సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలను భారత్ వ్యతిరేకత ప్రభావితం చేసింది. పాక్‌లో జరిగిన ఈ ఎన్నికలను భారత్, పాకిస్తాన్ సైన్యాల మధ్య జరుగుతున్న యుద్ధంగా ప్రచారం చేయడంలో, నవాజ్ షరీఫ్ పార్టీని గెలిపించడం కోసం భారత్‌తో కలిసి అంతర్జాతీయ శక్తులు కుట్ర పన్నాయని పాక్ ఓటర్లను నమ్మించడంలో ఇమ్రాన్ ఖాన్, ఆయన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (న్యాయం కోసం ఉద్యమం) పార్టీలు విజయం సాధించాయి. భారత్‌తో కలిసి కుట్ర పన్నిన అంతర్జాతీయ శక్తులెవరో ఇమ్రాన్ ఖాన్ వెల్లడించకపోయినా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలని అర్థం చేసుకోవచ్చు.
భారత్‌కు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రచారానికి సోషల్ మీడియాలోని వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు బాగా ఉపయోగపడ్డాయి. 2015, డిసెంబర్ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్యంగా లాహోర్‌ను సందర్శించినప్పుడు నవాజ్ షరీఫ్, మోదీలు పాక్ గౌరవ వందనం స్వీకరించడం, ఆ సందర్భంగా ఇరువురు ఒకరినొకరు ఆత్మీయంగా కౌగించుకున్న దృశ్యాలను సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ కొత్త అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారుగానీ అది ఓటర్లకు ఆకట్టుకోలేక పోయింది. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ చైనాతో కలిసి పాకిస్తాన్ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తామని చెప్పడం వారికి చప్పగా అనిపించింది.
2008, 2013లో జరిగిన పాక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారత్ వ్యతిరేకత అన్న అంశమే అసలు ప్రస్థావనకు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి. 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు (వారు ఆజాద్ కశ్మీర్ అంటారు) జరిగిన ఎన్నికల్లో మొదటి సారి భారత్ వ్యతిరేకత అంశం వచ్చింది. బహుశ 2014 భారత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, పాకిస్థాన్ వ్యతిరేకత అంశాన్ని తీసుకరావడం కావచ్చు. ఈ అంశంతోపాటు ఎన్నికల్లో అవినీతి, పోకరితనం, ప్రజాస్వామ్యం, అప్రజాస్వామ్యం, వ్యవస్థకు అనుకూలం, వ్యవస్థకు వ్యతిరేకం అన్న అంశాలపై జోరుగా ప్రచారం జరిగింది.
ఇమ్రాన్ ఖాన్ పార్టీవారు సైనిక తొత్తులంటూ నవాజ్ షరీఫ్ పార్టీ వారు ప్రచారం చేయగా, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సందర్భంగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నిర్వహించిన పాత్ర గురించి, 1978 నుంచి 1988 మధ్య పాక్ సైనిక నియంత జిలా ఉల్ హక్‌తో నవాజ్ షరీఫ్‌కున్న సంబంధాల గురించి ప్రస్తావించడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పార్టీ వారు ఆ దాడిని విజయవంతంగా ఎదుర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన పార్టీలను కాదని పాక్ ప్రజలు ఇమ్రాన్‌కు పట్టడం కట్టడమంటే భారత్ వ్యతిరేకతే అందుకు కారణం అని చెప్పవచ్చు.
చదవండి: యథా మోదీ తథా ఇమ్రాన్ ఖాన్!
Comments
Please login to add a commentAdd a comment