Old criminals
-
పాత నేరస్తుల పని పడుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులను, నిందితులను తెలంగాణ సీఐడీ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి తీసుకువస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పారిపోయిన మోసగాళ్లను సైతం కటకటాల వెనక్కి నెడుతున్నారు. గత 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) అమలు కోసం తెలంగాణ సీఐడీ విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం సత్ఫలితాలిస్తోంది. 2023 ఫిబ్రవరిలో ఈ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 212 నాన్‌బెయిలబుల్ వారెంట్లను పరిష్కరించారు. రూ.కోట్లలో అమాయకులను మోసగించి దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్తులపై ఎస్పీ రామ్‌రెడ్డి నేతృత్వంలోని ఈ ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ బృందం ఫోకస్ పెట్టింది. ఫలితంగా పాత కేసులలోనూ చిక్కుముడులు వీడుతున్నాయి. మొత్తంగా ఏడాదికాలవ్యవధిలో 156 ఎన్‌బీడబ్ల్యూల సమాచారం ప్రత్యేక బృందం సేకరించింది. 56 మంది పాత నేరస్తులను అరెస్టు చేసింది. ఇటీవల అమలు చేసిన ఎన్బీడబ్ల్యూ కేసులు కొన్ని.. ► మంచిర్యాల టౌన్లో 1995 నమోదైన ఒక డెకాయిటీ కేసులో 29 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అప్పల సత్తయ్య అనే నేరస్తుడిని ఈ ఏడాది జనవరి 24న కరీంనగర్లో అరెస్టు చేసింది. ► ఆన్లైన్ ఓఎల్ఎక్స్ మోసం కేసులో ఎనిమిదేళ్లుగా సీఐడీ సైబర్‌క్రైం పోలీసులకు చిక్కకుండా ఉన్న సోహాల పొద్దార్ అనే పాత నిందితుడిని ముంబైలో ఈ ఏడాది జనవరి 29 ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం అరెస్టు చేసింది. ► కృషి బ్యాంకు కుంభకోణం కేసులో 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆ బ్యాంకు డైరెక్టర్ కాగితాల శ్రీధర్‌ను గతేడాది సెప్టెంబర్ 25న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అరెస్టు చేసింది. సాంకేతికత వినియోగంతో సమాచారం కూపీ లాగుతారు.. మోసాలు చేయడంలో దిట్ట అయిన సదరు పాత నేరస్తులను గుర్తించేందుకు తెలంగాణ సీఐడీ ఎన్బీడబ్ల్యూ స్పెష ల్ ఎగ్జిక్యూషన్ టీం సాంకేతికతను వినియోగిస్తోంది. నేర స్తుల సీడీఆర్ (కాల్ డీటెయిల్డ్ రికార్డ్), బ్యాంకు ఖాతాల కు లింక్ అయిన ఉన్న మొబైల్ నంబర్ల ఆధారంగా, అదేవిధంగా స్విగ్గీ, ఓయో, ర్యాపిడో, అమెజాన్ డాటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. సైకాప్స్ అప్లికేషన్ ద్వారా కూడా వివరాలు విశ్లేíÙస్తున్నారు. గ్యాస్ కనెక్షన్, మొబైల్ నంబర్‌కు ఇచ్చే ఆధారాలు, సోషల్ మీడియా ఖాతాల్లో ఫో న్ నంబర్లు ఇలా...అన్ని కోణాల్లో సదరు నిందితుల సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడున్నాడనేది స్పష్టత వచి్చన తర్వాత క్షేత్రస్థాయిలో ఆపరేషన్ చేపడుతున్నారు. -
కోర్టులో చోరీ చేసింది పాత నేరస్తులే
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నాలుగో అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి శ్యామ్‌సంగ్ ట్యాబ్, లెనోవా ల్యాప్‌టాప్, నాలుగు సెల్ఫోన్లు, ఏడు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో ఆదివారం ఎస్పీ సీహెచ్ విజయారావు కేసు పూర్వాపరాలను మీడియాకు వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా.. ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి దొంగలు కోర్టులోకి ప్రవేశించి రికార్డు రూమ్ బీరువాను పగులగొట్టి 521/2016 (నెల్లూరు రూరల్ పీఎస్) కేసుకు సంబంధించి భద్రపరిచిన ఆధారాల డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్ఫోన్ల బ్యాగ్‌ను అపహరించుకుని వెళ్లారు. 14వ తేదీ ఉదయం కోర్టు బెంచ్ క్లర్క్ బి.నాగేశ్వరరావు చోరీ ఘటనపై చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ఎస్పీ సీహెచ్ విజయారావు కావలి ఏఎస్పీ ప్రసాద్‌రావు నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కోర్టుకు వచ్చే అన్ని రహదారుల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు బ్యాగ్‌తో అనుమానాస్పదంగా వెళ్లినట్లు గుర్తించారు. వీరు ఖుద్దూస్‌నగర్‌కు చెందిన పాతనేరస్తుడు సయ్యద్ హయాత్, అతని స్నేహితుడు పొర్లుకట్టకు చెందిన షేక్ రసూల్ అలియాస్ మస్తాన్‌గా నిర్ధారించారు. ఆదివారం నిందితులను ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఐరన్ స్క్రాప్ దొంగతనానికి వెళ్లి.. మద్యానికి బానిసలైన నిందితులు కుటుంబాలకు దూరమై నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉంటూ దొంగతనాలు చేస్తున్నారు. హయత్ 15 కేసుల్లో నిందితుడు కావడంతో తరచూ కోర్టుకు వచ్చేవాడు. కోర్టు ప్రాంగణంలో ఇనుము స్క్రాప్‌ను దొంగలించేందుకు రసూల్‌తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి పాత జైలు మీదుగా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఇనుప స్క్రాప్ వద్దకు వెళ్లే సమయంలో కుక్కలు మొరగడంతో ఎవరో వస్తున్నారని భావించి కిందినుంచి కోర్టు మొదటి అంతస్తులోకి వెళ్లారు. అక్కడ గదికి ఉన్న తాళాన్ని ఇనుప రాడ్‌తో పగులగొట్టారు. లోపలకెళ్లి బీరువా తెరిచారు. అందులో ఉన్న బ్యాగ్‌ను చూసి విలువైన వస్తువులు ఉంటాయని భావించి దానిని అపహరించారు. బ్యాగ్‌లోని ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుని మిగిలిన పత్రాలను పక్కనే ఉన్న కాలువలో విసిరేశారు. ల్యాప్‌ట్యాప్ బ్యాగ్‌ను తమతో తీసుకెళ్లారు. ఈ మేరకు నిందితులు నేరం అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. చోరీ ఘటనలో ఎలాంటి అపోహలకు తావులేదని, రాజకీయ ప్రమేయం లేదని విచారణలో తేలిందన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన కావలి ఏఎస్పీ ప్రసాద్, ఇన్స్పెక్టర్లు మధుబాబు, బాజీజాన్‌సైదా, శ్రీరామ్, వీరేంద్రబాబు, ఎస్ఐ సైదులు తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. -
సర్వే గుబులు!
చిన్నంబావి మండలం పెద్దమరూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల క్రితం బావిమోటార్ల దొంగతనం కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాపీమేస్త్రీగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామంలో పెద్దమ్మ పండగ కోసం ఇటీవల సొంతూరుకు వచ్చాడు. కుటుంబసభ్యులు, బంధువులతో ఆనందంగా ఉన్న సమయంలో సర్వే కోసం పోలీసులు ఇంటికి రావడంతో భయంతో వణికిపోయాడు. అందరి ముందు తన వేలిముద్రలు సేకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం గొర్రెల దొంగతనం కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. అనేక వాయిదాల తర్వాత కోర్టు కేసు కొట్టివేయడంతో ప్రస్తుతం ఓ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. సర్వేలో భాగంగా పోలీసులు ఇంటికి రావడంతో అతనితో పాటు కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోయారు. ఆధార్, రేషన్‌కార్డు ఫొటోలు తదితర వివరాలు సేకరించడంతో బెంబేలెత్తిపోతున్నారు. వనపర్తి విద్యావిభాగం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేరస్తుల సమగ్రసర్వే ఉద్దేశం మంచిదే అయినా తెలిసో తెలియకో చిన్న చిన్న నేరాలతో పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన నేరస్తులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పదేళ్ల పోలీసు రికార్డుల ఆధారంగా నేరస్తుల సర్వే కొనసాగుతోంది. గతంలో నేరుగా నేరాలు, దొంగతనాలు చేసిన వారు కొందరైతే పాతకక్షలతో కొందరు, తప్పుడు కేసుల్లో మరికొందరు, నేరస్తులకు సాయం చేసిన వారు ఇంకొందరు.. ఇలా వివిధ కారణాలతో పోలీస్ రికార్డుల్లోకి ఎక్కినవారు ఉన్నారు. వివిధ నేరాల్లో జైలుకెళ్లి, కోర్టులు కేసులు కొట్టివేయడంతో నేరప్రవృత్తికి దూరంగా జీవనం గడుపుతున్నవారు ఉన్నారు. ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న తమ ఇంటికి పోలీసులు రావడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. గతంలో పోలీసు కేసు విషయం కొందరికే తెలిసినా ప్రస్తుతం పోలీసుల హడావుడితో నేరస్తులుగా ముద్రపడిన వారు, వారి కుటుంబసభ్యులు ఆత్మన్యూనతభావానికి గురవుతున్నారు. ఎక్కువ మంది చిన్న కేసుల్లో రికార్డుల్లోకి ఎక్కినవారు బాధపడుతున్నారు. జిల్లాలో కొనసాగుతున్న సర్వే జిల్లాలోని 14మండలాల్లో పదేళ్ల పోలీసు రికార్డుల ప్రకారం 1758మంది నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ఈ సర్వే కోసం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాలతో మొత్తం 50బృందాలు సర్వే కొనసాగిస్తున్నాయి. ఈ ప్రక్రియను ఏఎస్పీ సురేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జిల్లాలో 1,758మంది నేరస్తుల్లో 1,152మంది జిల్లాలో నివాసం ఉంటుండగా, 371మంది ఇతర తెలంగాణ జిల్లాలు, 235మంది ఇతర రాష్ట్రాల పరిధిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 18న ప్రారంభమైన ఈ సర్వే ఇంకా కొనసాగుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. నేరస్తుల్లో మార్పు అవసరం పోలీస్‌శాఖ చేపడుతున్న సర్వే పాత నేరస్తులను ఇబ్బందులకు గురిచేసేందుకు కాదు. నేరంచేసిన వారిపై పోలీస్‌శాఖ నిఘా ఉంటుందన్న విషయం తెలిస్తే మరోసారి నేరాలకు పాల్పడేందుకు అవకాశం ఉండదు. పాత నేరస్తుల్లో మార్పు కచ్చితంగా అవసరం. నేరస్తుల డేటా టీఎస్‌కాప్ యాప్‌లో అప్లోడ్ చేయడంతో ఒకవేళ పాత నేరస్తులు రాష్ట్రంలో ఏ మూలన నేరం చేసినా పట్టుబడే అవకాశం ఉంది. – జె.సురేందర్‌రెడ్డి, ఏఎస్పీ, వనపర్తి -
పోలీస్‌స్టేషన్ నుంచి పాత నేరస్తుల పరారీ
ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ నుంచి ముగ్గురు పాత నేరస్థులు పారిపోయారు. ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 6 రాత్రి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న చామాకూర శ్రీకాంత్ అనే వ్యక్తిని ఆటోలో వచ్చిన ఐదుగురు యువకులు అడ్డగించి అతని వద్ద ఉన్న రూ.12 వేల విలువ చేసే మొబైల్ ఫోన్‌ను లాక్కొన్ని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘట్కేసర్కు చెందిన పాత నేరస్థులు మహేశ్, రోహిత్‌గౌడ్, ఉదయ్, పృద్వీ, మునీర్‌లను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అర్థరాత్రి స్టేషన్లో కాపాలదారుడిగా ఉన్న కానిస్టేబుల్ రమేష్ కళ్లుగప్పి స్టేషన్ కిటికీలను తొలగించి మహేశ్, రోహిత్‌గౌడ్, ఉదయ్‌లు పారిపోయారు. ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు నేరస్థుల కోసం గాలిస్తున్నారు. -
12 మందిపై బైండోవర్
బంట్వారం: పాత నేరస్తులు 12 మందిని గురువారం తహశీల్దార్ మారుతీ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ హన్మానాయక్ తెలిపారు. జిన్నారం, తొర్మామిడి గ్రామాలకు చెందిన వీరు గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో అల్లర్లు సృష్టించడం, బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడటంవంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వీరందరిని హెచ్చరించి వదిలేశామని చెప్పారు. మండల పరిధిలోని పాత నేరస్తులందరిపై నిఘా పెట్టినట్లు ఎస్ఐ హన్మానాయక్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. -
పగలు రెక్కీ..రాత్రి చోరీలు
అంతర్జిల్లా గజదొంగల పట్టివేత రూ.33 లక్షల సొత్తు స్వాధీనం విజయవాడ సిటీ : అంతర్ జిల్లా దొంగలు ఇద్దరు పోలీసుల చేతికి చిక్కారు. పగలు రోడ్లపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి వేళ తాళం పగులగొట్టి దోపిడీలకు పాల్పడుతుంటారు. ఏడాది కాలంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కమిషనరేట్‌లో 23 చోరీలకు పాల్పడిన రాజమండ్రికి చెందిన అంబటి మధు, కాకినాడకు చెందిన ఎస్.కె.అజీజ్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.33 లక్షల విలువైన 1140 గ్రాముల బంగారు నగలు, 4 కిలోల వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతి భద్రతల డీసీపీ ఎల్.కాళిదాస్ వివరించారు. నేర చరిత్ర ప్రధాన నిందితుడు మధు 9వ తరగతి చదివేటప్పుడే చోరీల బాట పట్టాడు. పలుమార్లు జైలు జీవితం గడిపిన మధు 2011లో విశాఖ జైలు నుంచి బయటకు వచ్చి భీమడోలు, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, రాజమండ్రి, గుడివాడలో చోరీలకు పాల్పడ్డాడు. రాజమండ్రి పోలీసులు అరెస్టు చేయడంతో జైల్లో కాకినాడకు చెందిన పాత నేరస్తుడు అజీజ్ పరిచయమయ్యాడు. 2015లో బయటకు వచ్చిన వీరిద్దరూ మరో ఇద్దరిని కలుపుకొని చోరీలు చేస్తున్నారు. ఇవీ నేరాలు విజయవాడ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం, పటమట, అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో 9 చోరీలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా బెండపూడి, గోపాలపురం, పసలపూడి, రాయవరం, తొండంగి, వేములవాడ, అనపర్తి, కడియంలలో 10 ఇంటి దొంగతనాలు చేశారు. తాడేపల్లిగూడెం, వేల్పూరు, ఇరగవరం, తణుకు ప్రాంతాల్లో నాలుగు చోరీలు చేసి 33 లక్షల సొత్తును కొల్లగొట్టారు. ఇలా చిక్కారు నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే చోరీ సొత్తు విక్రయించేందుకు నగరానికి చేరుకొని బీఆర్టీఎస్ రోడ్డులోని మధురానగర్ వంతెన వద్ద ఉన్నారు. వీరిని గుర్తించిన సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు. వీరిని అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకుని సంబంధిత పోలీసులకు అప్పగించనున్నట్టు డీసీపీ తెలిపారు. అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు, ఏసీపీలు వి.ఎస్.ఎన్.వర్మ, పి.సుందరరాజు, పి.పోతురాజు, సీసీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
టార్గెట్ వెంకటగిరి ఎర్రదొంగలు
టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు ముమ్మరం రెండు రోజులుగా ఇద్దరు నిందితుల అరెస్టు వణికిపోతున్న పాత నేరస్తులు వెంకటగిరిటౌన్ : వెంకటగిరి ఎర్రదొంగలపై తిరుపతి టాస్క్‌ఫోర్స్ దృష్టి సారించారా...? అంటే ఔననే సమాధానం వస్తుంది. తిరుపతి శేషాచలం ఎన్‌కౌంటర్‌తో వార్తాల్లో ప్రముఖంగా నిలిచి ఎర్రదొంగల్లో ఒణుకు పుట్టిస్తున్నారు. ఎర్రచందనం అక్రమరవాణా జిల్లాలోనే వెంకటగిరి ప్రాంతంలో ఎక్కువగా ఉండటం తెలిసిందే. దీంతో టాస్క్‌ఫోర్స్ వెంకటగిరిపై దృష్టిసారించి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. తమిళనాడులో బడాస్మగ్లర్లను అదుపులోకి తీసుకొంటున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వారికి ఈ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలు చేరవేసే పాత నేరస్థులే టార్గెట్‌గా వేట సాగిస్తున్నారు. రెండు రోజుల కిందట వెంకటగిరికి చెందిన నాదమునిని అదుపులోకి తీసుకొన్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తాజాగా బుధవారం కోండకింగ గ్రామమయిన కుర్జాగుంటకు చెందిన జనార్దన్నాయుడును అదుపులోకి తీసుకున్నారు. వాహనాల సరఫరా, మేస్త్రీలపైనా గురి.. ఎర్రచందనంను సులభంగా తరలించే క్రమంలో బడాస్మగ్లర్లు స్థానికంగా ఉన్న ఏజెంట్లును నియమించుకుంటారు. ఇలా వెంకటగిరి, డక్కిలి ప్రాంతాల్లో అదిక సంఖ్యలో ఏజెంట్లు బడాస్మగ్లర్ల కోసం వాహన సరఫరాదారులు, మేస్త్రీలుగా పనిచేసిన వారి ఆనవాళ్లు వెంకటగిరిలో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ డీఐజీ రెండు నెలల కిందట గుర్తించి ఓ జాబితాను మీడియాకు అందజేశారు. వెంకటగిరి ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్‌తో సంబంధం ఉండి ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులపై కూడా కన్నేసి వారిని అదుపులోకి తీసుకునేందుకు పక్కా ప్రణాళికతో టాస్క్‌ఫోర్స్ రంగం సిద్ధం చేసి స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటుంది. దర్యాప్తు ముమ్మరం అయిన సందర్భంగా మరెందరు ఎర్రదొంగలు పేర్లు గట్టురట్టు అవుతాయోనని చర్చనీయాంశంగా మారింది. -
పాత నేరస్తులు అరెస్ట్
భువనగిరి(నల్లగొండ): దేవాలయాలు, దుకాణాలు, తాళం వేసిన ఇళ్లలో వరస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను శుక్రవారం నల్లగొండ జిల్లా భువనగిరి మండల రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరికి చెందిన నిఖిల్, హైదరాబాద్‌కు చెందిన శ్రీనులు వేరు వేరు కేసుల్లో హైదరాబాద్ లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తూ ఒకరికొకరు పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత భువనగిరి పరిసర ప్రాంతాల్లో వరస దొంగతనాలకు పాల్పడుతున్నారు. శ్రీను పై పలు పోలీసు స్టేషన్లలో 16 కేసులు, నిఖిల్‌పై 6 కేసులు ఉన్నాయని భువనగిరి రూరల్ సీఐ తిరుపతి తెలిపారు. నిందితుల నుంచి రూ. 5వేల నగదు, 8 తులాల వెండి పట్టీలు, 20 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.