పోలీస్‌స్టేషన్ నుంచి పాత నేరస్తుల పరారీ
Published Thu, Mar 9 2017 3:09 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
ఘట్‌కేసర్: మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ నుంచి ముగ్గురు పాత నేరస్థులు పారిపోయారు. ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 6 రాత్రి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న చామాకూర శ్రీకాంత్ అనే వ్యక్తిని ఆటోలో వచ్చిన ఐదుగురు యువకులు అడ్డగించి అతని వద్ద ఉన్న రూ.12 వేల విలువ చేసే మొబైల్ ఫోన్‌ను లాక్కొన్ని పారిపోయారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘట్‌కేసర్‌కు చెందిన పాత నేరస్థులు మహేశ్, రోహిత్‌గౌడ్, ఉదయ్, పృద్వీ, మునీర్‌లను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అర్థరాత్రి స్టేషన్‌లో కాపాలదారుడిగా ఉన్న కానిస్టేబుల్ రమేష్ కళ్లుగప్పి స్టేషన్ కిటికీలను తొలగించి మహేశ్, రోహిత్‌గౌడ్, ఉదయ్‌లు పారిపోయారు. ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు నేరస్థుల కోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement