
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నెక్లెస్ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్ పక్కన నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సోమవారం ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం రెండు గంటల వరకు పార్థీవ దేహాన్ని అక్కడే ఉంచుతారు. పీవీ ఘాట్ పక్కన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జైపాల్‌రెడ్డి భౌతిక కాయానికి ఎంపీ రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పీవీ ఘాట్ వద్ద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment