పాత నేరస్తులు అరెస్ట్ | old criminals were arrested | Sakshi
Sakshi News home page

పాత నేరస్తులు అరెస్ట్

Published Fri, Feb 6 2015 7:17 PM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM

old criminals were arrested

భువనగిరి(నల్లగొండ): దేవాలయాలు, దుకాణాలు, తాళం వేసిన ఇళ్లలో వరస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను శుక్రవారం నల్లగొండ జిల్లా భువనగిరి మండల రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరికి చెందిన నిఖిల్, హైదరాబాద్‌కు చెందిన శ్రీనులు వేరు వేరు కేసుల్లో హైదరాబాద్ లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తూ ఒకరికొకరు పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత భువనగిరి పరిసర ప్రాంతాల్లో వరస దొంగతనాలకు పాల్పడుతున్నారు. శ్రీను పై పలు పోలీసు స్టేషన్లలో 16 కేసులు, నిఖిల్‌పై 6 కేసులు ఉన్నాయని భువనగిరి రూరల్ సీఐ తిరుపతి తెలిపారు. నిందితుల నుంచి రూ. 5వేల నగదు, 8 తులాల వెండి పట్టీలు, 20 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement