హైదరాబాద్: ఓమ్నీ ఆస్పత్రి, ఆసియా స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన 3కే వాక్‌ను పంచాయతి రాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెళ్లిచూపులు ఫేమ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు.