'విభజన హామీలను బీజేపీ సర్కార్ విస్మరిస్తోంది' | former PM Manmohan singh fires on bjp govt at bandlapalli meeting | Sakshi
Sakshi News home page

'విభజన హామీలను బీజేపీ సర్కార్ విస్మరిస్తోంది'

Published Tue, Feb 2 2016 4:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

'విభజన హామీలను బీజేపీ సర్కార్ విస్మరిస్తోంది' - Sakshi

'విభజన హామీలను బీజేపీ సర్కార్ విస్మరిస్తోంది'

అనంతపురం: విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా బండ్లపల్లి బహిరంగ సభకు మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడు ఆ హామీలన్నింటినీ విస్మరించిందన్నారు. ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తే అభివృద్ధి చెందుతుందని అందరం భావించమని..కానీ, బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని మన్మోహన్ పేర్కొన్నారు.    

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పదేళ్లు పూరైన సందర్భంగా  అనంతపురం జిల్లాలో బహిరంగసభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement