
పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : భారత మీడియా తనను బాలీవుడ్ విలన్‌లా చిత్రీకరించిందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.భారత్‌తో చర్చలకు తాను వ్యతిరేకం కాదని పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. పీటీఐ పార్టీ పాక్ ఎన్నికల్లో 119 స్ధానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌తో చర్చలకు తాను వ్యతిరేకం కాదని, కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే చర్చల ద్వారానే సాధ్యమవుతుందని ఇరు దేశాలూ గ్రహించాలని సూచించారు.
చర్చలు ఫలవంతం కావడం భారత ఉపఖండానికీ మేలు చేకూరుస్తుందని అన్నారు. భారత్‌తో మెరుగైన సంబంధాలు కోరుకునే సగటు పాకిస్తానీలలో తాను ఒకడినన్నారు.
పేదరికం లేని ఉపఖండం కావాలనుకుంటే భారత్, పాక్‌ల మధ్య మంచి సంబంధాలు, వాణిజ్య సహకారం ఉండాలని ఆకాంక్షించారు. 22 ఏళ్ల తర్వాత తన పోరాటం ఫలించిందని, తన కల నెరవేరి దేశానికి సేవ చేసే అవకాశం లభించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment