పాకిస్తాన్‌లో మళ్లీ నియంతృత్వ పాలన రానుందా? పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పూర్తికాలం మనుగడ సాగించలేవా? ప్రజా ప్రభుత్వాలకంటే.. నియంతృత్వ పాలకులే మేలని ప్రజలు అనుకుంటున్నారా? పారిణామాలు చూస్తుంటే.. ఏదైనా జరగవచ్చు అని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇస్లామాబాద్ : ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. దేశం సైనిక పాలన దిశగా మళ్లుతున్న అనుమానాలు వస్తున్నాని అంతర్జాతీయ ఆన్‌లైన్ న్యూస్ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రస్తుతంపాకిస్తాన్లో అత్యంత కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని ఆ మేగజైన్ పేర్కొంది. పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఏర్పాటు చేసిన గ్రాండ్ అలయెన్స్, అదే సమయంలో ఆయన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు మద్దతు పలకడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయని మేగజైన్ తెలిపింది.
ముంబై దాడులు సూత్రధారి హఫీజ్ సయీద్ ఇప్పటికే 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే గృహనిర్భంధంలో ఉన్న సమయంలోనే హఫజ్ సయీద్ మిల్లీ ముస్లిం లీగ్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. హహీజప్ సయీద్ గృహనిర్భంధాన్ని పొడిగించాలన్న పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థనను పాక్ న్యాయవ్యవస్థ తోసిపుచ్చడం కూడా అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది.
పాకిస్తాన్ సైన్యం, మత సంస్థలు.. తమ మధ్యనున్న వివాదాలను పరిష్కరించుకునే దిశగా అడుగులే వేస్తున్నాయి. ఇదే అత్యంత ప్రమాదకర పరిణామాలకు సంకేతాలని మేగజైన్ తెలిపింది. హఫీజ్ సయీద్ విడుదల తరువాత పాకిస్తాన్‌లో జీహాదీ గ్రూపులు మరింత ధైర్యంగా, స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటివరకూ మతసంస్థల అధిపతులగా ఉన్న వ్యక్తులంతా.. హఫీజ్ సయీద్ బాటలో.. ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మాజీ మిలటరీ పాలకుడు ముషారఫ్ త్వరలోనే పాకిస్తాన్‌లో తిరిగి అడుగు పెటడుతున్నట్లు జీహాదీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముషారఫ్ పాక్‌లో అడుగు పెడితే.. పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment