ఫార్ములా–ఇ కారుతో మహీంద్ర డ్రైవర్లు గ్రాసీ, దారువాలా, రోలండ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫార్ములా–ఇ రేసింగ్‌కు భాగ్యనగరం సిద్ధమైంది. రెండు రోజుల ఈ ఈవెంట్‌లో భాగంగా శుక్రవారం సాయంత్రం తొలి ఫ్రీ ప్రాక్టీస్ జరుగుతుంది. పోటీల్లో పాల్గొంటున్న 11 జట్ల రేసర్లు ట్రాక్‌తో పాటు తమ కార్లను, వాటి పనితీరును పరీక్షించుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ ప్రాక్టీస్‌ను వాడుకుంటారు.
అసలైన రేస్ ఎప్పుడు, ఎలా?
ఇక శనివారం కూడా రెండో ఫ్రీ ప్రాక్టీస్‌తో పాటు ఉ.10.40నుంచి క్వాలిఫయింగ్ పోరు జరుగుతుంది. అనంతరం మ.గం. 3 గంటలకు అసలైన రేస్ ప్రారంభమవుతుంది. దాదాపు గంటన్నర పాటు సాగే ఈ రేస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలో నెక్లెస్‌రోడ్‌పై ఏర్పాటు చేసిన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ 2.83 కిలోమీటర్లు పొడవు ఉంది. ఇందులో మొత్తం 18 మలుపులు ఉన్నాయి.
భారత రేసర్లు లేకపోయినా
భారత్‌కు చెందిన రేసర్లు ఎవరూ లేకపోయినా మహీంద్ర టీమ్‌తో పాటు టాటా స్పాన్సర్‌గా ఉన్న జాగ్వార్ టీమ్‌పై రేసింగ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. మహీంద్రా టీమ్‌లో రిజర్వ్ డ్రైవర్‌గా జెహాన్ దారువాలా ఉన్నాడు. గరిష్టంగా 322 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తి ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ‘బుక్ మై షో’లో ఈ రేసు కోసం టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: IND vs AUS: ఆసీస్ స్పిన్నర్ దెబ్బకు సూర్యకు మైండ్ బ్లాంక్.. అయ్యో ఇలా జరిగిందే!!
Dasun Shanaka: అతడిని కొనేంత డబ్బు లేదు! నేనేమీ బాధపడటం లేదు! ఇండియాలో..
Comments
Please login to add a commentAdd a comment