
చార్మి@2కే వాక్
హైదరాబాద్ : వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2కె వాక్‌ను సినీనటి చార్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ జనాభాలో సగం మందికి మరుగుదొడ్లు లేకపోవడం దారుణమన్నారు. మరుగుదొడ్ల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కంట్రోలర్ పీసీ గుప్తాతో పాటు సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.