సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం వద్ద ఫార్ములా- రేసింగ్ పోటీలు సందడిగా సాగాయి. రెండో రోజు ఫార్ములా-ఈ రేసింగ్‌కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకైనా ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని అన్నారు. నెక్లెస్ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడటానికి ఎంతో బాగుందని హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాదులో ఉన్న యువత, క్రీడాభిమానులు ఈ రేస్‌ను చూసేందుకు తరలివస్తున్నారని చెప్పారు. ఈ ఈవెంట్స్‌లో కొంత అసౌకర్యం కలుగుతుందన్నమాట నిజమేనన్న కేటీఆర్.. కానీ అది మన్నించి సహకరిస్తున్నందుకు నగరవాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇంటువంటి కార్యక్రమాలతో హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, ఈ కార్యక్రమం సవ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
కాగా దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలను వీక్షించేందుకు సినీ, క్రీడా రంగాలకు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలిరావడంతో అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తోపాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, సినీనటుడు నాగచైతన్య, అఖిల్ అక్కినేని. మహేశ్ బాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నారా బ్రాహ్మణి హుస్సేన్ సాగర్ తీరానికి విచ్చేశారు.
చదవండి: హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్.. సెలబ్రిటీల సందడి
Comments
Please login to add a commentAdd a comment