ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇమ్రాన్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదని కోర్టు పేర్కొంది. ఇమ్రాన్ సర్కార్‌పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీ రద్దు వంటి అంశాలపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ ఉమర్ అట బండియల్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ఖలీద్ జావెద్ ఖాన్ వాదనలు వినిపించారు.
పార్లమెంటు అంతర్గత వ్యవహారాల్లో న్యాయస్థాన జోక్యం సరికాదని, స్పీకర్ నిర్ణయాలను సవాల్ చేసే అధికారం కోర్టులకు లేవని పాక్ ప్రధాని తరపు న్యాయవాది వాదించారు. అనంతరం పాక్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఉమర్ అటా బండియల్ తీర్పు వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. అవిశ్వాసంపై మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని, జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పాక్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ జరగనుంది.
చదవండి: శ్రీలంక ప్రధాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏ క్షణం ఏం జరుగుతుందో?
Comments
Please login to add a commentAdd a comment