ఒలంపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు దేశం గర్వించే విధంగా పతకాలు గెలవాలని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి టి. పద్మారావు అన్నారు.
హైదరాబాద్ : ఒలంపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు దేశం గర్వించే విధంగా పతకాలు గెలవాలని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి టి. పద్మారావు అన్నారు. రియో ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నగరంలోని నక్లెస్ రోడ్డులో 'రన్ ఫర్ రియో' పరుగును నిర్వహించారు. దీనిని మంత్రి పద్మారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.