పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఇస్లామాబాద్లోని అవినీతి నిర్మూలన కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఇస్లామాబాద్లోని అవినీతి నిర్మూలన కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం ఆయన కోర్టు ఎదుట హాజరు కావాల్సిఉన్నా విదేశాల్లో ఉన్నందున రాలేకపోయారు. ఈ నెల 29న హాజరు కావాల్సిందిగా కోర్టు నోటీసులు జారీ చేసింది. పదవీకాలం ముగియడంతో ఇటీవల పాక్ అధ్యక్షుడిగా వైదొలిగిన జర్దారీ అవినీతి కేసుల్లో కూరుకుపోయారు. ఆయనపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.
ఇవన్నీ జర్దారీ అధికారంలో ఉన్నపుడు అధికార దుర్వినియోగానికి సంబంధించినవి. ఈ కేసులను పునఃప్రారంభించాల్సిందిగా జాతీయ పారదర్శక విభాగం (ఎన్ఏబీ) కోర్టు న్యాయమూర్తి గత నెలలో ఆదేశించినట్టు కథనం. వీటిని సుమోటాగా స్వీకరించింది. పాక్ అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న జర్దారీ గత నెల 6న కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రస్తుతం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్గా ఉన్నారు. క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు దృష్టిసారిస్తున్నారు.