సయీద్‌పై ఎఫ్‌ఐఆర్.. ఇక వరుస అరెస్టులు!
లాహోర్: ముంబయి దాడుల కీలక సూత్రదారి, ఉగ్రవాది జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుకానుంది. ఈ మేరకు పాక్‌కు చెందిన ఓ సీనియర్ మంత్రి చెప్పారు. అయితే, అతడిపై ఏ కేసుకింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారనే విషయం ఇంకా తెలియలేదు. ‘సయీద్‌పై చర్యలు తీసుకుంటున్నాం. అతడిపై ఉన్న ఆరోపణలన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రభుత్వం అతడిని గృహ నిర్బంధం చేసింది. ఇక త్వరలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం’ అని ఫెడరల్ కామర్స్ మంత్రి ఖుర్రం దస్తగిర్ బుధవారం మీడియాకు చెప్పారు.
ఏ కేసు అనే విషయం త్వరలోనే చెప్తామని స్పష్టం చేశారు. త్వరలోనే జమాత్ సంస్థకు, ఫలాహ ఈ ఇన్సాన్‌యత్(ఎఫ్‌ఈఎఫ్)కు చెందిన కార్యకర్తలందరినీ కూడా అరెస్టు చేస్తామని పంజాబ్ ప్రావిన్స్ న్యాయశాఖ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. ప్రస్తుతానికి వారందరిపై పరిశీలన పెట్టామని, త్వరలోనే యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద అరెస్టు చేస్తామని తెలిపారు. జాతీయ అవసరాల విషయంతో తాము అస్సలు రాజీపడబోమని, కశ్మీర్ విషయంలో తమ విధానం వేరని చెప్పారు. జమాత్‌కు కశ్మీర్‌కు సంబంధం లేదని, అవి వేర్వేరు విషయాలని అన్నారు. ఇదిలా ఉండగా సయీద్ అరెస్టు విషయంలో ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన నేతల్లో చీలికలు వచ్చాయంట.