Omni Hospital
-
యాక్టివాను ఢీకొన్న స్కార్పియో
భార్యాభర్తలకు తీవ్రగాయాలు.. భార్య పరిస్థితి విషమం స్కార్పియోలో ఆరుగురు మైనర్లు ప్రగతినగర్ వద్ద ఘటన హైదరాబాద్: మైనర్లు నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో భార్యాభర్తలకు తీవ్రగాయాలరుున ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రగతినగర్‌లో ఫ్లాట్ కొనేందుకు నాగేంద్రకుమార్, దేవి యాక్టివాపై ఆదివారం సాయంత్రం బయలుదేరారు. మిథిలానగర్ వద్దకు రాగానే వీరి వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో(ఏపీ 29 ఏటీ 2799) ఢీకొట్టింది. దేవి తలకు తీవ్రగాయం కావడంతో కోమాలోకి వెళ్లగా.. నాగేంద్రకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన దేవి పరిస్థితి విషమంగా ఉండగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగేంద్రకుమార్ కాలు, చేయి విరిగాయి. ప్రమాద సమయంలో స్కార్పియోలో ఆరుగురు 10వ తరగతి విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా పరారీలో ఉన్నారని.. కారులో ఫణీంద్ర, సాయి నిఖిల్, తేజ, మౌళి, రాములతో పాటు మరో విద్యార్థి ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. వాహనాన్ని సాయినిఖిల్ నడిపినట్లు.. వీరు నిజాంపేటలోని భాష్యం స్కూల్లో చదువుతున్నట్లు తెలిపారు. కాగా స్కార్పియో సాయి నిఖిల్ తండ్రిదిగా పోలీసులు గుర్తించారు. -
ఇంజక్షన్ వికటించి గర్భిణీ మృతి
హైదరాబాద్: కూకట్పల్లి ఓమ్ని ఆసుపత్రిలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఇంజక్షన్ వికటించి స్రవంతి(25) అనే గర్భిణీ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యమే స్రవంతి మృతికి కారణమని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స తీసుకున్న అనంతరం డిశ్చార్జ్ చేసే సమయంలో ఇంజక్షన్ ఇవ్వడంతో స్రవంతి కోమాలోకి వెళ్లి మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. తమ కుమార్తె మృతికి కారణమైన డాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని తండ్రి వీరేశం, అమ్మ సుజాతలు డిమాండ్ చేశారు. -
నెక్లెస్‌రోడ్‌లో 3కే వాక్
హైదరాబాద్: ఓమ్నీ ఆస్పత్రి, ఆసియా స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన 3కే వాక్‌ను పంచాయతి రాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెళ్లిచూపులు ఫేమ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు. -
ఓమిని ఆస్పత్రి వైద్యులపై ఆరోపణ
-
ఓమ్ని హాస్పిటల్ ముందు రోగి బంధువుల ఆందోళన
కొత్తపేట ఓమ్ని ఆస్పత్రి ముందు ఓ రోగి బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం ఎల్వర్తి గ్రామానికి చెందిన శంకరయ్య (42) అనే వ్యక్తి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరగా బుధవారం ఉదయం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ అతడి బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. బుధవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పి మంగళవారం రూ.2 లక్షలు కట్టించుకున్నారని... తీరా బుధవారం ఉదయం మృతి చెందినట్టు చెప్పారని ఆరోపించారు. కాగా, కండిషన్ సీరియస్‌గా ఉందని, ఏమీ చెప్పలేమని ముందే స్పష్టం చేశామని, అవసరమైతే వీడియో కౌన్సెలింగ్ ఆధారాలను చూపిస్తామని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది.