Supreme Court of Pakistan
-
పాక్ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) పదవీ కాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ సోమవారం ఆమోదముద్ర వేశారు. అంతేకాదు, సీజేను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జిలతో ప్రత్యేక కమిటీ నియామకం ఉత్తర్వుపైనా ఆయన సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన 26వ రాజ్యాంగ సవరణపై నేషనల్ అసెంబ్లీ, సెనేట్లతో ఆదివారం మొదలైన చర్చలు, సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజా సవరణ ద్వారా ఈ నెల 25న పదవీ విరమణ చేసే సీజే జస్టిస్ కాజీ ఇసా స్థానంలో జస్టిస్ మన్సూర్ అలీ షా కొత్తగా బాధ్యతలు చేపట్టకుండా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. ఆయన స్థానంలో సీనియర్ మోస్ట్ జడ్జి ఆటోమేటిక్‌గా ఆ పదవిని చేపడతారు. తాజా పరిణామంతో ఈ సంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది. అంతేకాకుండా, సీజే ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటుకానుంది. ఇందులో సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జీలతోపాటు, సెనేట్, నేషనల్ అసెంబ్లీ నుంచి ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారు. చట్ట సవరణను నవ శకానికి నాందిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభివర్ణించగా దేశ స్వతంత్ర న్యాయవ్యవస్థకు చావుదెబ్బగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ పేర్కొంది. -
PAK:ఎన్నికలు రిగ్గింగ్ చేశారు: సుప్రీంకోర్టులో ఇమ్రాన్ పిటిషన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పార్టీ ఎన్నికల్లో గెలవకుండా రిగ్గింగ్ చేసి ప్రజా తీర్పును దొంగిలించాలని ఆయన ఇదివరకే వ్యాఖ్యానించారు. తాము బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి తన పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ మొత్తం 180 సీట్లు గెలుచుకుందని, అయితే రిగ్గింగ్ వల్ల ఆ స్థానాలు 92కు పడిపోయాయని ఇమ్రాన్ తెలిపారు. ఇప్పటికే ఎన్నికలు రద్దు చేయాలని పిటిషన్ వేసిన ఒక ఆర్మీ అధికారికి సుప్రీంకోర్టు జరిమానా విధించిన నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ వేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. 266 నేషనల్ అసెంబ్లీ సీట్లలో మొత్తం 133 సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారం చేపడుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి కావాల్సిన మెజారిటీ రాలేదు. దీంతో నవాజ్‌షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పవర్‌షేరింగ్ ఒప్పందం కూడా ఇప్పటికే కదుర్చుకున్నారు. ఇదీ చదవండి.. అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు -
Pakistan Supreme Court: చట్టవిరుద్ధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. అల్–ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెసుŠట్ చేసి జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్ఏబీ) కస్టడీలో ఉంచడాన్ని పాక్ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘ ఇమ్రాన్‌ను అరెస్ట్చేయడం పూర్తిగా చట్టవ్యతిరేకం. ఆయనను వెంటనే విడుదల చేయండి. విడుదలయ్యాక ఇస్లామాబాద్‌లో సురక్షిత ప్రాంతంలో ఉంచి రక్షణ కల్పించండి’అని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టులో అరెస్టయిన ఇమ్రాన్‌కు పెద్ద ఉపశమనం లభించింది. గంటలో హాజరుపరచండి అంతకుముందు మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో లాక్కెళ్లి అరెస్ట్ చేయడాన్ని ఇమ్రాన్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఆ పిటిషన్ గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్ఏబీ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘గంటలోగా ఇమ్రాన్‌ను మా ముందుకు తీసుకురండి’ అని మధ్యాహ్నం 3.30కి ఎన్ఏబీని ఆదేశించింది. దీంతో వెంటనే ఖాన్‌ను కోర్టుకు తీసుకొచ్చారు.‘హైకోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఒక వ్యక్తిని కోర్టు ప్రాంగణంలో ఎలా అరెస్ట్ చేస్తారు? న్యాయం కోసం కోర్టుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ కోర్టులో లొంగిపోవడానికే వస్తుంటే అరెస్ట్ చేయడంలో అర్థమేముంది? అరెస్ట్ చేసేందుకు ఏకంగా 90 మంది పోలీసులు కోర్టులో చొరబడితే హైకోర్టుకు ఏం విలువ ఇచ్చినట్టు? అని అధికారులపై ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అతా బందియాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తదుపరి న్యాయపర ఆదేశాల అభ్యర్థన కోసం శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లండి. ఆ కోర్టు నిర్ణయమే తుది నిర్ణయం’ అని ఇమ్రాన్‌కు సుప్రీంకోర్టు సూచించింది. అరెస్ట్‌తో రణరంగంలా మారిన పాక్‌లో ఇప్పటిదాకా ఎనిమిది మంది చనిపోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. కాగా, ‘ఒక నేరగాడిని విడుదల చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎంతో సంతోషంగా ఉన్నారు. నేరగాడికి రక్షణ కవచంగా ఉంటూ దేశంలో చెలరేగుతున్న హింసకు మరింత ఆజ్యం పోస్తున్నారు’ అని పాకిస్తాన్ ముస్లింలీగ్–నవాజ్ పార్టీ నాయకురాలు మరియం నవాజ్ ఆరోపించారు. -
ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే రిలీజ్ చేయండి: పాక్ సుప్రీం కోర్టు
ఇస్లామాబాద్: పీటీఐ అధినేత, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్ సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయన అరెస్ట్‌ను చట్టవిరుద్ధమైందిగా తేల్చిన సుప్రీం కోర్టు.. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని గురువారం సాయంత్రం ఆదేశించింది. అంతకు ముందు.. ఇమ్రాన్ ఖాన్‌ను గంటలోపు తమ ఎదుట ప్రవేశపెట్టాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. దర్యాప్తు సంస్థ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోను ఆదేశించింది. దీంతో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఆయన అరెస్ట్‌లో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో వ్యవహరించిన తీరును ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. విచారణకు హాజరైన ఇమ్రాన్ ఖాన్‌ను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారని మండిపడింది. అల్ ఖాదీర్ ట్రస్ట్ ల్యాండ్‌కు సంబంధించిన కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు విచారణకు హాజరైన ఇమ్రాన్ ఖాన్‌ను.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఎనిమిది రోజుల విచారణకు ఇమ్రాన్ ఖాన్‌కు కస్టడీకి తీసుకుంది కూడా. మరోవైపు ఖాన్ అరెస్టును ఖండిస్తూ.. పాక్‌లో అల్లర్లు హింసకు పాల్పడ్డారు పీటీఐ కార్యకర్తలు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు జోక్యం ద్వారా పరిస్థితి కాస్త చల్లబడినట్లయ్యింది. PTI Chairman @ImranKhanPTI in Supreme Court today. His arrest has been declared illegal. pic.twitter.com/ewwwIRfqaz — PTI (@PTIofficial) May 11, 2023 The barbaric arrest of Imran Khan buries the dead democracy of Pakistan in a grave! pic.twitter.com/outJDcFakT — Ashok Swain (@ashoswai) May 9, 2023 -
ఎట్టకేలకు... ఇమ్రాన్ ఇంటికి
ఇస్లామాబాద్: నెలకు పైగా నానా మలుపులు తిరుగుతూ వచ్చిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం కథ ఎట్టకేలకు కంచికి చేరింది. పాక్ జాతీయ అసెంబ్లీలో శనివారం రోజంతా జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం అర్ధరాత్రి దాటాక అధికార సభ్యుల గైర్హాజరీలో జరిగిన ఓటింగ్‌లో 174 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దాంతో విపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడం, ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడం చకచకా జరిగిపోయాయి. అంతకుముందు జాతీయ అసెంబ్లీ వేదికగా శనివారం రోజంతా పాక్ రాజకీయాలు నానా మలుపులు తిరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తీర్మానంపై ఓటింగ్ జరిపేందుకు ఉదయం 10.30కు సమావేశమైన సభ అర్ధర్రాతి దాకా నాలుగైదుసార్లు వాయిదా పడింది. స్పీకర్ అసద్ ఖైజర్ ఉద్దేశపూర్వకంగానే ఓటింగ్‌ను జాప్యం చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. తక్షణం ఓటింగ్ చేపట్టాలని కోరాయి. కానీ ఓటింగ్‌కు స్పీకర్ ససేమిరా అన్నారు. ‘‘ఓటింగ్ జరిపి ఇమ్రాన్‌తో నా 30 ఏళ్ల బంధాన్ని తెంచుకోలేను. కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి వచ్చినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ జరపబోను’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ గలాభా మధ్యే రాత్రి వేళ ఇమ్రాన్ తన నివాసంలో అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాజీనామా చేయబోయేది లేదని స్పష్టం చేశారు. ఆయన సభకు కూడా వెళ్లలేదు. అనంతరం పాక్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 తర్వాత స్పీకర్ ఇమ్రాన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. విదేశీ కుట్రకు రుజువుగా కేబినెట్ తనకు ముఖ్యమైన పత్రాలు అందజేసిందని, వాటిని సీజేఐ, విపక్ష నేత పరిశీలించాలని కోరారు. ‘‘ఓటింగ్ జరిపి విదేశీ కుట్రలో భాగం కాలేను. రాజీనామా చేస్తున్నా’’ అని అర్ధరాత్రి 11.30కు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి కూడా ఆయన బాటలోనే నడిచారు. స్పీకర్ సూచన మేరకు విపక్ష పీఎంఎల్ (ఎన్)కు చెందిన ప్యానల్ చైర్మన్ అయాజ్ సాదిక్ అధ్యక్షతన అర్ధరాత్రి 11.45కు ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. 11.50కి అధికార పీటీఐకి చెందిన 156 మంది ఎంపీలూ సభ నుంచి వెళ్లిపోయారు. సభ నిబంధనల మేరకు 11.58కి సభను మర్నాటికి వాయిదా వేశారు. నాలుగు నిమిషాల అనంతరం అర్ధరాత్రి 12.02కు సభ తిరిగి సమావేశమైంది. అనంతరం మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు స్వీకరిస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. తర్వాత తలుపులన్నీ మూసేసి ఓటింగ్ చేపట్టారు. 12.10కి ఓటింగ్ జరిగింది. 342 మంది సభ్యులున్న సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు కనీసం 172 మంది మద్దతు అవసరం. రాత్రి ఒంటిగంటకు 174 మంది అనుకూలంగా ఓటేయడంతో తీర్మానం సులువుగా గట్టెక్కింది. అంతకుముందు, శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఇమ్రాన్ కావాలనే ధిక్కరిస్తున్నారంటూ విపక్షాలు మరోసారి కోర్టు తలుపు తట్టాయి. ఇమ్రాన్ దేశం విడిచిపోకుండా చూడాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు ప్రధా న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ శనివారం అర్ధరాత్రి 12 తర్వాత కోర్టును సమావేశపరచాలని అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. పూర్తిస్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరుపుతామని ప్రకటించారు. ఈలోపు పరిస్థితులు మారి పరిణామాలు ఓటింగ్‌కు దారి తీశాయి. భారత్‌కే వెళ్లిపో... ఇమ్రాన్‌పై విపక్షాల ధ్వజం భారత్‌ను ప్రశంసిస్తూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై అక్కడి విపక్షాలు మండిపడ్డాయి. భారత్ అంతగా నచ్చితే అక్కడికే వెళ్లిపోవాలని పీఎంఎల్ (ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం అన్నారు. భారత్ సిసలైన సార్వభౌమ దేశమని, ఏ అగ్రరాజ్యం కూడా దాన్ని శాసించలేదంటూ ఇమ్రాన్ ప్రశంసించడం తెలిసిందే. ‘‘అవిశ్వాస తీర్మానాల విషయంలో కూడా భారత్‌ను అనుసరించు. అక్కడి ప్రధానులు 27 దాకా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు. వాజ్‌పేయి వంటివారు కేవలం ఒక్క ఓటుతో ఓడి హుందాగా తప్పుకున్నారు. అంతే తప్ప నీలా ఎవరూ ప్రజాస్వామ్యంతో, రాజ్యాంగంతో, విలువలతో ఇష్టానికి ఆడుకోలేదు’’ అని ఆయన్నుద్దేశించి మరియం అన్నారు. ‘‘ఇమ్రాన్ ఓ సైకో. ఆయనకు పిచ్చెక్కింది’’ అంటూ మండిపడ్డారు. -
అధ్యక్షుడు అరీఫ్ తొలగింపు..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ గద్దె దిగిపోవడానికి సమయం దగ్గరకొస్తోంది. సుప్రీం కోర్టు నిర్ణయంతో శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంటులోని దిగువ సభ జాతీయ అసెంబ్లీలో ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభలో మెజార్టీ లేకపోయినప్పటికీ ఆఖరి బాల్ వరకు పోరాడుతానంటూ ఇమ్రాన్ ఇంకా మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్లో ప్రతిపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. విపక్షాలన్నీ చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గలేక ఇమ్రాన్ గద్దె దిగిపోతే అధ్యక్షుడు అరిఫ్ అల్వీని తొలగించడానికి ప్రణాళికలు రూపొందించాయి. అదే విధంగా యూకేలో ప్రవాసానికి వెళ్లిపోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని తిరిగి పాక్‌కి తేవాలని భావిస్తున్నాయి. పాకిస్తాన్ ముస్లింమ్ లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధ్యక్షుడు, జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు షెబాజ్ షరీఫ్ (70) కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమాణ స్వీకారమయ్యాక ఆయన ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి వెల్లడించే అవకాశాలున్నాయని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఒక నివేదికలో వెల్లడించింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా విపక్షాల అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర దాగి ఉందన్న ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రభుత్వం. రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ తారిక్ ఖాన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీధుల్లో నిరసన తెలపండి: ఇమ్రాన్ పాకిస్తాన్లో ‘దిగుమతి అయిన ప్రభుత్వాన్ని’ ఎంతమాత్రం అంగీకరించబోనని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం తేల్చిచెప్పారు. తనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ‘బెదిరింపు లేఖ’ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. శనివారం అవిశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్న ఇమ్రాన్ పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం సాయంత్రం తనతో కలిసి వీధుల్లో నిరసన తెలపాలని మద్దతుదారులకు సూచించారు. దీన్నిబట్టి పదవి నుంచి దిగిపోక తప్పదన్న నిర్ణయానికి ఆయన వచ్చి నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి, పదవి నుంచి తప్పుకున్న తొలి పాక్ ప్రధానిగా చరిత్రకెక్కుతారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్! ‘ఓటింగ్ జరగాల్సిందే..’
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇమ్రాన్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదని కోర్టు పేర్కొంది. ఇమ్రాన్ సర్కార్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీ రద్దు వంటి అంశాలపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ ఉమర్ అట బండియల్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ఖలీద్ జావెద్ ఖాన్ వాదనలు వినిపించారు. పార్లమెంటు అంతర్గత వ్యవహారాల్లో న్యాయస్థాన జోక్యం సరికాదని, స్పీకర్ నిర్ణయాలను సవాల్ చేసే అధికారం కోర్టులకు లేవని పాక్ ప్రధాని తరపు న్యాయవాది వాదించారు. అనంతరం పాక్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఉమర్ అటా బండియల్ తీర్పు వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. అవిశ్వాసంపై మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని, జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పాక్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ జరగనుంది. చదవండి: శ్రీలంక ప్రధాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏ క్షణం ఏం జరుగుతుందో? -
పాక్‌లో మరో ట్విస్ట్.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తాడు..?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దుపై విచారణను ఆ దేశ సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈలోపు జాతీయ భద్రతా సమాఖ్య(ఎన్ఎస్సీ) సమావేశ వివరాలను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవిశ్వాసం వెనుక విదేశీ కుట్ర ఉందన్న ఆరోపణలపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. అసెంబ్లీ రద్దుపై చీఫ్ జస్టిస్ ఉమర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం విచారించింది. పీటీఐ (ఇమ్రాన్ పార్టీ) తరఫున బాబర్ అవాన్, అధ్యక్షుడు ఆల్వి తరఫున అలీ జఫీర్ హాజరయ్యారు. అధికరణ 95ను మీరి డిప్యుటీ స్పీకర్ ఇలాంటి ఆదేశాలివ్వడం సబబేనా అని అవాన్‌ను కోర్టు అడిగింది. డిప్యుటీ స్పీకర్ రూలింగ్‌ను సమర్ధించుకునే గట్టి సాక్ష్యాలు కావాలని అవాన్కు కోర్టు సూచించింది. ఎన్ఎస్సీ మీటింగ్ ఆధారంగా తీర్మానాన్ని తిరస్కరించినందున, ఆ సమావేశ మినిట్స్‌ను సమర్పించాలని ఆదేశించింది. డిప్యుటీ స్పీకర్ రూలింగ్‌పై ఎలాంటి ఆదేశాలిచ్చినా, కోర్టు స్వీయ అధికార పరిధి దాటినట్లవుతుందని అధ్యక్షుడి తరఫున హాజరైన జఫీర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. ప్రతిపక్ష పార్టీల తరఫు వాదనను ఇప్పటికే ఆయా పార్టీల న్యాయవాదులు పూర్తి చేశారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారు. డిఫ్యూటీ స్పీకర్ తరఫు న్యాయవాది, ప్రభుత్వ తరఫున అటార్నీ జనరల్ ఇంకా తమ వాదనలు వినిపించాల్సిఉంది. బుధవారం అనుకున్న సమయానికి విచారణ పూర్తికానందున గురువారానికి కేసును వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు విదేశీ కుట్ర జరిగిందన్న ఆరోపణలపై విచారణకు ఒక న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు ‘మెమో గేట్ కేస్’ తరహాలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని తాజాగా ఇమ్రాన్ కోరారు. 2011లో తమ ప్రభుత్వాన్ని సైన్యం కూలదోయకుండా సాయం చేయాలని ఒక సీనియర్ అమెరికా అధికారికి యూఎస్‌లో పాక్ రాయబారి హుసేన్ లేఖ రాశారని ఆరోపణలు వచ్చాయి. -
ఇమ్రాన్ యార్కర్..: పాక్‌లో రాజకీయ సంక్షోభం...
నెల రోజులుగా పదవీ గండం ఎందుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (69) కీలక సమయంలో తనలోని కెప్టెన్‌ను పూర్తిస్థాయిలో బయటికి తీశారు. అవిశ్వాస తీర్మానంపై డిప్యూటీ స్పీకర్‌తో పదునైన యార్కర్ వేయించారు. ఆ తీర్మానం చెల్లదనే నిర్ణయంతో విపక్షాలను డిప్యూటీ స్పీకర్ క్లీన్‌బౌల్డ్ చేయగానే జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసేశారు. అందుకు అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడంతో దేశంలో ముందస్తు ఎన్నికల నగారా మోగింది. ఇదంతా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఇమ్రాన్ యార్కర్‌ను నో బాల్‌గా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే విచారణపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇమ్రాన్‌ఖాన్‌పై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం జరిగిన జాతీయ అసెంబ్లీ కీలక సమావేశం అనూహ్య పరిణామాలకు వేదికైంది. డజనుకు పైగా అధికార పార్టీ సభ్యులు కూడా తీర్మానానికి మద్దతివ్వడంతో ఇప్పటికే మైనారిటీలో పడిన ఇమ్రాన్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడటం లాంఛనమేనని అంతా భావించారు. స్పీకర్ అసద్ ఖైజర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవచ్చన్న అనుమానంతో సమావేశం మొదలవగానే విపక్షాలు ఆయనపై అవిశ్వాస నోటీసు కూడా ఇచ్చాయి. దాంతో సమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి, తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి విపక్షాలకు ఊహించని షాకిచ్చారు. ‘‘తీర్మానం దేశ రాజ్యాంగానికి, నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ అదలా లేదని న్యాయ మంత్రి స్పష్టంగా చెప్పారు. అది విదేశీ కుట్రలో భాగంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అందుకే తీర్మానాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ప్రకటించారు. ఆ వెంటనే సభను వాయిదా వేశారు. దీనిపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ దుయ్యబట్టాయి. నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేదాకా సభను వీడేది లేదన్నాయి. సభలో గలాభా జరుగుతండగానే ఇమ్రాన్ హుటాహుటిన అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిసి జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం, అందుకు ఆయన ఆమోదముద్ర వేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇమ్రాన్ ఇచ్చిన వరుస షాకులతో నోరెళ్లబెట్టడం విపక్షాల వంతైంది. పాక్ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ప్రధానీ పూర్తికాలం పాటు పదవిలో కొనసాగలేదు. షెడ్యూల్ ప్రకారం పాక్‌లో 2023 ఆగస్టులో ఎన్ని కలు జరగాల్సి ఉంది. ఇమ్రాన్ 2018 ఆగస్టు 18న దేశ 22వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. విదేశీ కుట్ర భగ్నం: ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీ రద్దు సిఫార్సు అనంతరం ఇమ్రాన్ జాతిని ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానం ముసుగులో ప్రభుత్వాన్ని మార్చేందుకు జరిగిన విదేశీ కుట్రను విజయవంతంగా అడ్డుకున్నట్టు ప్రకటించారు. దేశ భవితవ్యాన్ని అవినీతి శక్తులు నిర్ణయించలేవన్నారు. ఎన్నికలకు సిద్ధమవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం నిజానికి విదేశీ కుట్రలో భాగమని అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ ఆరోపించారు. తీర్మానం నెగ్గి ప్రభుత్వం పడిపోగానే ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి కుట్ర జరిగిందన్నారు. దాన్ని భగ్నం చేశామని, 90 రోజుల్లోపు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇమ్రాన్ 15 రోజుల పాటు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారన్నారు. ఈ పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని సైన్యం అధికార ప్రతినిధి బాబర్ ఇఫ్తికర్ ప్రకటించారు. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీం నోటీసులు జాతీయ అసెంబ్లీ రద్దును విపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇమ్రాన్‌ను దేశద్రోహి అంటూ విపక్ష నేతలు షాబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీ, మరియం ఔరంగజేబ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పిరికి నిర్ణయాల ద్వారా తన తప్పిదాలను పరోక్షంగా అంగీకరించారని దుయ్యబట్టారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ విపక్షాలు సుప్రీంకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. అత్యవసరంగా విచారణకు స్వీకరించి తక్షనం తీర్పు వెల్లడించాలని కోరాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం ఉదంతంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ అసెంబ్లీ రద్దు విషయంలో అధ్యక్షుడు, ప్రధాని తీసుకున్న నిర్ణయాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు ఎలాంటి రాజ్యాంగవిరుద్ధ చర్యలకూ పాల్పడొద్దని ఇరు వర్గాలనూ ఆదేశించింది. రాజ్యాంగ విరుద్ధమే: నిపుణులు డిప్యూటీ స్పీకర్ చర్య, జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు రెండూ రాజ్యంగ విరుద్ధమేనని పాక్ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు ఆర్టికల్ 6 ప్రకారం వారిద్దరిపై న్యాయ విచారణ జరిగే చాన్సుందని సుప్రీంకోర్టు బార్ అధ్యక్షుడు అషన్ భూన్ అన్నారు. మైనారిటీలో పడటమే గాక పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న ప్రధానికి సభ రద్దుకు సిఫార్సు చేసే అధికారం ఉండదని ప్రముఖ న్యాయ నిపుణుడు, కేంద్ర మాజీ మంత్రి అభిషేక్ మను సింఘ్వి కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ చౌధరి సర్వర్‌ను ఇమ్రాన్ బర్తరఫ్ చేశారు. అవిశ్వాసం నుంచి అవిశ్వాసం దాకా... 2021లో ఇమ్రాన్ తొలిసారి అవిశ్వాస పరీక్ష గట్టెక్కిన నాటి నుంచి జాతీయ అసెంబ్లీ రద్దు దాకా పాకిస్థాన్‌లో జరిగిన కీలక రాజకీయ పరిణామాలు... ► 2021 మార్చి 3: సెనేట్ ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్‌పై విపక్ష నేత యూసుఫ్ రజా గిలానీ నెగ్గడంతో తొలిసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ఇమ్రాన్ ప్రభుత్వం ► మార్చి 6: అవిశ్వాస పరీక్షను నెగ్గిన ఇమ్రాన్ ► 2022 మార్చి 8: ద్రవ్యోల్బణం అదుపులో విఫలమయ్యారంటూ ఇమ్రాన్‌పై మరోసారి విపక్షాల అవిశ్వాస తీర్మానం ► మార్చి 19: విపక్ష కూటమికి మద్దతు ప్రకటించిన పలువురు అధికార పీటీఐ ఎంపీలకు ఇమ్రాన్ షోకాజ్ నోటీసులు ► మార్చి 25: అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించకుండానే సభను వాయిదా వేసిన స్పీకర్ ► మార్చి 27: తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఇమ్రాన్ ఆరోపణ ► మార్చి 28: జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష నేత షాబాజ్ షరీఫ్ ► మార్చి 30: కీలక భాగస్వామ్య పక్షం విపక్షాలతో చేతులు కలపడంతో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ప్రభుత్వం ► ఏప్రిల్ 1: తనకు ప్రాణహాని ఉందని ఇమ్రాన్ ఆరోపణ ► ఏప్రిల్ 3: అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్ ఖసీం సూరి. జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదం. వారి నిర్ణయాలు తమ విచారణకు లోబడి ఉంటాయన్న సుప్రీంకోర్టు. -
పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం.. రంగంలోకి సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అసెంబ్లీ రద్దు, అవిశ్వాస తీర్మానం తిరస్కరణ వ్యవహారాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు వెల్లడించింది.కాగా, పాకిస్తాన్ పార్లమెంట్ (జాతీయ అసెంబ్లీ)లో ఆదివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై జాతీయ అసెంబ్లీలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. ఈ అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర ఉందని అభిప్రాయపడ్డారు. సభను ఈ నెల 25 వరకూ వాయిదా వేశారు. అయితే.. డిప్యూటీ స్పీకర్ తీరుపై విపక్ష పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు.. పాక్ అటార్నీ జనరల్, డిప్యూటీ అటార్నీ జనరల్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. (చదవండి: శ్రీలంకలో ఆంక్షలు.. అల్లాడుతున్న లంకేయులు) దేశ ద్రోహంతో సమానం జాతీయ అసెంబ్లీ రద్దును పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నేత షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. ఇమ్రాన్ చర్యలు దేశద్రోహంతో సమానమని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన ఇమ్రాన్ ఖాన్ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణకు సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. 90 రోజుల్లో ఎన్నికలు ఇక దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నారు. పాకిస్థాన్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని కోరారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలన్నారు. ఇమ్రాన్ ఖాన్ సిఫార్సు మేరకు.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ ప్రకటించారు. (చదవండి: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తప్పిన పదవీ గండం) -
మహిళా సాధికారతకు ప్రతీక.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్
సంప్రదాయ ముస్లిం మెజారిటీ గల పాకిస్థాన్ దేశ న్యాయ చరిత్రలో ఒక మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టులోని సెరిమోనియల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ ఆహ్మద్ 55 ఏళ్ల జస్టిస్ మాలిక్‌తో ప్రమాణం చేయించారు. దీనికి పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, లాయర్లు, లా అధికారులు.. హాజరయ్యారు. జస్టిస్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ విధంగా పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు ఆయేషా మాలిక్. జూన్ 2031లో పదవీ విరమణ పొందేవరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ మాలిక్ పదోన్నతిని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ గత శువ్రారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జూన్ 2030లో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఆయేషా మాలిక్‌కు ఉంది. ఆ విధంగా ఆమె మళ్లీ పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆమె ఘనతను చెప్పే స్థాయి.. వేడుక ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ మాలిక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేంత సమర్ధురాలు, ఆమె ఘనతను చెప్పేంత స్థాయి ఎవరికీ లేదు’ అన్నారు. సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి, జస్టిస్ మాలిక్ సాధించిన ‘మైలు రాళ్ల’కు అభినందనలు తెలిపారు. శ్రీ ఫవాద్ ట్వీట్ చేస్తూ ‘ఒక శక్తిమంతమైన చిత్రం. పాకిస్థాన్‌లో మహిళా సాధికారతకు ప్రతీక’ అని ప్రమాణ స్వీకారోత్సవ చిత్రంతో పాటు, జస్టిస్ ఆయేషా దేశ ‘న్యాయ వ్యవస్థ’కు ఒక ఆస్తిగా ఉంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. మహిళ అనే ఆశ్చర్యమా! లాహోర్ హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ జస్టిస్ మాలిక్ అత్యుత్తమ స్థానానికి ఎంపికైనప్పుడు చాలామంది తమ కనుబొమలను పైకెత్తారు. ఆమె నామినేషన్‌ను పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ (జేసీపీ) గతేడాది తిరస్కరించింది. కానీ, కమిషన్ ఈ నెల ప్రారంభంలో ఆమె పేరును రెండోసారి పరిశీలనకు తీసుకురాగా స్వల్ప మెజారిటీతో ఆమెదించింది. అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నామినేట్ చేసే అత్యున్నత సంస్థ జెసీపీ సమావేశానికి చీఫ్ జస్టిస్ అహ్మద్ అధ్యక్షత వహించారు. సుపీరియర్ జ్యూడీషియరీ నియామకంపై జేసీపీ తర్వాత ద్వైపాక్షిక పార్లమెంటరీ కమిటీ ఆమోదం కోసం మాలిక్ నామినేషన్ ముందుకు వచ్చింది. మాలిక్ లాహోర్ హైకోర్ట్‌కి మొదటి మహిళా అత్యున్నత న్యాయమూర్తి కావడం వల్ల సీనియారిటీ సూత్రాన్ని పక్కన పెట్టి, కమిటీ ఆమె నామినేషన్‌ను ఆమోదించింది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టుకు వారి పదోన్నతిని ఆమోదించేటప్పుడు, గత సంవత్సరం ఆమె పేరును జేసీపీ తిరస్కరించడానికి ఇదీ ఓ కారణం. 1966లో జన్మించిన మాలిక్ పారిస్, న్యూయార్క్, కరాచీలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆమె లాహోర్‌లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా లో ‘లా’ చదివారు. హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎమ్ చేశారు. జూన్ 2021లో లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారి పరీక్ష కోసం కన్యత్వ పరీక్షలు ‘చట్ట విరుద్ధం, పాకిస్థాన్ రాజ్యాంగానికీ వ్యతిరేకం’ అని ఆమె ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి. సోమవారం ఇస్లామాబాద్‌లోని సుప్రీంకోర్టు భవనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్న ఆయేషా మాలిక్. -
ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం.. పిల్లల ప్రాణాలు తీసేవారితో చర్చలా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాలిబన్ల పార్టీ అయిన తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న ఒక్కరోజు తర్వాత ఆ సంస్థ చేసిన ఊచకోతపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2014లో ఆర్మీ ఆధ్వర్యంలో నడిచే స్కూలుపై ఈ ఉగ్రసంస్థ జరిపిన హేయమైన దాడిలో 150 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్ బుధవారం సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న వారికి మీరు మోకరిల్లుతారా అని ప్రశ్నించింది. ‘మీరు అధికారంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు ? ఆ దోషులతో తీరిగ్గా చర్చలు జరుపుతున్నారు’ అని సీజే అహ్మద్ ప్రధానిని నిలదీశారు. ఆనాడు తాము అధికారంలో లేమని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కింద ఆర్థికసాయం చేశామని ఇమ్రాన్ బదులిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రుల గాయాలపై కారం రాసినట్టుగా ప్రధాని మాటలు ఉన్నాయంటూ ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాక్ సుప్రీంకోర్టు తీర్పుపై మండిపడ్డ భారత్
సాక్షి, న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం మండిపడింది. భారత్‌లో భాగమైన గిల్గిట్ బాల్టిస్తాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు పాక్ సుప్రీం కోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్ విదేశాంగ శాఖ అధికారికంగా పాక్ రాయబారికి దౌత్యపరమైన లేఖను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని ప్రాంతాల్ని వెంటనే విడిచి వెళ్లాలని పాక్‌కు స్పష్టం చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్‌పై సర్వాధికారాలూ తమవేనని, దానిపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్ సుప్రీం కోర్టుకు లేవని ఆ దేశ దౌత్యవేత్తకు తేల్చిచెప్పింది. (చదవండి : పాకిస్తాన్ తీరుపై ఆర్మీ చీఫ్ ఆగ్రహం) గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా పాక్ ప్రభుత్వం 2018లో ఓ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని సమర్థిస్తూ పాక్ సుప్రీం కోర్టు గత వారం తీర్పు వెలువరించింది. దీనీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. అధికారికంగా పాక్ దౌత్యవేత్తలకు తన నిరసన తెలిపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎటువంటి మార్పులను సహించబోమని తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాక్ ప్రభుత్వానికి గానీ, సుప్రీం కోర్టుకు గానీ ఎటువంటి హక్కులు ఉండవని తెలిపింది. గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఇదివరకు ఎన్నికలు ఉండేవి కావు. దాన్ని చట్టబద్ధంగా చేజిక్కించుకోడానికి పాక్ కుటిలబుద్ధితో 2018లో ఓ చట్టం తీసుకురాగా అక్కడి సుప్రీంకోర్టు గతవారం దానిపై రబ్బరు స్టాంపు వేసింది. -
షరీఫ్‌కు తాత్కాలిక ఊరట
-
షరీఫ్‌కు తాత్కాలిక ఊరట
ప్రధాని పదవి నుంచి తొలగించలేం: పాక్ సుప్రీంకోర్టు అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు జిట్ ఏర్పాటు ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పనామా పత్రాల కేసులో షరీఫ్‌ను పదవి నుంచి తొలగించేందుకు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ న్యాయ స్థానం తీర్పు చెప్పింది. అయితే ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోప ణలకు సంబంధించి దర్యాప్తు జరిపేందుకు సంయుక్త దర్యాప్తు బృందం (జిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 540 పేజీల తీర్పును గురువారం వెలువరించింది. ఐఎస్ఐ, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఎఫ్ఐఏ, ఎన్ఏబీ, సెక్యూరిటీ, ఎక్సే్ఛంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ సహా కీలక సంస్థలకు చెందిన అధికారులతో జిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. షరీఫ్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ జిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఖోసా పేర్కొన్నారు. వారం రోజుల్లో జిట్‌ను ఏర్పాటు చేయాలని, రెండు వారాలకోసారి జిట్ తన నివేదికను ధర్మాసనానికి సమర్పించాలని, 60 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. జిట్ నివేదిక ఆధారంగా ప్రధానిని అనర్హునిగా ప్రకటించా లనే పిటిషన్‌ను తిరిగి విచారణకు స్వీకరించే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది. షరీఫ్ లండన్‌లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ పనామా పత్రాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే.