![Pakistan Former Pm Imran Khan Filed Petition In Supreme Court - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/23/imran%20khan.jpg.webp?itok=tvSLAuFF)
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పార్టీ ఎన్నికల్లో గెలవకుండా రిగ్గింగ్ చేసి ప్రజా తీర్పును దొంగిలించాలని ఆయన ఇదివరకే వ్యాఖ్యానించారు. తాము బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి తన పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ మొత్తం 180 సీట్లు గెలుచుకుందని, అయితే రిగ్గింగ్ వల్ల ఆ స్థానాలు 92కు పడిపోయాయని ఇమ్రాన్ తెలిపారు.
ఇప్పటికే ఎన్నికలు రద్దు చేయాలని పిటిషన్ వేసిన ఒక ఆర్మీ అధికారికి సుప్రీంకోర్టు జరిమానా విధించిన నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ వేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. 266 నేషనల్ అసెంబ్లీ సీట్లలో మొత్తం 133 సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారం చేపడుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి కావాల్సిన మెజారిటీ రాలేదు. దీంతో నవాజ్‌షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పవర్‌షేరింగ్ ఒప్పందం కూడా ఇప్పటికే కదుర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment