టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు ముమ్మరం
రెండు రోజులుగా ఇద్దరు నిందితుల అరెస్టు
వణికిపోతున్న పాత నేరస్తులు
వెంకటగిరిటౌన్ : వెంకటగిరి ఎర్రదొంగలపై తిరుపతి టాస్క్‌ఫోర్స్ దృష్టి సారించారా...? అంటే ఔననే సమాధానం వస్తుంది. తిరుపతి శేషాచలం ఎన్‌కౌంటర్‌తో వార్తాల్లో ప్రముఖంగా నిలిచి ఎర్రదొంగల్లో ఒణుకు పుట్టిస్తున్నారు. ఎర్రచందనం అక్రమరవాణా జిల్లాలోనే వెంకటగిరి ప్రాంతంలో ఎక్కువగా ఉండటం తెలిసిందే. దీంతో టాస్క్‌ఫోర్స్ వెంకటగిరిపై దృష్టిసారించి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. తమిళనాడులో బడాస్మగ్లర్‌లను అదుపులోకి తీసుకొంటున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వారికి ఈ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలు చేరవేసే పాత నేరస్థులే టార్గెట్‌గా వేట సాగిస్తున్నారు. రెండు రోజుల కిందట వెంకటగిరికి చెందిన నాదమునిని అదుపులోకి తీసుకొన్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తాజాగా బుధవారం కోండకింగ గ్రామమయిన కుర్జాగుంటకు చెందిన జనార్దన్‌నాయుడును అదుపులోకి తీసుకున్నారు.
వాహనాల సరఫరా, మేస్త్రీలపైనా గురి..
ఎర్రచందనంను సులభంగా తరలించే క్రమంలో బడాస్మగ్లర్‌లు స్థానికంగా ఉన్న ఏజెంట్లును నియమించుకుంటారు. ఇలా వెంకటగిరి, డక్కిలి ప్రాంతాల్లో అదిక సంఖ్యలో ఏజెంట్లు బడాస్మగ్లర్‌ల కోసం వాహన సరఫరాదారులు, మేస్త్రీలుగా పనిచేసిన వారి ఆనవాళ్లు వెంకటగిరిలో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ డీఐజీ రెండు నెలల కిందట గుర్తించి ఓ జాబితాను మీడియాకు అందజేశారు. వెంకటగిరి ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్‌తో సంబంధం ఉండి ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులపై కూడా కన్నేసి వారిని అదుపులోకి తీసుకునేందుకు పక్కా ప్రణాళికతో టాస్క్‌ఫోర్స్ రంగం సిద్ధం చేసి స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటుంది. దర్యాప్తు ముమ్మరం అయిన సందర్భంగా మరెందరు ఎర్రదొంగలు పేర్లు గట్టురట్టు అవుతాయోనని చర్చనీయాంశంగా మారింది.
టార్గెట్ వెంకటగిరి ఎర్రదొంగలు
Published Thu, May 28 2015 2:40 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
Advertisement
Advertisement