ముషారఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ | Non bailable warrant against Musharraf in cleric murder case | Sakshi

ముషారఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Jun 19 2015 5:03 PM | Updated on Sep 3 2017 4:01 AM

ముషారఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ముషారఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్(71) పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.

ఇస్లామాబాద్:పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్(71) పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2013 లో పాకిస్తాన్ లోని లాల్ మసీదుపై మిలటరీ దాడి జరిగిన ఘటనలో ముషారఫ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఆ దేశ సెషన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 24లోగా ముషారఫ్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని అదనపు జడ్జి కమ్రాన్ బస్రాత్ తన తీర్పులో పేర్కొన్నారు.

 

తన ఆరోగ్యం సహకరించనందున కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరుతూ ముషారఫ్ కు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన జడ్జి ఈ మేరకు తీర్పును వెలువరించారు. ఒకవేళ ముషారఫ్ కోర్టుకు రాకుంటే మాత్రం గతంలో ఆయనకు జారీ చేసిన సెక్యూరిటీ బాండ్లను జప్తు చేస్తామని బస్రాత్ హెచ్చరించారు. ప్రస్తుతం కరాచీలోని తన కుమార్తె ఇంటిలో ముషారఫ్ నివసిస్తున్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తుండటంతో ముషారఫ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. గతంలో  పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పని చేసిన ముషారఫ్.. 1999 నుంచి 2008 వరకూ ఆ దేశ ప్రధాని కొనసాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement