జిల్లాలో 33.61 లక్షల ఓటర్లు
5.24లక్షలే ఆధార్‌తో సీడింగ్
ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్
సాక్షి, విశాఖపట్నం : ఆధార్‌తో ఓటరు జాబితా అనుసంధానం ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రాష్ర్టంలో తొలిసారిగా విశాఖలోనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత నెల 3వ తేదీ నుంచి దీనిని చేపట్టినప్పటికీ 11న అధికారికంగా జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్చి31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నది అధికారుల సంకల్పం. పని ఒత్తిడితో యంత్రాంగం దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. జిల్లాలో 33 లక్షల 61 వేల 767 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 5లక్షల 24 వేల 654 మంది నుంచి మాత్రమే ఆధార్ నంబర్లు బూత్ లెవెల్ అధికార్ల ద్వారా సేకరించి ఓటరు కార్డులతో అనుసంధానం చేయగలిగారు.
ఇంకా సుమారు 28 లక్షల మంది ఓటర్లకు సంబంధించి ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఓటర్-ఆధార్ సీడింగ్ కార్యక్రమానికి బూత్ స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ శిబిరాల్లో ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు, ఓటరు ఐడీ నంబర్లు, మొబైల్ నంబర్లు, మెయిల్ ఐడీలు సేకరించడం, బహుళ ఎంట్రీలు తొలగించేందుకు ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరణ,ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణ చేపట్టాలి.
ప్రతీ బూత్ లెవెల్ అధికారి ఓటరు నమోదుకు సవరణ,తొలగింపునకు అవసరమైన ఫారాలు-6, 6ఏ, 7,8,8ఏ, అవసరమైనఫారాలను ఓటర్లకు అందుబాటులో ఉంచనున్నారు. బహుళ ఎంట్రీలు నమోదయితే తొలిగించేందుకు ఫారం నంబరు-7ను స్వీకరించనున్నారు. జిల్లాలోని ఓటర్లందరూ ఈ ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని బూత్ లెవెల్ అధికారికి నిర్ణీత ఫార్మెట్ ఎనగ్జర్-1లో ఆధార్ నంబర్, ఎపిక్ నంబర్ వివరాలు అందజేస్తూ ఈ జాతీయ ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగేశ్వరరావు విజ్ఞప్తిచేశారు.
జాతీయ ఓటర్ల సేవా పోర్టల్ (జ్ట్టిఞః//164.100.132.184)లోకి వెళ్లి ఎపిక్ నంబర్, ఆధార్ నంబర్, సెల్ నంబర్, ఇతర వివరాలను పొందుపరిస్తే జనరేట్ అయ్యే ఓటీపీ నంబర్ సెల్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. రెండో పద్ధతిలో మొబైల్ నుంచే ఎపిక్‌సీడింగ్ ఫోన్ నంబరు-0890499899కు ఎస్‌ఎంఎస్‌రూపంలో కడా ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు. సీడ్ ఎపిక్ అని కంపోజ్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు ఐడీ నంబర్ కంపోజ్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ కంపోజ్ చేసి పై నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ ఎపిక్ నంబర్-ఆధార్ నంబర్‌తో అనుసంధానమైనట్టుగా సెల్‌కు సమాచారం వస్తుంది.
మూడో పద్ధతిలో స్టేట్‌లెవల్ హెల్ప్ డెస్క్ నంబర్1950కు ఫోన్ చేసి పేరు, ఎపిక్ నంబర్,ఆధార్ నంబర్లను చెబితే ఆటోమేటిక్‌గా సీడింగ్‌అవుతుంది.చివరగా కలెక్టరేట్‌లోనిటోల్ ఫ్రీ నంబరు- 1800- 4250-0001కు ఫోన్ చేసి మీ వివ రాలు చెప్పినా ఆటోమేటిక్‌గా సీడింగ్ అవుతుంది. వివరాలు ఇచ్చిన 24 గంటల్లోగా మీఎపిక్ నంబర్-ఆధార్ నంబర్‌తో సీడింగ్ జరిగిందో లేదో పైనున్న టోల్ ఫ్రీ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో కానీ వెబ్‌పోర్టల్‌లో కానీ వెళ్లి తెలుసుకునే వీలుంది.
నత్తనడకన ఓటర్,ఆధార్ అనుసంధానం
Published Fri, Apr 17 2015 4:12 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement
Advertisement