సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్ రద్దైన విషయం తెలిసిందే. ఈ-రేస్ సీజన్-10 నాలుగో రౌండ్ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా నిర్వహాకులు రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ఫార్ములా రేస్ రద్దు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇక, ఫార్ములా రేసింగ్ రద్దుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్.. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం, భారత్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాయని సూచించారు. చాలా మంది ఈ రేసింగ్ చూడటానికి ఆసక్తి చూపారు.
This is truly a poor and regressive decision by the Congress Government
— KTR (@KTRBRS) January 6, 2024
Events like Hyderabad E-Prix enhance the brand image of our City and Country across the world. We had put in a lot of effort and time to bring Formula E-Prix for the first time to India 🇮🇳
In a world… https://t.co/8tCIBEcgB5
ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ-రేసింగ్‌పై తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సరైంది కాదు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించాము. ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, అంతకుముందు ఫార్ములా రేసింగ్‌పై నిర్వాహకులు స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. గతేడాది అక్టోబర్ 30న చేసుకున్న ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఈవో తెలిపారు. అలాగే, ఫార్ములా రేసింగ్‌ను హైదరాబాద్‌కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment