సాక్షి, బంజారాహిల్స్: నెక్లెస్ రోడ్...నిత్యం వేలాది మంది నగర వాసులు, పర్యాటకులతో కళకళలాడుతూ ఉండే మార్గం. అయితే, ఇక్కడికి వచ్చే పర్యాటకులు తాము తాగే వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దీని ద్వారా పారిశుధ్యం సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సైతం స్పందించి ప్రజలను ఈ విషయంలో చైతన్యపరచాలని ఆదేశించారు.
దీంతో ఖాళీ బాటిళ్లను డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలని చైతన్య పరిచే విధంగా జీహెచ్‌ఎంసీ అధికారులు వాటర్ బాటిల్ మాదిరిగా ఐరన్‌తో చేసిన పెద్ద బాటిల్ నమూనాను నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేశారు. ఈ వినూత్న బాటిల్ డస్ట్‌బిన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment