Musharraf
-
అందుకేనా!.. ముషారఫ్ రాహుల్‌ని ప్రధానిగా చూడాలనుకుంది: బీజేపీ
పాక్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్ మృతికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ముషారఫ్ శాంతి కోసం శత్రువుగా మారిన నిజమైన శక్తి అని ఆయన అభివర్ణించారు. దీంతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా శశిథరూర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. బాలాకోట్ దాడులను అనుమానించి సొంత ఆర్మీ చీఫ్‌ని గూండాగా పిలిచిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది ఫైర్ అయ్యారు. పైగా ముషారఫ్‌పై తెగ అభిమానం కురిపిస్తోందంటూ ధ్వజమెత్తారు. ముషారఫ్ ఒకప్పుడు భారతదేశానికి నిష్కళంకమైన శత్రువు కానీ 2002 నుంచి 2007 మధ్య శాంతికి నిజమైన శక్తిగా మారాడని శశిథరూర్ ట్విట్టర్లో అన్నారు. ఆ రోజుల్లో తాను యూఎన్‌లో ఉండగా ఏటా అతన్ని కలుసుకునేవాడినని చెప్పారు. అతను వ్యూహాత్మకంగా చాలా తెలివిగా వ్యవహరించేవాడని పేర్కొన్నారు. దీంతో షెహజాద్ ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్లను ప్రశంసించే ముషారఫ్ రాహుల్ గాంధీని కూడా ప్రసంసించారంటూ నాటి సంఘటనను గుర్తు చేశారు. కార్గిల్ యుద్ధానికి కారకుడు, ఉగ్రవాదానికి మద్దతుదారుడు అయిన ముషారఫ్‌ని ప్రశంసించడానికి బహుశా అదేనా కారణం అంటూ విరుచుకుపడ్డారు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ముషారఫ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను షెహజాద్ ప్రస్తావించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ని ప్రధానిగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. అంతేగాదు నిజాయితీగా చెప్పాలంటే.. భారత్ లేదా పాకిస్తాన్ కోసమో కాదు. నిజంగా శాంతి కావాలంటే మోదీ సాబ్ వద్దు అని అన్నారు. అలాగే తన తల్లి, అన్నయ్య, కొడుకు ఢిల్లీకి వెళ్లినప్పుడూ.. రాహుల్ గాంధీ తన కొడుకుని టీ తాగడానికి ఆహ్వానించారని చెప్పారు. అలాగే మన్మోహన్ సింగ్ తమ ముగ్గురిని భోజనానికి ఆహ్వానించారని అన్నారు. తాను భారత్‌తో క్రికెట్‌ని ప్రోత్సహించేవాడినని, దీంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పరిచే వాటిని తాను ప్రోత్సహిస్తానని ముషారఫ్ చెప్పుకొచ్చారు. కాగా అమిలోయిడోసిస్తో బాధపడుతున్న ముషారఫ్ దుబాయ్ ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. “Pervez Musharraf, Former Pakistani President, Dies of Rare Disease”: once an implacable foe of India, he became a real force for peace 2002-2007. I met him annually in those days at the @un &found him smart, engaging & clear in his strategic thinking. RIP https://t.co/1Pvqp8cvjE — Shashi Tharoor (@ShashiTharoor) February 5, 2023 (చదవండి: శునకానికి కుల ధృవీకరణ పత్రమా! కంగుతిన్న అధికారులు) -
నిర్మల్: టెన్నిస్ కోర్టుకు మళ్లీ వీఆర్ఏలు
సాక్షి,నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ టెన్నిస్ ఆట వ్యవహారం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. నిర్మల్ టెన్నిస్ కోర్టులో మళ్లీ వీఆర్ఏలకు డ్యూటీలు విధించారు. దీంతో వీఆర్ఏలు విధులకు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ తాను టెన్నిస్ ఆడుతుంటే.. బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ చర్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా గురువారం సైతం వీఆర్ఏలకు టెన్నిస్ కోర్టు వద్ద డ్యూటీలు విధించడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. తమకు టెన్నిస్ కోర్టు వద్దే ప్రతి సాయంత్రం డ్యూటీలు విధించారని.. అందుకోసమే ఏం చేయాలో తెలియక ఇక్కడే విధులు నిర్వహస్తామంటున్నారు వీఆర్ఏలు. అయితే తాము టెన్నిస్ కోర్టుకు వచ్చేసరికి ఇంకా కలెక్టర్ టెన్నిస్ కోర్టు వద్దకు రాలేదని వీఆర్ఏలు పేర్కొన్నారు. ప్రతి రోజూ డే అంతా ఇక్కడే డ్యూటీ చేస్తామని అన్నారు. వెనకాల ఇద్దరు.. నెట్ మధ్యలో ఇద్దరం ఉంటామని చెప్పారు. ఈ రోజు టెన్నిస్ కోర్టుకు నలుగురు వీఆర్ఏలు వచ్చామని అన్నారు. సాయంత్రం స్పెషల్ డ్యూటీ టెన్నిస్ కోర్టులో వేస్తారని తెలిపారు. -
కలెక్టర్ టెన్నిస్ ఆట కోసం.. 21 మంది వీఆర్ఏలకు విధులు
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ టెన్నిస్ హెల్పర్లుగా 21 మంది పేర్లతో నిర్మల్ తహసీల్దార్ శివప్రసాద్ ఓ జాబితాను విడుదల చేశారు. ఆ జాబితా ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రోజూ సాయంత్రం 5.30 గంటలకు నిర్మల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వెనకే ఉన్న గ్రౌండ్లో సహచర అధికారులతో కలిసి టెన్నిస్ ఆడతారు. కలెక్టర్ టెన్నిస్ ఆడే సమయంలో కోర్టు వద్ద బంతులు అందించేందుకు రోజుకీ ముగ్గురు చొప్పున వారానికి 21 మంది వీఆర్ఏలకు తహసీల్దార్ ప్రత్యేక విధులు కేటాయించారు. వీరిపై పర్యవేక్షణకు మరో ఏడుగురు వీఆర్వోలను నియమిస్తూ సోమవారం డీ/777/2020 నంబర్‌తో ప్రత్యేక ప్రొసీడింగ్ జారీ చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కలెక్టర్ ఆదేశాలతోనే తహసీల్దార్ ఈ జాబితా రూపొందించారా, లేక తహసీల్దారే అత్యుత్సాహంతో జాబితాను విడుదల చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వీఆర్ఏలకు విధులు అప్పజెప్పడంపై వివాదం చేలరేగడంతో వీఆర్ఏలను కలెక్టర్ వెనక్కి పంపారు. వీఆర్ఏలు లేకుండా బుధవారం గేమ్ ఆడారు. చదవండి: పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయం: గంగుల కమలాకర్ -
ఇండో-పాక్ యుద్ధంపై ముషార్రఫ్ కీలక వ్యాఖ్యలు
యూఏఈ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మళ్లీ ప్రమాద స్దాయికి చేరుకున్నాయని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. ఇరు దేశాల మధ్య అణ్వస్త్ర దాడి ఉండబోదని వ్యాఖ్యానించారు. తాము ఒక అణు బాంబుతో భారత్‌పై దాడి చేస్తే పొరుగు దేశం(భారత్) 20 అణు బాంబులతో తమను నాశనం చేస్తుందని చెప్పుకొచ్చారు. భారత్‌పై తొలుత తాము 50 అణుబాంబులతో విరుచుకుపడటమే దీనికి పరిష్కారమన్నారు. అలా చేస్తేనే భారత్ తిరిగి తమపై ప్రతిదాడి చేసే అవకాశం సన్నగిల్లుతుందన్నారు. కాగా పాకిస్తాన్‌తో మెరుగైన సంబంధాల కోసం ఇజ్రాయెల్ ఆసక్తి కనబరుస్తోందన్నారు. తమ దేశంలో రాజకీయ వాతావరణం సానుకూలంగా ఉంటే తాను పాకిస్తాన్‌కు తిరిగి వెళతానని దుబాయ్‌లో ఆశ్రయం పొందుతున్న ముషార్రఫ్ పేర్కొన్నారు. కాగా, 2001–08 మధ్యకాలంలో పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషార్రఫ్, అభిశంసన నుంచి తప్పించుకునేందుకు రాజీనామా చేశారు. చికిత్స పేరుతో దుబాయ్ వెళ్లిన ముషార్రఫ్ మళ్లీ పాక్‌కు రాలేదు. 2007లో రాజ్యాంగాన్ని రద్దుచేయడంతో ముషార్రఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. -
ధోనిని వాఘా సరిహద్దు నుంచి తెచ్చుకున్నాం!
ముంబయి: దాయాది పాకిస్థాన్‌తో ఆ దేశంలో జరిగిన 2005–06 ద్వై పాక్షిక సిరీస్ సందర్భంగా అప్పటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్‌కు తనకు మధ్య జరిగిన ఓ సరదా సంభాషణను భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘నాకు ఇప్పటికీ గుర్తుంది. 2006లో పాకిస్థాన్ టూర్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ మ్యాచ్ తర్వాత ‘అతడిని ఎక్కడి నుంచి తీసుకువచ్చార’ని ధోనీ గురించి ముషారఫ్ అడిగాడు. దీంతో వాఘా సరిహద్దుల్లో నడిచి వెళ్తోన్న అతడిని మేం తెచ్చేసుకున్నాం’ అని తను సరదాగా సమాధాన మిచ్చినట్లు దాదా వెల్లడించారు. అలాగే ధోనీ ప్రస్తుత ఫామ్ గురించి మాట్లాడుతూ ‘ధోనీ ఒక ఛాంపియన్. టీ20 ప్రపంచ కప్ గెలిచిన దగ్గరి నుంచి అతడి కెరీర్ అద్భుతంగా సాగింది. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం. ఎక్కడున్నాం. ఎంత వయసు, అనుభవం ఉంది.. అనేదాని కంటే మన ప్రదర్శనే కీలకం. లేకపోతే మన స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేస్తారు’ అని గంగూలీ అన్నారు. అయితే 2019 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత బృందంలో ధోనీ పేరు ఉంటుందా అని ప్రశ్నించగా.. ‘నేను సెలెక్టర్‌ను కాను. కానీ ఇప్పుడున్న బృందంలో 85–90 శాతం ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం ఉంది’ అభిప్రాయపడ్డాడు. -
స్వదేశం వచ్చేందుకు సైనికుడికి భయమెందుకు?
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ సైనిక పాలన అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాక్ సుప్రీం కోర్టు ఝలకిచ్చింది. పాకిస్తాన్‌కు రావాలంటే తనకు భారీ భద్రత కల్పించాలన్న ముషారఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సొంత దేశానికి రావాడానికి సైనికుడు ఎందుకు భయపడతాడు అంటూ ముషారఫ్‌ను ఉద్దేశించి సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్‌లో ఉంటున్నారు. గతంలో పాకిస్తాన్ సైన్యంతో తిరుగుబాటు చేయించి, ముషారఫ్ అధ్యక్ష పదవిని చేపట్టారు. 1998 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ను పరిపాలించారు. అయితే 2013లో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా పెషావర్ కోర్టు ముషారఫ్‌పై నిషేధం విధించింది. కాగా, వచ్చే నెల 25న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందులో పోటీ చేసేందుకు అనుమతినిస్తూ.. తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన పాక్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని ముషారఫ్‌ను సుప్రీం ఆదేశించింది. పాకిస్తాన్‌కు వస్తే తనకు భారీ భద్రత ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. భద్రత విషయమై ఆయనకు ఎలాంటి సమాధానం అందలేదు. బుధవారం సుప్రీం కోర్టు చేపట్టిన విచారణకు ముషారఫ్ హాజరు కాలేదు. దాంతో సుప్రీం కోర్టు ఆయనకు ఒక రోజు గడువు ఇస్తూ.. గురువారం 2 గంటలకు కోర్టులో హాజరు కావాల్సిందేనని అల్టిమేటమ్ జారీ చేసింది. -
ఉగ్రవాద సంస్థలపై ముషారఫ్ ప్రేమాభిమానాలు
-
నియంతృత్వ పాలన దిశగా పాక్?!
పాకిస్తాన్లో మళ్లీ నియంతృత్వ పాలన రానుందా? పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పూర్తికాలం మనుగడ సాగించలేవా? ప్రజా ప్రభుత్వాలకంటే.. నియంతృత్వ పాలకులే మేలని ప్రజలు అనుకుంటున్నారా? పారిణామాలు చూస్తుంటే.. ఏదైనా జరగవచ్చు అని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇస్లామాబాద్ : ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. దేశం సైనిక పాలన దిశగా మళ్లుతున్న అనుమానాలు వస్తున్నాని అంతర్జాతీయ ఆన్లైన్ న్యూస్ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రస్తుతంపాకిస్తాన్లో అత్యంత కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని ఆ మేగజైన్ పేర్కొంది. పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఏర్పాటు చేసిన గ్రాండ్ అలయెన్స్, అదే సమయంలో ఆయన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు మద్దతు పలకడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయని మేగజైన్ తెలిపింది. ముంబై దాడులు సూత్రధారి హఫీజ్ సయీద్ ఇప్పటికే 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే గృహనిర్భంధంలో ఉన్న సమయంలోనే హఫజ్ సయీద్ మిల్లీ ముస్లిం లీగ్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. హహీజప్ సయీద్ గృహనిర్భంధాన్ని పొడిగించాలన్న పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థనను పాక్ న్యాయవ్యవస్థ తోసిపుచ్చడం కూడా అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. పాకిస్తాన్ సైన్యం, మత సంస్థలు.. తమ మధ్యనున్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా అడుగులే వేస్తున్నాయి. ఇదే అత్యంత ప్రమాదకర పరిణామాలకు సంకేతాలని మేగజైన్ తెలిపింది. హఫీజ్ సయీద్ విడుదల తరువాత పాకిస్తాన్లో జీహాదీ గ్రూపులు మరింత ధైర్యంగా, స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటివరకూ మతసంస్థల అధిపతులగా ఉన్న వ్యక్తులంతా.. హఫీజ్ సయీద్ బాటలో.. ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాజీ మిలటరీ పాలకుడు ముషారఫ్ త్వరలోనే పాకిస్తాన్లో తిరిగి అడుగు పెటడుతున్నట్లు జీహాదీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముషారఫ్ పాక్‌లో అడుగు పెడితే.. పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ముషారఫ్ పాలనే బెటర్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రజలు ప్రజా పాలకులకన్నా.. మిలటరీ పాలకుల పరిపాలనే బాగుందని తాజా సర్వేలో స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు, మంత్రుల్లో 99 శాతం మంది అవినీతి పరులేనంట పాక్ ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజా ప్రభుత్వాల కన్నా.. మిలటరీ పాలకుల ఏలుబడిలోనే దేశం అంతోఇంతో అభివృద్ధి సాంధించిందని ప్రజలు అభిప్రయాపడ్డారు. దేశం ఏర్పడ్డనాటినుంచి ఇప్పటి వరకూ అద్భుతంగా పాలించిన నేతలపై డాన్ పత్రిక సర్వే నిర్వహించింది.. ఇందులో పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకూ పాకిస్తాన్‌ను పాలించిన ప్రధానమంత్రుల్లో.. మొదటి ప్రధాని లియాఖత్ ఇలీఖాన్ అత్యద్భుత పాలకుడని మెజారటీ పాకిస్తానీయులు అభిప్రయాన్నివ్యక్తం చేశారు. మిలటరీ పాలకుల్లో మహమ్మద్ ఆయూబ్ ఖాన్ పాలన ప్రజారంజకంగా సాగిందని సర్వేలో ప్రజలు తెలిపారు. బెనజీర్ భుట్టో కన్నా.. మిలటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ చాలా మేలని ప్రజలు స్పష్టం చేశారు. ఆసిఫ్ ఆలీ జర్దారీ అత్యంత చెత్త అధ్యక్షుడని ప్రజలు తీర్పు చెప్పారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి పరుడని.. అతని వల్ల దేశానికి ఎటువంటి మేలు జరగదనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. -
పాక్ తప్పుడు పాలసీలే అందుకు కారణం:ముషార్రఫ్
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడి చేసింది పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులేనని భారత్ చేస్తున్న కామెంట్లకు ప్రపంచదేశాలు మద్దతు ఇవ్వడంపై పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషార్రఫ్ మాట్లాడారు. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తెచ్చిన పాలసీలే ఇందుకు కారణమని ఆరోపించారు. ఓ వైపు పాక్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుంటే.. భారత్ నియంత్రణ రేఖ(ఎల్వోసీ)ని దాటి చేసిన నిర్దేశిత దాడి తర్వాత షరీఫ్ మాత్రం దేశంపై ఎలాంటి ప్రేమ లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. పాక్ లో జరగాల్సిన సార్క్ సమావేశాల రద్దుకు కారణం కూడా షరీఫ్ అసమర్ధతేనని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో పైస్ధాయిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని చెప్పారు. 35 బిలియన్ డాలర్ల లోన్ ను తీసుకున్న పాక్ ప్రభుత్వం ఒక్క మెగా ప్రాజెక్టును కూడా ప్రారంభించకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. భారత్ కు హెచ్చరికలు చేయడం మాత్రమే తెలుసునని అన్న ముషార్రఫ్, పాక్ సైన్యం దాడులు చేసినప్పుడు అసలు సత్తా తెలుస్తుందని చెప్పారు. పాకిస్తాన్ భూటాన్ లాంటి దేశం కాదని భారత్ తెలుసుకోవాలని అన్నారు. తమ భూభాగం ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారీ పాక్ పై ఆరోపణలు గుప్పించడం భారత్ కు అలవాటుగా మారిందని, ఇకనైనా పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం వెన్నెముకకు చికిత్స తీసుకుంటున్న ఆయన తిరిగి పాక్ కు వచ్చి పరిస్ధితులను చక్కదిద్దడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే, తాను పాక్ కు తిరిగి వచ్చినా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చని, తన మాటను గౌరవించరని అన్నారు. తనపై ఉన్న కేసులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే పాక్ కు వస్తానని చెప్పారు. 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. -
ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులకు అసలు ప్రజాస్వామ్యం సరికాదని, అందువల్లనే దేశ వ్యవహారాల్లో ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా చెప్పుకున్నవారు సరిగా పనిచేయనందున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాలనలో ఆర్మీనే కీలకంగా వ్యవహరిస్తోందని వాషింగ్టన్ ఐడియాస్ ఫోరం ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రజాస్వామ్యం లేదని ఇది పాక్‌కు ఉన్న వారసత్వ బలహీనత అని ముషారఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రజలు సమస్యల పరిష్కారానికి సైన్యం వైపు చూస్తారని అందువల్లనే సైన్యం ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విఫలం కావడం మూలంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని సైనిక తిరుగుబాటు చర్యలను ఆయన సమర్థించారు. పాకిస్తాన్ ప్రజలు ఆర్మీ నుంచి ఎక్కువ ఆశిస్తారని ఆయన వెల్లడించారు. పాక్ ఆర్మీతో సుమారు 40 ఏళ్ల అనుబంధం ఉందని.. ఆర్మీ తనను సపోర్ట్ చేయడం పట్ల గర్వపడతానని.. సైన్యమే తనకు రాజ్యాంగం అని ముషారఫ్ ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. దేశంలో రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని ముషారఫ్ అభిప్రాయపడ్డారు. -
'భారత్‌పై ఎప్పుడంటే అప్పుడు దాడి చేస్తాం'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ పుండుమీద కారం చల్లినట్లు మాట్లాడాడు. కశ్మీర్లో ఎవరు దాడి చేసిన తమనే(పాకిస్థాన్నే) బాధ్యులుగా చేయడం భారత్ కు అలవాటైపోయిందని అన్నారు. యూరీ సెక్టార్లో దాడికి సంబంధించి తమపై భారత్ ఎలాంటి మిలిటరీ చర్యలు తీసుకున్నా ఎప్పుడంటే అప్పుడు తాను(పాకిస్థాన్) ఎంపిక చేసుకున్న ప్రాంతంలో దాడులు చేయగలదని భారత్‌ను హెచ్చరించాడు. ప్రస్తుత దాడులకు సంబంధించి భారత్ మిలటరీ యాక్షన్ తో ప్రతీకారం తీల్చుకోవాల్సిందే అంటున్న డీజీఎంవో, డిఫెన్స్ మినిస్టర్ ఒక్కసారి జరుగుతున్న పరిణామాలు ఏమిటో అర్థం చేసుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించారు. 'ఇప్పుడు మీరు (భారత్) మీకు నచ్చిన చోటును ఎంపిక చేసుకొని దాడి చేస్తే మేం కూడా మాకు నచ్చిన చోట, నచ్చిన సమయంలో దాడి చేస్తాం' అంటూ ఆయన లండన్ లోని తన నివాసం నుంచి ఓ మీడియాతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ సహాయంతోనే జైషే ఈ మహ్మద్ సంస్థ యూరీ స్థావరంపై దాడులకు దిగిందన్న భారత్ వ్యాఖ్యలను తాము అంగీకరించబోమంటూ కొట్టి పారేశారు. 'దాడి జరిగిన గంటల్లోనే పాక్‌పై ఆరోపణలు చేసేందుకు ఆయన వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో నాకు తెలియదు. కశ్మీర్ లో దాడి జరిగిన ప్రతిసారి పాకిస్థాన్‌ను నిందించడం ఇండియాకు అలవాటైపోయింది' అంటూ ముషార్రఫ్ వ్యాఖ్యానించాడు. దాడికి పాల్పడిన ఆయుధాలు, పేలుడు సామాగ్రి మొత్తం పాక్ నుంచే వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి కదా అని ప్రశ్నించగా ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నుంచైనా ఎవరైనా ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని తాఫీగా సెలవిచ్చాడు. ఆయుధాలు అక్కడివే అయినా.. ఆ దాడికి పాల్పడినవారు పాక్ నుంచే వచ్చారనడానికి ఆధారాలు లేవు కదా అంటూ ఎదురు ప్రశ్నించారు. జైషే ఈ మహ్మద్ అనేది పాకిస్థాన్‌లో నిషేధించిన ఓ సంస్థ అని, ప్రస్తుతం పాక్‌లో పనిచేయడం లేదంటూ సమాధానం ఇచ్చారు. -
కశ్మీర్లో ఉగ్రచిచ్చు పెట్టాం
పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ వెల్లడి లాహోర్: కశ్మీర్లో మత తీవ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు లష్కరే తోయిబాతో పాటు పలు ఉగ్రవాద సంస్థలకు శిక్షణతోపాటు పూర్తి మద్దతిచ్చినట్లు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. పాక్ మాజీ మిలటరీ చీఫ్ కూడా అయిన ముషార్రఫ్ 1990ల్లో కశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను సృష్టించి, శిక్షణ ఇచ్చినట్లు ఓ టీవీ చానల్‌తో అన్నారు. ఉగ్రవాద నాయకులైన లాడెన్, హక్కానీ, అల్ జవహరీ, లష్కరే నాయకులు హఫీజ్ సయీద్, లఖ్వీ తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా గుర్తించారన్నారు. ‘1990ల్లో ‘స్వతంత్ర కశ్మీర్’ ఉద్యమం మొదలైనప్పుడు లష్కరేతోపాటు 11, 12 చిన్న చిన్న తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రాణాలకు తెగించి పోరాడేలా వారికి శిక్షణతో పాటు పూర్తి మద్దతిచ్చాం’ అని తెలిపారు. ‘మతతీవ్రవాదం కోసం వారిని పుట్టిస్తే.. అదే ఇప్పుడు ఉగ్రవాదమై మన వారినే చంపుతోంది. అందుకే దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. -
భుట్టో హత్యకు ముషార్రఫ్ బాధ్యుడు
అమెరికన్ జర్ లిస్టు మార్క్ సీగెల్ వాంగ్మూలం ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ బాధ్యుడని.. అమెరికన్ జర్నలిస్టు మార్క్ సీగెల్ తెలిపారు. హత్య కేసులో కీలక సాక్షిగా మారిన సీగెల్.. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి రావల్పిండి కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్‌లో వాంగ్మూలం ఇచ్చారు. తన ప్రాణాలకు ముప్పుందని, ప్రత్యేకంగా విదేశీ భద్రతా సిబ్బందిని పెట్టుకునేందుకు అనుమతివ్వాలని భుట్టో పలుమార్లు విజ్ఞప్తి చేసినా ముషార్రఫ్ పట్టించుకోలేదన్నారు. ఓ గల్ఫ్ నిఘా సంస్థ అడ్డుకున్న ఓ ఫోన్ కాల్ ద్వారా.. భుట్టో హత్యకు కుట్ర జరుగుతోందని వెల్లడైందని.. ఈ సంభాషణలో ముగ్గురు ముషార్రఫ్ సహచరులూ ఉన్నారని తెలిపారు. 2007 డిసెంబర్ భుట్టోపై బాంబు దాడి జరిగిన సమయంలోనూ.. ఆమె వాహనానికి అమర్చిన మొబైల్ జామర్లు పనిచేయలేదని గుర్తుచేశారు. -
దార్శనికతతోనే ఈ ముందడుగు
బైలైన్ భారత్-పాకిస్తాన్ సంబంధాలను ఎల్లప్పుడూ జాగ్రత్తగానూ, ముందు జాగ్రత్తతోనూ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో రెండవది అత్యంత కీలకమైనది. శాంతి ప్రక్రియకు వెన్నుపోటు పొడిచేవారు ప్రస్తుతం తాత్కాలిక మౌనం పాటిస్తున్నారంతే. సరిహద్దులు నెత్తురోడుతుంటే మొత్తంగా వాతావరణమే పాడైపోతుంది. రెండు దేశాలూ దీన్ని గుర్తించాయి. ఇరుదేశాలు ఇలా శాంతి వైపు మొగ్గడానికి ప్రధాన కారణం భారత్, పాక్‌ల ప్రజాభిప్రాయం అందుకు బ్రహ్మాండమైన మద్దతును తెలుపుతుండటమే. చరిత్ర, భౌగోళికత, భావజాలం, విద్రోహం, అనిశ్చితి, తప్పుడు అంచనాలలో ప్రతి ఒక్కటీ భారత్-పాకిస్తాన్ సంబంధాలను దుర్బలం చేయగలుగుతాయి. 1947లో, స్వాతంత్య్రం లభించిన పది వారాల్లోగానే పాకిస్తాన్ కశ్మీర్ కోసం మొదటి యుద్ధాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి సమరోత్సాహులు ఇరు దేశాల సదుద్దేశాల శవాన్ని విద్వేషపూరిత వస్త్రంలో చుట్టి, పదేపదే కప్పెట్టేస్తూనే ఉన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రకటిత, అర్ధ ప్రకటిత, అప్రకటితమైనవనే సూక్ష్మ ప్రమాణాలలో యుద్ధం సాగుతూనే ఉంది. అది సత్సంకల్పాలతో కూడిన ప్రయత్నాలను సైతం దుర్బలపరచి, యథాతథ స్థితికి తిరోగమించేలా చేసింది. భారత్, పాకిస్తాన్ల భావజాలాలు ఒకదానికొకటి హానికరమైనవి కాకు న్నా, ఒకరి లక్ష్యాలు మరొకరికి అర్థమయ్యేవి కావు. ఇరు దేశాల మధ్య సంఘ ర్షణపైనే ఆశలు పెట్టుకున్నవారు ద్వైపాక్షిక సమాచార సంబంధాల బాట పొడవునా మందు పాతరలను ఉంచారు. అనిశ్చితి తప్పుడు అంచనాలకు తల్లి. వారసత్వంగా సంక్రమించే సమస్య లెప్పుడూ ప్రమాదపూరితమైనవి గానే ఉంటాయి. వ్యూహాత్మక పర్యావరణ వ్యవస్థకు భవిత బందీగా ఉంటుం ది. కాబట్టే ఒక దేశ రక్షణ మంత్రి అంతటివారే యాథాలాపంగా అణ్వాయు ధాల గురించి ప్రస్తావించేస్తారు. బహుశా అందుకూ సమంజ సమైన కారణమే ఉండొచ్చు. అధినేత శాంతి కపోతం అన్వేషణకు ప్రాధాన్యాన్నిస్తున్న ప్పుడు యుద్ధోన్మాదుల ఆకలిని తీర్చడానికి భీకర సమర నినాదాలను ఉపయోగిస్తుంటారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆచితూచి వ్యవహరిస్తుండటాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. క్రితంసారి ఆయన భారత్‌తో శాంతి కోసం ప్రయత్నించినప్పుడు అధికారాన్ని కోల్పోయారు. అంతేకాదు, సైనిక తిరుగు బాటులో ప్రాణాలు పోయినంత పనైంది. ఆయన తదుపరి అధికారంలోకి వచ్చిన జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ కొంత సమరోత్సాహాన్ని ప్రదర్శించినా, ఆ తర్వాత శాంతి ప్రక్రియ కొనసాగేలా చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆగ్రాలో జరిగిన భారత్-పాకిస్తాన్ శిఖరాగ్ర చర్చల కీలక ఘట్టంలో ఆఖరు నిమిషంలో ధైర్యాన్ని చూపలేకపోయారు. నవాజ్ రాజకీయాలు, దూరదృష్టి ఆయనకు రెండో అవకాశాన్ని ఇచ్చాయి. మరో ప్రయత్నం చేసే సాహసాన్ని ఆయన చూపారు. ఆ వైఫల్యం అనుభవం పాకిస్తాన్, భారత ప్రభుత్వాలు రెంటికీ సాఫల్యం దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో బాగా ఉపయోగపడ్డాయి. ప్రజాస్వామిక లాంఛనాల పటాటోపం సద్దుమణిగాక, భారత ప్రజాభి ప్రాయమనే మహా తెలివైన ధర్మాసనం ఇంకా ఒక కీలక ప్రశ్నకు సమాధానాన్ని కోరుతూనే ఉంటుంది: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో ఇలా చొరవ చూపడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుందన్న విశ్వాసం ఆయనకు ఉండటం వల్లనేనా? పరస్పర శాంతియుత వాతావరణం లో పేదలకు సౌభాగ్యాన్ని అందించగలిగే విధంగా ‘సార్క్’ను పునరుజ్జీవింప జేయాలనేది ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక యోచన. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు ఈ కలను సాకారం చేయడానికి కావాల్సిన చివరిదీ, కీలకమై నదీ అయిన మౌలిక భాగం. ఢిల్లీలో జరిగిన తన ప్రమాణ స్వీకారానికి సార్క్ నేతలందరినీ ఆహ్వానించడంతోనే మోదీ అందుకు పునాదులను వేశారు. ఆయన చూపిన ఈ చొరవకు నవాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి చెంది ఉంటారు. కానీ, ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. మునుపు కూడా జరిగినట్టే శాంతిప్రక్రియకు విఘాతం కలిగించేవారు ఈసారీ జోక్యం చేసుకుంటున్నారు. కానీ మోదీ ఈ విషయంలో తన దృక్పథానికే దృఢంగా అంటిపెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అపూర్వ కృషితో సుస్థిర వేగంతో ఆయన ఇతర సార్క్ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేశారు. మోదీ నేపాల్, బంగ్లాదేశ్ పర్యటనలు మన దౌత్యచరిత్రలో ముఖ్య మలుపులుగా మిగిలిపో తాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించకుండా ఉండి ఉండ దు. ఇరుగుపొరుగులను భారత్‌కు శత్రువులుగా మార్చి చుట్టిముట్టేయ డం అనే దాని పాత దుష్ట వ్యూహం నేడు తలకిందులైంది. దాని స్థానే ‘‘ఒకటి మినహా సార్క్ దేశాలన్నీ’’ అనే గుసగుస నెలకొంది. భారత ప్రభుత్వంలో సైతం ఈ వైఖరికి కొందరు సమర్థకులున్నారు. మనం పాక్ చేసే మరో సాహసాన్ని ఎదుర్కొనడం కంటే ఇప్పుడున్న యథాతథ స్థితిని కొనసాగిస్తేనే పాకిస్తాన్మనకు సురక్షితమైనదిగా ఉంటుందని వారి వాదన. కానీ ప్రధాని సార్క్, ఉపఖండాల భవిత గురించిన కలను వదులుకోడానికి సిద్ధంగా లేరు. అయితే చేతల్లోకి దిగడానికి ముందే పాకిస్తాన్ నుంచి సానుకూల ప్రతిస్పందన ఉంటుందనే నమ్మకం కలగాలనే ముందు జాగ్రత్త వహించాల నేది వివేచన విధించే ముందు షరతు. జనవరి చివరి వారంలో సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను విదేశాంగశాఖ కార్యదర్శిగా నియమిం చారు. ముమ్మరంగా ఉన్న పలు కార్యక్రమాల నడుమ ఆయన చడీ చప్పుడు లేకుండా ఇస్లామాబాద్‌కు వెళ్లి వచ్చారు. అక్కడ ఏం జరిగిందనేది మనం తెలుసుకోజాలమనేది సుస్పష్టమే. కానీ ఆ తర్వాతి నుంచే తిరిగి ఈ క్రమం ముందుకు కదులుతోం దని ఉహించడానికి పెద్ద తెలివితేటలేం అక్కర్లేదు. ఆగ్రా శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదాన్ని నిర్వచించే దగ్గరనే చర్చలు విఫలమయ్యాయి. ఉగ్రవాదానికి అర్థంపై ఏకాభిప్రాయం చాలా కీలకమై నది. దాన్ని నేడు సాధించగలిగారు. పర్యవసానంగా, 2008 ముంబై ఉగ్ర దాడులకు సూత్రధారులుగా ఆరోపణలను ఎదుర్కొంటున్నవారి విచారణను వేగవంతం చేయడానికి పాకిస్తాన్ అంగీకరించింది. అయితే మొత్తంగా ఈ ప్రయత్నాలనన్నిటినీ ఒక కొలిక్కి తెచ్చింది మాత్రం.. ప్రధాని మోదీ 2016 సార్క్ శిఖరాగ్ర సమావేశాలకు పాకిస్తాన్‌కు వెళ్లాలని నిర్ణయించడమే. ఇప్పుడు రష్యాలోని ఉఫాలో జరిగిన మోదీ-నవాజ్ చర్చలను, 2014నాటి ప్రమాణ స్వీకారంతో ముడిపెట్టేది అదే. విస్తరిస్తున్న సంఘర్షణలకు నిలయంగా ఉన్న ఉపఖండాన్ని ఆర్థిక వృద్ధితో శక్తివంతమైన నూతన ఉపఖండంగా మార్చాలనే మోదీ లక్ష్యంతో ముడిపడిన నిర్ణయమే ఇది. సమస్యలన్నీ పరిష్కారం కాగలవని మతి సరిగా ఉన్నవారెవరూ అనరు. పరస్పర అంగీకారయోగ్యమైన యంత్రాంగాల ద్వారా వాటిని పరిష్కరిం చుకోవచ్చు. వాజ్‌పేయి 2004లో తిరిగి ఎన్నికై ఉంటే ఆగ్రా శిఖరాగ్ర సమావేశం తదుపరి చేపట్టాల్సిన చర్యగా మరో సమావేశం జరిగి ఉండేదే. జాగ్రత్తగా ఉండటం మాత్రమే సరిపోదు. భారత్-పాకిస్తాన్ సంబం ధాలను ఎల్లప్పుడూ జాగ్రత్తగానూ, ముందు జాగ్రత్తతోనూ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో రెండవది అత్యంత కీలకమైనది. ఈ శాంతి ప్రక్రియకు వెన్నుపోటు పొడిచేవారు ప్రస్తుతం ఉపాయంగా తాత్కాలిక మౌనం పాటిస్తున్నారే తప్ప మరణించలేదు. సరిహద్దుల్లో సుస్థిరత నెలకొనడమే ఈ క్రమానికి కీలక పరీక్ష అవుతుంది. సరిహద్దులు నెత్తురోడుతుంటే మొత్తంగా వాతావరణమే పాడైపోతుంది. రెండు దేశాలూ దీన్ని గుర్తించాయి. సరిహద్దు ల్లోని ఉద్రిక్తతలను, ఘటనలను కనిష్టం చేయడం కోసం జాతీయ భద్రతా సంస్థల స్థాయిలోనూ, సైనిక స్థాయిలోనూ సమావేశాలకు కార్యక్రమం సిద్ధమైంది. అయితే తీవ్ర స్థాయి ఉగ్రవాద చర్యలు ఈ పరిస్థితిని అంతటినీ అస్థిరతకు గురిచేయగల పర్యవసానాలకు దారితీయగలిగినవి. పైకి చెప్పక పోయినా, ఉన్న అతి పెద్ద ముప్పు అదే. ఇరు దేశాలు ఇలా శాంతి దిశగా ఇలా శక్తియుక్తులను పెద్ద ఎత్తున బదలాయిచడానికి ప్రధాన కారణం భారత్, పాకిస్తాన్లలోని ప్రజాభిప్రాయం అందుకు బ్రహ్మాండమైన మద్దతును తెలుపుతుండటమే.గతాన్ని అధిగమించి ప్రజలు ఎదిగారు. ఎందుకంటే ఇదే భవితను మార్చడానికి ఉన్న ఏకైక మార్గమని వారికి తెలుసు. ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
ముషారఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఇస్లామాబాద్:పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్(71) పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2013 లో పాకిస్తాన్ లోని లాల్ మసీదుపై మిలటరీ దాడి జరిగిన ఘటనలో ముషారఫ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఆ దేశ సెషన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 24లోగా ముషారఫ్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని అదనపు జడ్జి కమ్రాన్ బస్రాత్ తన తీర్పులో పేర్కొన్నారు. తన ఆరోగ్యం సహకరించనందున కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరుతూ ముషారఫ్ కు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన జడ్జి ఈ మేరకు తీర్పును వెలువరించారు. ఒకవేళ ముషారఫ్ కోర్టుకు రాకుంటే మాత్రం గతంలో ఆయనకు జారీ చేసిన సెక్యూరిటీ బాండ్లను జప్తు చేస్తామని బస్రాత్ హెచ్చరించారు. ప్రస్తుతం కరాచీలోని తన కుమార్తె ఇంటిలో ముషారఫ్ నివసిస్తున్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తుండటంతో ముషారఫ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పని చేసిన ముషారఫ్.. 1999 నుంచి 2008 వరకూ ఆ దేశ ప్రధాని కొనసాగారు. -
ముషార్రఫ్‌ను అరెస్టు చేయండి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌ను అరెస్టు చేయాలని ఇస్లామాబాద్ జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ పోలీసులకు ఆదేశాలిచ్చింది. లాల్ మసీద్ ముస్లిం మత పెద్ద అబ్దుల్ రషీద్ ఘాజి, అతడి తల్లి హత్య కేసుకు సంబంధించి కోర్టు హాజరుకాకుండా ప్రతిసారి తప్పించుకుంటున్నారని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. 2007 నుంచి కూడా ఆయన ఇదే తంతు కొనసాగిస్తున్నారని అతడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇచ్చేలా ముషార్రఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈ సందర్భంగా తిరస్కరించింది. ఈయనపై పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టోను హత్య చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. -
మరో నలుగురికి ఉరి
-
మరో నలుగురికి ఉరి
ముషార్రఫ్‌పై దాడి కేసులో ఉగ్రవాదులకు శిక్ష అమలు లాహోర్: పాకిస్తాన్ ప్రభుత్వం మరో నలుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేసింది. పదకొండేళ్ల క్రితం మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్‌పై దాడి కేసుకు సంబంధించి జుబైర్ అహ్మద్, రషీద్ ఖురేషీ, గులామ్ సర్వార్ భట్టి, రష్యా పౌరుడైన అఖ్లాక్యూ అహద్‌లను పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ జిల్లా జైలులో అధికారులు ఆదివారం ఉరి తీశారు. షెషావర్‌లోని సైనిక పాఠశాలపై తాలిబాన్ ఉగ్రవాదుల మారణహోమం తర్వాత పాక్ మరణశిక్షపై నిషేధాన్ని ఎత్తేయడం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇదే జైలులో ఇద్దరు ఉగ్రవాదులను ఉరి తీశారు. ఫైసలాబాద్ సెంట్రల్ జైలులో మరణశిక్ష అమలుకు అవకాశం లేకపోవడంతో వీరిని కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు లాహోర్‌లో సెంట్రల్ జైలులో మరో నలుగురు ఉగ్రవాదులకు సోమ, మంగళవారాల్లో ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది. -
భారత్‌పై విషం చిమ్మిన ముషారఫ్!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారత్‌పై విషం చిమ్ముతూ నోరుపారేసుకున్నాడు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారత్‌కు వ్యతిరేకంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ప్రజలను ఎప్పుడు రెచ్చగొడుతూనే ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో పోరాడేవారిని పాకిస్తాన్ ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మతవాది అని విమర్శించారు. భారత్‌పై యుద్ధానికి పాకిస్తాన్ సైన్యంతోపాటు లక్షలాది మంది యువకులు సిద్ధంగా ఉన్నట్లు ఈ మాజీ సైనిక పాలకుడు తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీ, యువత కలిస్తే భారత్‌ను ఎదుర్కోవచ్చని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఆహ్వానించగానే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెళ్లడాన్ని ఆయన తప్పు పట్టారు. కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాక్ చేసిన విజ్ఞప్తిని ఐక్యరాజ్య సమితి తిరస్కరించిన విషయం తెలిసిందే. కాశ్మీర్ అంశాన్ని చర్చల ద్వారా ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌కు ఐక్యరాజ్య సమితి సూచించింది. ఈ నేపధ్యంలో ముషారఫ్ ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ** -
భారత్‌పై విషం చిమ్మిన ముషారఫ్