
ఇస్లామాబాద్ : వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలో యుద్ధవిమానాలతో రెచ్చిపోయిన పాకిస్తాన్ యుద్ధం దిశగా సన్నద్ధమవుతున్న సంకేతాలు పంపింది. మహ్మద్ ప్రవక్త ప్రవచించిన కోట్‌ను ఉటంకిస్తూ ‘మీ శత్రువుతో యుద్ధాన్ని కోరుకోకుండా, అల్లా ఆదేశానుసారం వారిని మన్నించండి..అయితే యుద్ధ పరిస్థితి అనివార్యమైతే..అప్పుడు ధృడంగా నిలబడండి..కత్తుల నీడనే స్వర్గం ఉంటుందని మరువకండ’ని పాక్ విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎం ఫైజల్ ట్వీట్ చేశారు.
కాగా భారత గగనతలంలోకి బుధవారం మధ్యాహ్నం చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధ విమానాలు ఎఫ్ 16ను భారత వైమానిక దళం దీటుగా తిప్పికొట్టింది. ఎఫ్ 16ను రాజౌరీ సెక్టార్‌లో వాయుసేన కూల్చివేయగా, మరికొన్ని జెట్స్ భారత భూభాగంపై బాంబులు జారవిడుస్తూ వెనుతిరిగి వెళ్లాయని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఎంతమేర ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లిందనే వివరాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment