ఇందులో 3.15 లక్షల మంది సీడింగ్ పూర్తి చేశారు. సీడింగ్ సమయంలో ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (యూఐడీ) నంబరుకు పింఛన్ ఐడీకి అనుసంధానం కావడం లేదు. మొదట్లో ఇలాంటి వాటి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. రానురాను పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు 35 వేల వరకు ‘మిస్ మ్యాచింగ్’ జాబితాలో చేరిపోయాయి. ఇంకా సీడింగ్ చేయాల్సినవి చాలా ఉండడంతో ఈ జాబితా మరింత పెరిగే అవకాశముంది. ‘మిస్ మ్యాచింగ్’ జాబితాలోని పింఛన్‌దారుల వివరాలు మరోసారి సేకరించాలని రెండు రోజుల కిందట క్లస్టర్ ఏసీలు, మండల స్థాయి ఏపీవోలను అధికారులు ఆదేశించారు. గ్రామాల వారీగా ఇంటింటికీ వెళ్లి సరైన ఆధార్ యూఐడీ సేకరించాలని సూచించారు. ఇదంతా నాలుగు రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించినా.. ఆశించిన ఫలితం కనిపించడం లేదని తెలుస్తోంది. మరోవైపు సోమవారం సాఫ్ట్వేర్ సరిగా పనిచేయక పోవడంతో సీడింగ్ మందకొడిగా సాగింది. ఇంకా 50 వేల మంది నుంచి ఆధార్ సేకరించాల్సి ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇప్పటికీ ఆధార్‌కు ఎన్రోల్ కూడా చేసుకోలేదని సమాచారం. ఆధార్ ఉన్న వారు కూడా పొరపాట్ల కారణంగా యూఐడీ నంబర్ ఇవ్వడానికి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా తీయించుకుందామన్నా మీ-సేవా కేంద్రాల్లో అరకొర సేవలు అందుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. మొత్తమ్మీద ఆధార్-పింఛన్ అనుసంధాన ప్రక్రియ అటు అధికారులు, ఇటు లబ్ధిదారులకు తలనొప్పిగా పరిణమించింది. దీనివల్ల అక్టోబర్ నుంచి వేలాది మందికి పింఛన్ అందడం ప్రశ్నార్థకంగా మారింది. -
ఆధార్ సీడింగ్‌లో దేశంలో ‘తూర్పు’ ప్రథమం
సాక్షి, కాకినాడ :జిల్లాలో ఉన్న 8,71,774 వంట గ్యాస్ కనెక్షన్లలో 7,37,973 కనె క్షన్లకు ఆధార్ సీడింగ్ పూర్తి చేయడం ద్వారా దేశంలోనే తూర్పుగోదావరి ప్రథమ స్థానంలో నిలిచిందని జాయింట్ కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు అన్నారు. ఇక బ్యాంకు సీడిం గ్ సం బంధించి 5,58,224 కనెక్షన్లకు అకౌంట్ సీడింగ్ పూర్తి చేయడం ద్వారా దేశంలోనే రెండో స్థానంలో నిలిచామన్నారు. వంట గ్యాస్‌కు ఆధార్ అనుసంధానిత సమస్యలపై ఆయన శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి డయల్ యువర్ జేసీ కార్యక్రమం నిర్వహించారు.పలువురు వినియోగదారులు ఆధార్ అనుసంధానిత సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జేసీ మాట్లాడుతూ గ్యాస్‌కు ఆధార్‌తో అనుసంధానిత ప్రత్యక్ష లబ్ధి బదిలీ కింద గ్యాస్ సబ్సిడీ అందించేందుకు కేంద్రం విధించిన గడువు శనివారంతో ముగిసిందన్నారు. ఇప్పటి వరకు ఆధార్ సీడిం గ్ చేసుకున్న వారికి ఆదివారం నుంచి సబ్సిడీ వర్తిస్తుందన్నారు. మరో లక్షా 79 వేల మంది వినియోగదారులు వెంటనే వారి ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాతో సీడింగ్ చేసుకోవాలన్నారు. రాజమండ్రి నుంచి ఒక వినియోగదారుడు ఫోన్ చేసి తనకు రెండు పర్యాయాల నుంచి గ్యాస్ సబ్సిడీ రావడం లేదని చెప్పగా జేసీ స్పందించి అప్పటికప్పుడే ఆన్లైన్లో పరి శీలించారు. ఆధార్ సీడింగ్ జరిగిందని, కానీ సబ్సిడీ ఎందుకు రావడం లేదో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. సుమారు 35 మంది వినియోగదారులు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకురాగా కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. సమస్యల పరిష్కారానికి సోమవారం నుంచి పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ కార్యాలయంలో 0884-6454341 నంబర్‌తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సెలవు రోజులు మినహా ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇది పనిచేస్తుంద న్నారు. -
జిల్లాలో ఇప్పటికీ 38.3 శాతమే ఆధార్ సీడింగ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నగదు బదిలీ పథకం అమలుకు గడువు దగ్గర పడింది. సెప్టెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులను వినియోగదారుల ఖాతాల్లో జమ చేయనున్నామని, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పులు లేవంటూ గురువారం కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో రెండ్రోజుల్లో ఈ పథకం అమల్లోకి రానుండగా.. అధికారుల నిర్వాకం వినియోగదారులను అయోమయంలో పడేసింది. నగదు బదిలీ పథకం అమలు చేయాలంటే వినియోగదారుడి ఆధార్ సంఖ్యను అతని వ్యక్తిగత బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే జిల్లాలోఈ ప్రక్రియ మూడో వంతు మాత్రమే పూర్తికావడం వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 38.3 శాతమే..! జిల్లాలో 13.23లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో ఇప్పటివరకు 9,01,431 వినియోగదారుల క నెక్షన్లు ఆధార్‌తో అనుసంధానమైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఇందులో కేవలం 38.3శాతం వినియోగదారుల వివరాలు మాత్రమే బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేశారు. మొత్తంగా 5,07,319 మంది వినియోగదారుల ఆధార్ వివరాలు మాత్రమే బ్యాంకు ఖాతాతో అనుసంధానమయ్యాయి. ఈ ప్రక్రియ దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతుండడంతో ఈ మేరకు పూర్తి చేశారు. అయితే మరో రెండ్రోజుల్లో ఆధార్, బ్యాంకు ఖాతాల సీడింగ్‌కు గడువు ముగియనుంది. అయితే ఈ రెండ్రోజుల్లో సీడింగ్ ప్రక్రియ పూర్తి చేయడం కష్టమే.! సీడింగ్ పూర్తై వారికే రాయితీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్యాస్ డీలర్‌కు మార్కెట్ ధర చెల్లించి వినియోగదారుడు గ్యాస్ సిలిండర్ పొందాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమిచ్చే రాయితీ నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే ఆధార్, బ్యాంకు ఖాతా సీడింగ్ పూర్తి చేసిన వారికి మాత్రమే రాయితీ జమచేస్తారు. మిగిలిన వారికి ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రాయితీ అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడం అంత సులువు కాదు. దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్నప్పటికీ.. జిల్లాలో కేవలం 38.3శాతం మాత్రమే పూర్తికాగా.. వందశాతం పూర్తి చేయాలంటే చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన వినియోగదారులకు అప్పటివరకు వచ్చే రాయితీ ఎలా చెల్లిస్తారనే అయోమయం నెలకొంది. ఈ విషయంపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.