నాన్‌బెయిలబుల్ వారెంట్ల అమలులో సీఐడీ దూకుడు
ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితులు కటకటాల్లోకి..
ఏడాది కాలంలో 212 ఎన్‌బీడబ్ల్యూలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులను, నిందితులను తెలంగాణ సీఐడీ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి తీసుకువస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పారిపోయిన మోసగాళ్లను సైతం కటకటాల వెనక్కి నెడుతున్నారు. గత 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్ల (ఎన్‌బీడబ్ల్యూ) అమలు కోసం తెలంగాణ సీఐడీ విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం సత్ఫలితాలిస్తోంది. 2023 ఫిబ్రవరిలో ఈ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 212 నాన్‌బెయిలబుల్ వారెంట్లను పరిష్కరించారు. రూ.కోట్లలో అమాయకులను మోసగించి దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్తులపై ఎస్పీ రామ్‌రెడ్డి నేతృత్వంలోని ఈ ఎన్‌బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ బృందం ఫోకస్ పెట్టింది. ఫలితంగా పాత కేసులలోనూ చిక్కుముడులు వీడుతున్నాయి. మొత్తంగా ఏడాదికాలవ్యవధిలో 156 ఎన్‌బీడబ్ల్యూల సమాచారం ప్రత్యేక బృందం సేకరించింది. 56 మంది పాత నేరస్తులను అరెస్టు చేసింది.
ఇటీవల అమలు చేసిన ఎన్‌బీడబ్ల్యూ కేసులు కొన్ని..
► మంచిర్యాల టౌన్‌లో 1995 నమోదైన ఒక డెకాయిటీ కేసులో 29 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అప్పల సత్తయ్య అనే నేరస్తుడిని ఈ ఏడాది జనవరి 24న కరీంనగర్‌లో అరెస్టు చేసింది.
► ఆన్‌లైన్ ఓఎల్‌ఎక్స్ మోసం కేసులో ఎనిమిదేళ్లుగా సీఐడీ సైబర్‌క్రైం పోలీసులకు చిక్కకుండా ఉన్న సోహాల పొద్దార్ అనే పాత నిందితుడిని ముంబైలో ఈ ఏడాది జనవరి 29 ఎన్‌బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం అరెస్టు చేసింది.
► కృషి బ్యాంకు కుంభకోణం కేసులో 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆ బ్యాంకు డైరెక్టర్ కాగితాల శ్రీధర్‌ను గతేడాది సెప్టెంబర్ 25న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అరెస్టు చేసింది.
సాంకేతికత వినియోగంతో సమాచారం కూపీ లాగుతారు..
మోసాలు చేయడంలో దిట్ట అయిన సదరు పాత నేరస్తులను గుర్తించేందుకు తెలంగాణ సీఐడీ ఎన్‌బీడబ్ల్యూ స్పెష ల్ ఎగ్జిక్యూషన్ టీం సాంకేతికతను వినియోగిస్తోంది. నేర స్తుల సీడీఆర్ (కాల్ డీటెయిల్డ్ రికార్డ్), బ్యాంకు ఖాతాల కు లింక్ అయిన ఉన్న మొబైల్ నంబర్ల ఆధారంగా, అదేవిధంగా స్విగ్గీ, ఓయో, ర్యాపిడో, అమెజాన్ డాటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. సైకాప్స్ అప్లికేషన్ ద్వారా కూడా వివరాలు విశ్లేíÙస్తున్నారు. గ్యాస్ కనెక్షన్, మొబైల్ నంబర్‌కు ఇచ్చే ఆధారాలు, సోషల్ మీడియా ఖాతాల్లో ఫో న్ నంబర్లు ఇలా...అన్ని కోణాల్లో సదరు నిందితుల సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడున్నాడనేది స్పష్టత వచి్చన తర్వాత క్షేత్రస్థాయిలో ఆపరేషన్ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment