
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రజలు ప్రజా పాలకులకన్నా.. మిలటరీ పాలకుల పరిపాలనే బాగుందని తాజా సర్వేలో స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు, మంత్రుల్లో 99 శాతం మంది అవినీతి పరులేనంట పాక్ ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజా ప్రభుత్వాల కన్నా.. మిలటరీ పాలకుల ఏలుబడిలోనే దేశం అంతోఇంతో అభివృద్ధి సాంధించిందని ప్రజలు అభిప్రయాపడ్డారు. దేశం ఏర్పడ్డనాటినుంచి ఇప్పటి వరకూ అద్భుతంగా పాలించిన నేతలపై డాన్ పత్రిక సర్వే నిర్వహించింది.. ఇందులో పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- ఇప్పటివరకూ పాకిస్తాన్‌ను పాలించిన ప్రధానమంత్రుల్లో.. మొదటి ప్రధాని లియాఖత్ ఇలీఖాన్ అత్యద్భుత పాలకుడని మెజారటీ పాకిస్తానీయులు అభిప్రయాన్నివ్యక్తం చేశారు.
- మిలటరీ పాలకుల్లో మహమ్మద్ ఆయూబ్ ఖాన్ పాలన ప్రజారంజకంగా సాగిందని సర్వేలో ప్రజలు తెలిపారు.
- బెనజీర్ భుట్టో కన్నా.. మిలటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ చాలా మేలని ప్రజలు స్పష్టం చేశారు.
- ఆసిఫ్ ఆలీ జర్దారీ అత్యంత చెత్త అధ్యక్షుడని ప్రజలు తీర్పు చెప్పారు.
- మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి పరుడని.. అతని వల్ల దేశానికి ఎటువంటి మేలు జరగదనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేశారు.