
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అతని సోదరుడు షాబాజ్ షరీఫ్‌లపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. గతంలో నన్ను రెండు సార్లు హత్య చేసేందుకు నవాజ్ అతని సోదరుడు షాబాజ్ ప్రయత్నించినట్లు జర్దారీ పేర్కొన్నారు. గతంలో అవినీతి కేసుల విషయంలో జర్దారీ సుదీర్ఘ కాలం కోర్టులు, జైలు చుట్టూ తిరిగారు. అదే సమయంలో ఒక సందర్భంలో కోర్టుకు హాజరవుతున్న సమయంలో నన్ను హత్య చేసేందుకు షరీఫ్ సోదరులు కుట్ర పన్నారని జర్దారీ ఆరోపించారు. నాకు నా భార్య బేనజీర్ భుట్టోకు షరీష్ సోదరులు చేసినదానిని ఎన్నటికీ మర్చిపోను అని జర్దారీ అన్నారు.