![Complaint Against Ram Gopal Varma in Anantapur - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/23/ramgopal-varma.jpg.webp?itok=I3xqFgWf)
సాక్షి, అనంతపురం: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. తాజాగా అనంతపురం టూటౌన్ పీఎస్‌లో ఆయనపై బీజేపీ నేతలు మంగళవారం ఫిర్యాదు చేశారు. దేవుళ్లను కించపరుస్తూ అశ్లీలచిత్రం రూపొందించిన వర్మపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నీలి చిత్రాల నటి మియా మాల్కోవాతో ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ పేరుతో ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాపై మహిళా సంఘాలు, సంప్రదాయవాదులు మండిపడుతున్నారు. భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నాడంటూ దుయ్యబడుతున్నారు. ఆయనకు పిచ్చి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ మహిళా మోర్చ నేతలు శుక్రవారం విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లోనూ వర్మపై ఫిర్యాదు చేశారు. పద్ధతి మార్చుకోకపోతే రాంగోపాల్ వర్మ పిచ్చి వదిలిస్తామని బీజేపీ మహిళా మోర్చ నేతలు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment