న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు, భారత్‌లో ప్రస్తుత రాజకీయాలపై జోక్యం చేసుకున్న పాకిస్థాన్ మాజీ మంత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు రిప్లై ఇచ్చారు. మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ దేశం సంగతి మీరు చూసుకోండని చురకంటించారు. మీ సపోర్ట్ ఏమీ అవసరం లేదని తిప్పికొట్టారు.
లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో శనివారం(మే25) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఓటు వేసిన ఫొటోను తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. కేజ్రీవాల్ చేసిన ఈ పోస్ట్‌ను పాకిస్థాన్ మాజీ మంత్రి, ఎంపీ చౌధరి ఫహద్ హుస్సేన్ రీపోస్ట్ చేశారు.
ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్‌ను జత చేశారు. ఇండియా ఎలక్షన్స్ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. చౌధరి కామెంట్లకు అరవింద్ కేజ్రీవాల్ తిరిగి వెంటనే స్పందించారు.
‘చౌధరి సాహిబ్ మా దేశంలో సమస్యలను నేను, నా దేశ ప్రజలు పరిష్కరించుకోగలం. ఇందుకు మీ సలహాలు మాకు అక్కర్లేదు. అసలే మీ దేశం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు ఆ పని చూడండి. భారత్‌లో ఎన్నికలు పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. మీ జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు’అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment