Anti-Corruption Department
-
పదేళ్లలో అక్రమార్జన రూ.1,000 కోట్లు!
(శ్రీరంగం కామేశ్, ‘సాక్షి’ ప్రతినిధి) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు / అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎప్పటికప్పుడు కొరడా ఝళిపిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన (డీఏ) వారితోపాటు లంచాలు తీసుకుంటూ చిక్కిన (ట్రాప్) వారి భరతం పడుతోంది. గత పదేళ్లలో ఏసీబీ నమోదు చేసిన కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2014 నుంచి 2024 ఆగస్టు మధ్య డీఏ, ట్రాప్ కేసులు కలిపి మొత్తం 1,032 కేసులను ఏసీబీ నమోదు చేసింది. వాటిలో 109 డీఏ కేసులుకాగా మిగిలినవన్నీ ట్రాప్ కేసులే కావడం గమనార్హం. డీఏ కేసుల్లో స్వా«దీనం చేసుకున్న ఆస్తుల అధికారిక విలువను రూ. 265 కోట్లుగా ఏసీబీ లెక్కించగా బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ. 1,000 కోట్లపైనే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది.ప్రథమ స్థానంలో దేవికారాణి..ఏసీబీ నమోదు చేసిన 109 డీఏ కేసుల్లో అత్యధికంగా 29 కేసులతో తొలి స్థానంలో నిలిచి రెవెన్యూ విభాగం అపఖ్యాతిని మూటకట్టుకోగా 20 కేసులతో మున్సిపల్ అడ్మిని్రస్టేషన్, 11 కేసులతో హోంశాఖ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈఎస్ఐ మందుల సరఫరా కుంభకోణంలో ఏసీబీ 2019లో అరెస్టు చేసిన ఇన్సూరెన్స్ మెడికల్ సరీ్వసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణి అక్రమాస్తులే ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఆమె నుంచి స్వా«దీనం చేసుకున్న ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారమే రూ. 25,70,84,461గా తేలింది. అలాగే రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎంవీ భూపాల్‌రెడ్డిపై నమోదైన ట్రాప్ కమ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 32 ఇళ్ల స్థలాలకు సంబంధించిన దస్తావేజుల అధికారిక విలువ రూ. 4.19 కోట్లుగా తేలింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ. 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. లంచాల బాధితుల కోసం ఏటా రూ. 30 లక్షలు ఏసీబీ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే అంశం అవినీతిపరుల్ని వలపన్ని పట్టుకోవడం. బాధితులు ఓ అధికారి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే ఏసీబీ ఆధారాలు సేకరిస్తుంది. ఆపై రహస్య కెమెరాలు, వీడియో రికార్డింగ్ పరికరాలను బాధితుడికి అమర్చి లంచం అడిగిన అధికారి వద్దకు పంపుతుంది. లంచం డిమాండ్ వీడియో రికార్డయ్యాక ఆ మొత్తంలో కొంత ఇన్స్టాల్మెంట్గా ఇచ్చేలా ఫిర్యాదుదారుడితో చెప్పిస్తుంది. ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారుడే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. బాధితుల నుంచి అధికారి ఆ లంచం సొమ్ము అందుకుంటుండగా అప్పటికే మాటు వేసి ఉండే ఏసీబీ బృందాలు పట్టుకుంటాయి. ఈ మొత్తాన్ని సీజ్ చేసి కోర్టుకు సమరి్పస్తారు. నిరీ్ణత సమయంలో ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారుడికి రీయింబర్స్ చేస్తారు. దీనికోసం ప్రభుత్వం ఏడాదికి రూ.30 లక్షల చొప్పున ఏసీబీకి కేటాయిస్తుంది.‘పింక్’తో రెడ్ హ్యాండెడ్‌గా..లంచం అడిగిన అధికారికి ఇచ్చేందుకు ఫిర్యాదుదారుడు తీసుకొచ్చే కరెన్సీ నోట్లపై ఏసీబీ ముందే ఫినాఫ్తలీన్ అనే రసాయన పొడిని పూస్తుంది. లంచం తీసుకొనే అధికారి లేదా ఆయన సూచించిన వ్యక్తి నోట్ల కట్టలను ముట్టుకోగానే ఈ కెమికల్ అంటుకుంటుంది. వెంటనే ఏసీబీ ఆ సొమ్మును స్వా«దీనం చేసుకోవడంతోపాటు సదరు అధికారి చేతుల్ని సోడియం బైకార్బొనేట్ ద్రావణంలో ముంచుతుంది. అప్పుడు ఆ ద్రావణం గులాబీ రంగులోకి మారుతుంది. ఈ ప్రక్రియను సాక్షుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేసి కోర్టుకు ఏసీబీ సమరి్పస్తుంది. శిక్షల వరకు ‘ప్రయాణం’లో అవాంతరాలెన్నో..ఏసీబీ నమోదు చేసే కేసులు శిక్షల వరకు వెళ్లడం మధ్య ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులపై ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జిïÙట్ దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. ఈ దశలోనే అనేక కేసులు మూతపడటం, డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి సిఫార్సు కావడం జరుగుతోంది. ఒకవేళ చార్జ్ïÙట్లు దాఖలు చేసినా న్యాయ విభాగంలో ఉన్న మానవవనరుల కొరతతో విచారణకు సుదీర్ఘ సమయం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు ఏసీబీ కోర్టులే ఉండటంతోపాటు కొన్ని సందర్భాల్లో సాక్షులు ఎదురు తిరగడం, సుదీర్ఘ విచారణ తదితరాల నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ కేసుల్లో శిక్షల శాతం 55గా ఉంది. దీన్ని ఈ ఏడాది 60 శాతం దాటించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.మొత్తం ఐదు రకాలైన కేసులు...వాస్తవానికి ఏసీబీ ఐదు రకాల కేసులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ట్రాప్, డీఏ కేసులను నేరుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. వాటిని రిజిస్టర్డ్ కేస్ ట్రాప్ (ఆర్సీటీ), రిజిస్టర్డ్ కేస్ అసెట్స్ (ఆర్సీఏ) అంటారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీల ద్వారా అధికారుల నేరపూరిత దు్రష్పవర్తనను గుర్తించి ప్రాథమిక దర్యాప్తు చేపడుతుంది. అనంతరం ఆయా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు సిఫార్సు చేస్తుంది. మరోవైపు ఆర్టీఏ చెక్‌పోస్టులు, కార్యాలయాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీల ద్వారా గుర్తించే అవినీతిపై రిజిస్టర్డ్ కేస్ అదర్స్ (ఆర్సీఓ) నమోదు చేసి శాఖాపరమైన చర్యలకు బదిలీ చేస్తుంటుంది. ఇక ఏసీబీ డీజీ సూచనల మేరకు కొన్ని అంశాలపై డిస్క్రీట్ ఎంక్వైరీలు చేపడుతుంది. ఇందులో ఆధారాలు లభిస్తే ఆర్సీటీ, ఆర్సీఏ కింద మార్చి ముందుకు వెళ్తుంటుంది.ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతాంప్రభుత్వ ఉద్యోగులు లేదా అధికారులు లంచం డిమాండ్ చేస్తే మాకు ఫిర్యాదు చేయండి. 1064 నంబర్‌కు కాల్ చేసి లేదా నేరుగా మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి ఫిర్యాదును అన్ని కోణాల్లోనూ విచారించి చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. – విజయ్‌కుమార్, డీజీ, అవినీతి నిరోధక శాఖ -
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కార్యాలయాలు, చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. మంగళవారం ఏకకాలంలో 15 ఏసీబీ బృందాలు.. మొత్తం 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. దాదాపు అన్ని కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తులు ఇతరులకు చెందిన ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. పలు కార్యాలయాల్లో సిబ్బంది యూనిఫాం లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నట్టు గమనించారు. ఏసీబీ అధికారులను చూసిన ఏజెంట్లు పరారయ్యారు. కార్యాలయాల సమీపంలోని తమ దుకాణాలను మూసివేశారు. కాగా దాడులు, తనిఖీల సందర్భంగా లెక్కల్లో చూపని రూ.2,70,720 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఏసీబీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాంతాల వారీగా వివరాలు వెల్లడించింది. బండ్లగూడలో రూ.48,370ను స్వాధీనం హైదరాబాద్ బండ్లగూడ కార్యాలయంలో జరిపిన సోదాల్లో రూ.48,370 స్వా«దీనం చేసుకున్నారు. మలక్‌పేట కార్యాలయంలో రూ.22 వేలు, టోలిచౌకి కార్యాలయంలో రూ.43,360, మణికొండలోని రంగారెడ్డి డీటీసీ కార్యాలయం రూ.23,710 స్వా«దీనం చేసుకున్నారు. ఇక నల్లగొండ కార్యాలయంలో రూ.12,200, నిజామాబాద్‌లోని సాలూర్ చెక్‌పోస్టులో రూ.13,500, ఆదిలాబాద్‌లోని భోర్జా చెక్‌పోస్టులో రూ.11,630, మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రూ.61,900, ఖమ్మంలోని అశ్వరావుపేట చెక్‌పోస్టులో రూ.34,050 స్వాదీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్ కార్యాలయాల్లో సోదాల సందర్భంగా నగదు పట్టుబడనప్పటికీ పలువురు అనధికారిక వ్యక్తులు ఇతరులకు సంబంధించిన ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. కొన్నిచోట్ల కొందరు ఉద్యోగులు యూనిఫాం లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నట్టు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లో డ్రైవింగ్ టెస్టు ట్రాక్ దగ్గర ఒక ప్రైవేట్ కారు ఏర్పాటు చేసి ఒక్కొక్కరి దగ్గర రూ.200 వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ధ్రువపత్రాలపై ప్రత్యేక కోడ్ సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు ప్రత్యేక కోడ్ నంబర్లు వేసి ఉన్న కొన్ని ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్‌లోని సాలూరు చెక్‌పోస్టులో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ విధులకు హాజరుకాలేదని గుర్తించారు. అశ్వారావుపేట చెక్‌పోస్టులో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మఫ్టీలో ఉండగా, ఏడుగురు ప్రైవేటు వ్యక్తులు వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఆదిలాబాద్‌లోని భోర్జా చెక్‌పోస్టులో ప్రైవేటు వ్యక్తులకు నెలకు రూ.8 వేల చొప్పున జీతం చెల్లిస్తూ వారితో లారీడ్రైవర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయిస్తున్నట్టు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. మంగళవారం నాటి దాడుల సందర్భంగా వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో గుర్తించిన అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064లో ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లారీ డ్రైవర్ల వేషధారణలో.. – అశ్వారావుపేట చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు – అదుపులో ఎంవీఐ, ప్రైవేటు సిబ్బంది అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులో ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టు వద్ద తనిఖీలకు ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషధారణలో వెళ్లారు. ఏపీకి సరిహద్దునే ఉన్న ఈ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తులను నియమించి.. లారీ సామర్ధ్యాన్ని బట్టి పాసింగ్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. 10 టైర్ల లారీకి ఒక రేటు, 12 టైర్ల లారీకి మరో ధర ఉంది. ఇందుకోసం చెక్‌పోస్టులో ఒక ట్రే పెట్టారు. లారీ డ్రైవర్లు తాము చెల్లించాల్సిన మొత్తాన్ని ఆ ట్రేలో వేసి వెళ్లాలి. లారీకి సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా సరే మామూళ్లు సమర్పించాల్సిందేనని తెలిసింది. ఏసీబీ అధికారులు ఉన్న సమయంలో కూడా కొందరు లారీ డ్రైవర్లు ఇలా డబ్బు ఇచ్చి వెళ్లారు. ఇక్కడ ప్రైవేట్ సిబ్బంది నుంచి రూ.28 వేలు, ట్రే లోని రూ.7 వేలు స్వా«దీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న ఎంవీఐ యూనిఫాం కూడా వేసుకోలేదని తెలిపారు. ఎంవీఐతో పాటు ప్రైవేట్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. -
ఏసీబీకి దొరికిపోయారు
హైదరాబాద్: ఇంటి నిర్మాణ అనుమతికి లంచం తీసుకుంటున్న హయత్‌నగర్ టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం పట్టుకున్నారు. గుర్రంగూడకు చెందిన జక్కిడి సుధాకర్‌రెడ్డి బీఎన్‌రెడ్డి నగర్లో ఇంటి నిర్మాణ అనుమతి కోసం హయత్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఉమను సంప్రదించారు. ఇంటి నిర్మాణ అనుమతికి రూ.2 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రూ.1.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని సుధాకర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సరూర్‌నగర్‌లోని హయత్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో సుధాకర్‌రెడ్డి నుంచి రూ.1.5 లక్షలు టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ ఉమ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మణ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ తదితరఅధికారులు పట్టుకున్నారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపర్చారు. -
ఏసీబీకి చిక్కిన సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్
కర్నూలు: కర్నూలు కృష్ణానగర్‌లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న పి.సుజాతపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆమె నివాసం ఉంటున్న కర్నూలు శ్రీరామ్‌నగర్‌లోని నాగులకట్ట వద్దనున్న ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కోఆపరేటివ్ కార్యాలయంలో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, కృష్ణయ్య, ఇంతియాజ్ బాషా, వంశీనాథ్ తదితరులు బృందాలుగా ఏర్పడి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే దాకా విస్తృతంగా సోదాలు జరిపారు. వీటిలో అక్రమ స్థిర, చరాస్తులను గుర్తించారు. కర్నూలుకు చెందిన సుజాత 1993 డిసెంబర్ 9న జూనియర్ ఇన్స్పెక్టర్ హోదాలో కోఆపరేటివ్ శాఖలో ఉద్యోగంలో చేరారు. 1999లో సీనియర్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది కర్నూలు, ఆత్మకూరు ప్రాంతాల్లో పనిచేశారు. 2009లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు. ఆత్మకూరుతో పాటు కలెక్టరేట్లోని డీసీవో కార్యా లయంలో విధులు నిర్వర్తించారు. గత ఆరేళ్లుగా కర్నూలు కృష్ణానగర్‌లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సోదాల్లో గుర్తించిన అక్రమాస్తులు ఇవే.. కర్నూలులోని శ్రీరామ్ నగర్లో జి+2 ఇల్లు, అశోక్ నగర్లో జి+1 ఇల్లు, కస్తూరి నగర్లో ఒక ఇల్లు, బుధవారపేటలో జి+1తో పాటు సమీపంలోనే మరో వ్యాపార దుకాణం, కర్నూలు మండలం సుంకేసులలో 2.53 ఎకరాల వ్యవసాయ భూమి, కర్నూ లు చుట్టుపక్కల 8 ఇళ్ల స్థలాలు, బ్యాంకు లాకర్లో 40 తులాల బంగారు నగలు, టాటా విస్టా కారు, హోండా యాక్టివా స్కూటీతో పాటు ఖరీదైన ఎల క్ట్రానిక్ గృహోపకరణాలు, రూ.8.21 లక్షల నగ దుతో పాటు కొన్ని ప్రామిసరీ నోట్లు గుర్తింపు. డాక్యుమెంట్ ప్రకారం వీటి విలువ రూ.1.80 కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో అక్రమాస్తుల విలువ రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు అనంతరం సుజా తను కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చ నున్నట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. పటమట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లోనూ సోదాలు సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావు కార్యాలయం, నివాసంతోపాటు మరో నాలుగు ప్రదేశాల్లో ఉన్న ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయనికి మించి ఆర్జించిన స్థిర, చరాస్తులు ఆర్జించారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్న సోదాలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. అనంతరం తాము గుర్తించిన ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
పౌరసరఫరాల శాఖ అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఒంగోలు: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖలో రూ.29.87 కోట్ల అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులు, ఉద్యోగుల నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు నిర్వహించింది. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ పి.పద్మ, అసిస్టెంట్ మేనేజర్లు సీహెచ్.చల్లా జయశంకర్, ఎంవీవీడీ శర్మ, రికార్డ్ అసిస్టెంట్ పి.అరుణ కుమారి, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివ కుమార్‌లకు విజయవాడ, ఒంగోలు, నెల్లూరుల్లో ఉన్న నివాసాల్లో ఏసీబీ బృందాలు బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగించాయి. ఆ అధికారుల ఆస్తుల పత్రాలు, బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఇతర విలువైన వస్తువులను ఏసీబీ జప్తు చేసింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయంలో ఈ ఏడాది మొదట్లో ఇంటర్నెల్ ఆడిట్ నిర్వహించగా అవినీతి వ్యవహారం బయటపడింది. 2020–21, 2021–22లకు సంబంధించి రూ.29.87 కోట్ల నిధులు దారి మళ్లినట్లు గుర్తించారు. దాంతో పి.పద్మ, చల్లా జయశంకర్, ఎంవీవీడీ శర్మ, టి.అరుణ కుమారి, శివ కుమార్లతోపాటు కాంట్రాక్టర్ చేజెర్ల దయాకర్, ప్రైవేటు వ్యక్తులు ఎం.రాడమ్మ, సూరి పవన్, చీపురుపల్లి రాజు, చేజెర్ల కామాక్షి, గరికిపాటి ప్రశాంతిలపై నెల్లూరులోని విద్యాధరపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కేసును ఏసీబీకి బదిలీ చేశారు. దీంతో వారిపై ఈ నెల 6న కేసు నమోదు చేసిన ఏసీబీ..బుధవారం అధికారులు, ఉద్యోగుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. సోదాలు పూర్తి అయిన తరువాత ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోనుంది. -
‘మా అమ్మను కిడ్నాప్ చేశారు’
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని మానవహక్కుల మంత్రిగా పనిచేసిన తన తల్గి షిరీన్ మజారీని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆమె కుమార్తె ఆరోపించింది. వాస్తవానికి ఆమె అవినీతి నిరోధక సంస్థ కస్టడీలో ఉన్నారు. కానీ ఆమె కుమార్తె ఇమాన్ జైనాబ్ మజారీ మాత్రం పోలీసులు తన తల్లిని కొట్టి తీసుకెళ్లారని ఆరోపణలు చేశారు. అయినా ఏ వ్యక్తినైన అరెస్ట్ చేసేముందు ఏ అభియోగంతో తీసుకెళ్తున్నారో చెప్పాలి కానీ తనకు అవేమీ చెప్పలేదని కేవలం తన తల్లి లామోర్ అవినీతి నిరోధక విభాగంలో ఉందని మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు. సున్నితంగా ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రభుత్వం తన తల్లిని కిడ్నాప్ చేసిందంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. తన తల్లికి ఏదైన జరిగితే ఎవరిని వదలిపెట్టనంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన సహోద్యోగిని ఈ ఫాసిస్ట్ పాలన హింసాత్మక ధోరణితో కిడ్నాప్ చేసిందంటూ ఆరోపణలు చేశారు. తమ ఉద్యమం శాంతియుతమైనదని ఫాసిజాన్ని దిగుమతి చేసుకున్న ప్రభుత్వం దేశాన్ని గందరగోళంలోకి నెట్టాలని చూస్తోందన్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉన్నది సరిపోదన్నట్లు ఈ ఎన్నికలను నివారించేందుకే ఈ అరాచకాలు సృష్టిస్తున్నారంటూ విమర్శించారు. (చదవండి: ఉత్తర కొరియాకు వ్యాక్సిన్ ఆఫర్ ప్రకటించిన అమెరికా...కిమ్‌ని కలుస్తానంటున్న బైడెన్) -
Andhra Pradesh: లంచమడిగితే ‘యాప్’తో కొట్టండి
సాక్షి, అమరావతి: అవినీతి నిరోధానికి ప్రభుత్వం ప్రజల చేతికే వజ్రాయుధాన్ని అందిస్తోంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించింది. లంచాలు, అవినీతి లేకుండా ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పారు. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఓ మొబైల్ యాప్‌ను రూపొందించాలని పోలీసు శాఖపై ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఆదేశించారు. దీంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ‘14400 యాప్’ ను రూపొందించింది. లంచగొండుల పాలిట సింహస్వప్నంలా దీనిని రూపొందించారు. ఈ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే ఆవిష్కరించనున్నారు. తక్షణం ఫిర్యాదుకు అవకాశం రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం వినూత్న రీతిలో ‘దిశ’ యాప్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే ఆదుకొనేందుకు , పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మహిళలు ఫిర్యాదు చేసేందుకు, రూపొందించిన ఈ యాప్ విజయవంతమైంది. అదే తరహాలో అవినీతిపై ప్రజలు తక్షణం ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీనికి రూపకల్పన చేసింది. ఆడియో, వీడియో, ఫొటో ఆధారాలతో సహా ఫిర్యాదు అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏసీబీ కొంతకాలంగా 14400 టోల్‌ఫ్రీ నంబరును నిర్వహిస్తోంది. ఈ నంబరుతో ఫిర్యాదు మాత్రమే చేయగలరు. ఫిర్యాదుదారులు సాక్ష్యాధారాలు సమర్పించేందుకు అవకాశాలు తక్కువ. క్షేత్రస్థాయిలో అవినీతిపై ప్రత్యక్షంగా ఆధార సహితంగా ఫిర్యాదు చేయడం సాధ్యం కాదు. టోల్‌ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్ కాల్స్‌పై ఏసీబీ అధికారులు స్పందించి తరువాత ఆకస్మిక దాడులు, తనిఖీలు చేస్తారు. బాధితుల ద్వారా లంచం ఎరవేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొంటారు. ఇవన్నీ కాలయాపనతో కూడుకున్నవి. అవినీతి అధికారులు, సిబ్బంది జాగ్రత్తపడే అవకాశం ఉండేది. కొందరు అధికారులు నేరుగా లంచాలు తీసుకోకుండా వారి ఏజెంట్లకు ఇవ్వమని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు ముగింపు పలుకుతూ అవినీతిని తక్షణం ఆధార సహితంగా ఫిర్యా దు చేసేందుకు అవకాశం కల్పించేందుకే 14400 యాప్‌ను ఏసీబీ రూపొందించింది. విస్తృత అవగాహన దిశ యాప్ తరహాలోనే ఏసీబీ 14400 యాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. అందుకోసం జిల్లా, మున్సిపాలిటీ, మండల, పంచాయతీ స్థాయిలో అవగాహన సదస్సులు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అవగాహన కల్పిస్తారు. కరపత్రాలు, టీవీ, పేపర్లలో ప్రకటనల ద్వారా యాప్ ఉపయోగాలను ప్రజలకు తెలియజేస్తారు. అవినీతి అంతం దిశగా కీలక ముందడుగు ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 14400 యాప్‌ను రూపొందించాం. ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి లేకుండా చేయాలన్న లక్ష్య సాధన కోసమే ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తేనున్నాం. ప్రజలు సులభంగా, ఆధార సహితంగా ఫిర్యాదు చేసేందుకు యాప్ అవకాశం కల్పిస్తుంది. ఏసీబీ అధికారులు కూడా తక్షణం చర్యలు తీసుకునేందుకు సాధ్యపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ఈ యాప్‌ను ఆవిష్కరిస్తారు.’ – డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి యాప్ పని చేస్తుందిలా.. ► 14400 మొబైల్ యాప్‌లో ‘లైవ్ రిపోర్ట్’ ఉంటుంది. ► అధికారులు, సిబ్బంది లంచాలు అడుగుతున్నా, ఇతరత్రా అవినీతికి పాల్పడుతున్నా ఆ యాప్‌లో లైవ్ రిపోర్టింగ్ ఫీచర్ ద్వారా తక్షణం ఫిర్యాదు చేయవచ్చు. ► లైవ్ రిపోర్టింగ్ ఫీచర్లో ఫొటో,వీడియో, ఆడియో, ఫిర్యాదు నమోదు ఆప్షన్లు ఉన్నాయి. ► లంచం తీసుకుంటున్న లైవ్ ఫొటో తీసి ఆ యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు ► లంచం అడుగుతున్నప్పుడు మాటలను లైవ్‌లో రికార్డ్ చేసి అప్లోడ్ చేయవచ్చు. ► లైవ్ వీడియో కూడా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. ► లైవ్ రిపోర్ట్‌కు అవకాశం లేకపోతే.. బాధితులు అప్పటికే రాసి ఉంచిన ఫిర్యాదు కాపీగానీ సంబంధిత ఫొటోలు, ఆడియో, వీడియో రికార్డింగ్‌లను కూడా యాప్ ద్వారా అప్లోడ్ చేయవచ్చు. ► అనంతరం లాడ్జ్ కంప్లైంట్ ( ఫిర్యాదు నమోదు) ఆప్షన్‌లోకి వెళ్లి సబ్మిట్ ప్రెస్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేరుతుంది. ఫిర్యాదు చేసినట్టు వెంటనే మెసేజ్ వస్తుంది. ► వెంటనే ఆ ఫిర్యాదు ఏసీబీ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌కు వెళుతుంది. అక్కడి సిబ్బంది ఫిర్యాదును సంబంధిత జిల్లా ఏసీబీ విభాగానికి పంపుతారు. ► వెంటనే సంబంధిత అధికారులు ఆ ప్రభుత్వ అధికారి, సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టుగానీ ఇతరత్రా కఠిన చర్యలుగానీ తీసుకుంటారు. ► కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ కేసు పురోగతిని ఏసీబీ ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపరుస్తుంది. -
ఏసీబీ వలలో ఎస్ఐ
ఫిరంగిపురం(తాడికొండ): ఓ కేసులో రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఫిరంగిపురం ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, డ్రైవర్లు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం .. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన షేక్.ఖాసిం వినుకొండలో నివాసం ఉంటున్నాడు. గతేడాది కె.జాషువా అనే వ్యక్తి మోటారు సైకిల్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ కేసులో జాషువా, అతని స్నేహితుడు ఖాసిం ప్రమాదానికి ముందు కలిసి మద్యం సేవించారు. దీని ఆధారంగా పోలీసులు ఖాసింపై అనుమానితుడిగా కేసు నమోదు చేశారు. మృతుడు జాషువా కుటుంబ సభ్యులు ఖాసింపై ఎటువంటి అనుమానం వ్యక్తం చేయకపోయినా కేసు నుంచి తప్పించాలంటే రూ. లక్ష ఇవ్వాలని ఎస్ఐ అజయ్‌బాబు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ. 80 వేలకు మాట్లాడుకున్నారు. చివరకు ఖాసిం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం ఎస్ఐ అజయ్బాబుకు రూ.40 వేలను ఇచ్చేందుకు ఖాసిం వెళ్లాడు. దీంతో ఎస్ఐ స్టేషన్‌లోని హెడ్‌కానిస్టేబుల్ రామకోటేశ్వరరావుకు అందజేయాలని చెప్పాడు. వాటిని తమ డ్రైవర్ షఫీకి ఇవ్వమని రామకోటేశ్వరరావు తెలిపాడు. నగదు చేతులు మారుతున్న సమయంలో ఏసీబీ అధికారులు వలపన్ని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. -
అక్రమార్కులకు ఏసీబీ కళ్లెం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2021లో క్రియాశీలకంగా వ్యవహరించింది. అవినీతి అధికారులను ట్రాప్‌చేసి అక్రమాలను అడ్డుకోవడంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నవారిపై చెప్పుకోదగ్గ స్థాయిలో దాడులుచేసి కేసులు నమోదు చేసింది. అలాగే, అవినీతి అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన టోల్‌ఫ్రీ నంబర్ ‘14400’కు విశేష స్పందన లభించింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఏసీబీ ఈ ఏడాది పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలూ నిర్వహించింది. ఈ మేరకు 2021 వార్షిక నివేదికను ఏసీబీ గురువారం విడుదల చేసింది. ఆ వివరాలు.. 72 ట్రాప్ కేసులు.. 2021లో 72 మంది ప్రభుత్వ అధికారులు/ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఏసీబీ కేసులు నమోదు చేసింది. వీరు రూ.32.40 లక్షలు లంచాలు తీసుకుంటుండగా ట్రాప్‌చేసి కేసులు నమోదు చేసింది. ట్రాప్ కేసుల్లో అత్యధికంగా 36 కేసులు రెవెన్యూ శాఖ అధికారులు/ఉద్యోగులపైనే కావడం గమనార్హం. వాటిలో విశాఖ జిల్లా చోడవరం తహసీల్దారు బి.రవికుమార్ రూ.4 లక్షలు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దారు బి.నాగభూషణరావు రూ.4లక్షలు, ముదిగుబ్బ తహసీల్దారు అన్వర్ హుస్సేన్ రూ.2లక్షలు లంచాలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇక విద్యుత్ శాఖలో 8 కేసులు, పంచాయతీరాజ్ శాఖలో 7 కేసులు, హోం శాఖలో 6 కేసులు, పురపాలక శాఖలో 5 కేసులు, ఇతర శాఖల్లో 10 కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 12.. ఇక ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 12 కేసులు నమోదు చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఎండీగా చేసిన బి.నాగభూషణం ఆదాయనికి మించి రూ.10.79 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న కేసు సంచలనం సృష్టించింది. వాటితోపాటు ఆత్రేయపురం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా చేసిన వెంకట వరప్రసాదరావు, పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ డీఎం–హెచ్వోగా చేసిన ఎం. మార్కండేయ, నంద్యాలలో నీటిపారుదల శాఖ ఈఈగా చేసిన జాకబ్ రాజశేఖర్, ఇంటర్మీడియెట్ విద్యా శాఖ ఆడిటర్ కోనేరు సాయికృష్ణ తదితరులపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులున్నాయి. ఆకస్మిక తనిఖీలు 44.. 2021లో ఏసీబీ అధికారులు 44 సార్లు ఆకస్మిక తనిఖీలు చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలపై కేసులు నమోదు చేశారు. ఇందులో రెవెన్యూ శాఖ కార్యాలయాలపైనే 23 నిర్వహించడం గమనార్హం. రవాణా–ఆర్ అండ్‌బీ శాఖ కార్యాలయాలపై 6, పురపాలక శాఖ కార్యాలయాలపై 5, విద్యుత్, కార్మిక, పంచాయతీరాజ్ కార్యాలయాలపై రెండేసిసార్లు చొప్పున, మహిళా–శిశు సంక్షేమ కార్యాలయాలపై ఒకసారి తనిఖీలు నిర్వహించింది. వీటితోపాటు 26 సాధారణ తనిఖీలను కూడా ఏసీబీ చేపట్టింది. 5 కేసుల్లో దోషులకు శిక్షలు ఖరారు కోవిడ్ నిబంధనలతో ఈ ఏడాది కోర్టుల కార్యకలాపాలు అంతంతమాత్రంగా కొనసాగినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో నిందితుల అవినీతిని ఏసీబీ నిరూపించగలిగింది. 5 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. ‘14400’కు విశేష స్పందన ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన ట్రోల్ ఫ్రీ నంబర్ 14400కు ఈ ఏడాది 2,851 ఫిర్యాదులు వచ్చాయి. వాటి ఆధారంగా 8 ట్రాప్ కేసులు నమోదు చేయడంతోపాటు 16 ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జమ్ము వెంకట వరప్రసాద్ కార్యాలయం, ఇల్లు, తదితర ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఆత్రేయపురంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు రాజమహేంద్రవరంలోని ఆయన ఇల్లు, కాకినాడ, విజయవాడ, తెలంగాణలోని మేడ్చల్ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, కుటుంబ సభ్యుల పేరిట రెండు ఫ్లాట్లు, ఒక భవనం, రెండు ఇళ్ల స్థలాలు, ఒక కారు, మోటార్ సైకిల్, బంగారం, విలువైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు, భారీగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ మొత్తం రూ.2.5 కోట్లు ఉంటుందని తేల్చారు. వరప్రసాద్ దాదాపు రూ.1.4 కోట్ల మేర అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. విశాఖపట్నానికి చెందిన వరప్రసాద్ తండ్రి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ 1982లో మరణించారు. కారుణ్య నియామకం కింద వరప్రసాద్ 1989లో ఆ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2008లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు. గత ఆగస్టు నుంచి ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. అక్రమ ఆస్తుల నేపథ్యంలో వరప్రసాద్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడుల్లో ఇన్చార్జ్ అడిషనల్ ఎస్పీ సౌజన్య, డీఎస్పీ రామచంద్రరావు, సీఐ పుల్లారావు, తిలక్ పాల్గొన్నారు. -
ఫోన్ కొట్టు.. అవినీతి ఆటకట్టు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. అవినీతికి ఆస్కారం లేని, పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రెండేళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ చేస్తే చాలు క్షణాల్లోనే యాక్షన్‌లోకి దిగిపోతోంది. ఫిర్యాదుల తీరును బట్టి తగిన చర్యలు తీసుకుంటోంది. అవినీతి ఆరోపణలు వాస్తవమని తేలితే కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతిపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏసీబీ ‘స్పందన’ వ్యవస్థను విజయవంతంగా నిర్వహిస్తోంది. 97 శాతం కేసులు నిర్ణీత వ్యవధిలో పరిష్కారం బాధితుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడంపై ఏసీబీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అందుకోసం విశాఖపట్నంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్ 14400 కేటాయించింది. బాధితులు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే విజయవాడలోని ఏసీబీ ప్రధాన కా ర్యాలయానికి వెంటనే సమాచారమిస్తారు. ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆరోపణల తీరును బట్టి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరిస్తున్నారు. సాధారణ ఫిర్యాదులైతే 10 రోజులు, లోతుగా దర్యాప్తు చేయాల్సిన ఫిర్యాదులైతే నెల రోజుల్లో పరిష్కరించాలన్నది గడువు. 2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ 4 వరకు 97% ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం విశేషం. ఇప్పటివరకు 5,155 ఫిర్యాదులు రాగా.. వాటిలో నిర్ణీత గడువులోగా ఏకంగా 5,037 ఫిర్యాదులను ఏసీబీ పరిష్కరించింది. కేవలం 118 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి కూడా ఇంకా గడువు ఉంది. ఏసీబీకి ఫిర్యాదు చేశారని తెలియగానే చాలా వరకు కేసులు పరిష్కారమైపోతున్నాయి. ప్రభుత్వం కఠినంగా ఉండటంతో సంబంధిత అధికారులు, ఉద్యోగులు తక్షణం బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. కాగా, వచ్చిన ఫిర్యాదులను విచారించి అవినీతి ఆరోపణలు వాస్తవమని గుర్తించిన కేసుల్లో తదనుగుణంగా తక్షణం చర్యలు తీసుకుంటోంది. అత్యధిక ఫిర్యాదులు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల పైనే.. రెండేళ్లలో అధికారులు, ఉద్యోగుల అవినీతికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుల విషయంలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో, పంచాయతీరాజ్ శాఖ రెండో స్థానంలో ఉన్నాయి. రెవెన్యూ శాఖలో పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూ రికార్డుల్లో తప్పుల సవరణ, సర్టిఫికెట్ల మంజూరు, భూముల సర్వేకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. పంచాయతీరాజ్ శాఖలో సర్టిఫికెట్ల జారీ, రుణాలు/పింఛన్లు/ఇళ్లపట్టాల మంజూరు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశాల్లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. -
బందరు కార్పొరేషన్‌పై ఏసీబీ ఫోకస్
మచిలీపట్నం: మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పన్ను వసూళ్లలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శరత్‌బాబు నేతృత్వంలో అధికారుల బృందం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు నిరాటంకంగా తనిఖీలు చేపట్టింది. మంచినీటి సరఫరా, ఇంటి పన్నుల వసూళ్లకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించారు. పన్నుల వసూళ్లలో లోపాలను గుర్తించారు. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలన చేసే క్రమంలో 12, 15వ డివిజన్ల పరిధిలోని కొన్ని ఇళ్లను పరిశీలించారు. కొన్ని ఇళ్లను రికార్డుల్లో చిన్నవిగా చూపించగా.. క్షేత్రస్థాయిలో భారీ భవనాలు ఉండటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. డీఎస్పీ శరత్‌బాబును వివరణ కోరగా.. తనిఖీల్లో కొన్ని లోపాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఆన్లైన్లో గుడిసెల పేరుతో టాక్స్‌లు వసూలు చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం భవనాలు ఉన్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. మరింత లోతుగా విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీరాజ్ డీఈఈపై ఏసీబీ పంజా
సాక్షి, అమరావతి/కడప అర్బన్/తిరుపతి: కడప పంచాయతీరాజ్ శాఖలోని క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) రామిశెట్టి సుధాకర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికార బృందాలు కడప విజయదుర్గ కాలనీలో నివసిస్తున్న సుధాకర్ ఇంటితో పాటు, అతని కుమార్తె, స్నేహితుడు, ఆయన బిజినెస్ పార్టనర్ వేణుగోపాల్, మైదుకూరులోని దగ్గరి బంధువు, రైల్వేకోడూరులోని వియ్యంకుడు, తిరుపతిలో నివాసం ఉంటున్న అతని తమ్ముడు మురహరి ఇంటిపైనా దాడులు నిర్వహించాయి. సుధాకర్, అతని కుటుంబ సభ్యుల పేరిట కడప విజయదుర్గ కాలనీలో జీ+1 భవనం, కడపలో ఏడు నివాస స్థలాలు, మైదుకూరులో మూడు ఇళ్ల స్థలాలు, కడప శివారున 1.12 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నట్టు గుర్తించారు. 156.22 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.24,685 విలువైన వెండి సామగ్రి, రూ.20,51,283 విలువైన ఇంటి సామగ్రి, రూ.14,13,493 బ్యాంకు బ్యాలెన్స్, రూ.1.46 లక్షల నగదును గుర్తించారు. మొత్తంగా రూ.1.31 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు ప్రాథమికంగా దొరికిన రికార్డులను బట్టి గుర్తించామని, అతన్ని అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీజీ కార్యాలయం తెలిపింది. -
రాజమండ్రి సెంట్రల్ జైలుకు ధూళిపాళ్ల
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో పలు అక్రమాలు, అవినీతికి పాల్పడటంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ధూళిపాళ్లతోపాటు డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణ, రిటైర్డ్ జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం.గురునాథంలకు విజయవాడలో శుక్రవారం రాత్రి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు రావాల్సి ఉండటంతో కృష్ణా జిల్లా కోవిడ్ జైలుగా కేటాయించిన మచిలీపట్నం జైలులో వారిని ఉంచారు. ముగ్గురికి కోవిడ్ నెగెటివ్ అని శనివారం ఫలితం రావడంతో వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ధూళిపాళ్ల నరేంద్ర అక్రమాల చిట్టా ఇదీ.. ► సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన పదెకరాల భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ఉన్న ట్రస్ట్‌కు నరేంద్ర బదలాయించారు. అప్పటి డెయిరీ ఎండీగా ఉన్న గోపాలకృష్ణ ఆ పదెకరాలను ట్రస్టుకు బదలాయించినట్టు తీర్మానం చేయడం, మేనేజింగ్ ట్రస్టీగా నరేంద్ర వాటిని తీసేసుకోవడం జరిగిపోయాయి. ఇది బైలా నంబర్ 439 ప్రకారం ఉల్లంఘన. ► ప్రభుత్వ భూమిలో వీరయ్య చౌదరి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ నిర్మించుకున్నారు. ఈ ఆస్పత్రికి నరేంద్ర భార్య జ్యోతిర్మయి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ► ఏదైనా సహకార సంఘాన్ని కంపెనీగా మార్చుకోవాలంటే ప్రభుత్వానికి బకాయిలు చెల్లించి, భూములు అప్పగించి జిల్లా కోఆపరేటివ్ అధికారి నుంచి ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) తెచ్చుకోవాలి. 2011 ఫిబ్రవరి 28న రిటైర్ అయిన డీసీవో గురునాథం నుంచి ఆయన రిటైర్మెంట్కు రెండు రోజుల ముందు తేదీతో ఎన్వోసీ తెచ్చి.. సంగం డెయిరీని కంపెనీ చట్టం కిందకు తెచ్చుకున్నారు. ఫలితంగా తన సొంత కంపెనీగా నరేంద్ర డెయిరీని మార్చేశారు. ► దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ అధికారి కార్యాలయంలో తనిఖీలు చేసిన ఏసీబీ.. ఎన్వోసీకి సంబంధించిన దరఖాస్తు, ఇతర ఉత్తరప్రత్యుత్తరాలు లేవని నిర్ధారించింది. అక్రమ పద్దతుల్లో ఎన్వోసీని సృష్టించినట్టు తేలింది. మరోవైపు ఏపీడీడీసీ కమిషనర్ పేరుతో ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి వాటిని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)లో తనఖా పెట్టి 2013లో ధూళిపాళ్ల నరేంద్ర రూ.115.58 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తన తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణానికి, నిర్వహణకు మళ్లించారు. ► సంగం డెయిరీ లాభాలు, ప్రభుత్వ నిధులతో 1973, 1976, 1977, 1978లో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలకు చెందిన 51 డాక్యుమెంట్లను కూడా ఏసీబీ సేకరించింది. ఈ భూములను కొట్టేసేందుకు ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించారు. ► ప్రభుత్వం 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. ఒక సహకార సంఘాన్ని మ్యాక్స్ పరిధిలోకి తేవాలంటే ప్రభుత్వానికి చెందిన భూములు తిరిగి అప్పగించడంతోపాటు బకాయిలను చెల్లించాలి. అలా చేయకుండానే 1997 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని మాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారు. నరేంద్ర సంగం డెయిరీ నిర్వహణ చూస్తునే మరోవైపు సొంతంగా మిల్క్‌లైన్ అనే ప్రయివేటు పాల సేకరణ కంపెనీని నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. తర్వాత మిల్క్‌లైన్ కంపెనీకి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేశారు. సంగం డెయిరీలో రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు చేబ్రోలు (పొన్నూరు): సంగం డెయిరీ, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు రెండో రోజు శనివారం కూడా సోదాలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ ఏఎస్పీ సురేష్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. -
ఏసీబీ అధికారులమంటూ దందా
కోనేరుసెంటర్(మచిలీపట్నం): అవినీతి నిరోధకశాఖ అధికారుల వలకు చిక్కిన అవినీతి తిమింగలాలను సంబంధిత కేసుల నుంచి తప్పిస్తామంటూ నమ్మించి రూ.లక్షలు దండుకుంటున్న ఇద్దరు ఘరానా మోసగాళ్లు కృష్ణాజిల్లా పోలీసులకు చిక్కారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ మలికగర్గ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా నల్లమడ మండలం మంగళవెలమద్దికి చెందిన రాచంపల్లి శ్రీనివాసులు అలియాస్ మంగలి శ్రీను, అదే జిల్లా కొట్టాపూర్ గ్రామానికి చెందిన నూతేటి జయకృష్ణ దాదాపు 20 ఏళ్లుగా బైక్ దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏసీబీ వలలో చిక్కిన ప్రభుత్వ ఉద్యోగుల బంధువులకు ఫోన్ చేసి .. తాము ఏసీబీ, పోలీసు అధికారులమని.. అడిగినంత డబ్బు ఇస్తే కేసులు లేకుండా చేస్తామంటూ డబ్బుల వసూలుకు పాల్పడుతున్నారు. ఇటీవల పెడన పంచాయతీరాజ్ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. తాను ఏసీబీ డీఎస్పీని అని చెప్పి రూ.3 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానని బంధువులను నమ్మించి రాచంపల్లి శ్రీనివాసులు రూ.లక్ష వసూలు చేశాడు. అలాగే పెడన మునిసిపల్ అధికారిని లంచం కేసులో ఏసీబీ అధికారులు పట్టుకోగా.. తాను కూడా ఏసీబీ డీఎస్పీని అంటూ అధికారి బంధువులకు ఫోన్ చేసి.. డబ్బు ఇస్తే కేసు లేకుండా చేస్తానని నమ్మించిన జయకృష్ణ పెద్ద మొత్తంలో డబ్బులు తన ఖాతాలో వేయించుకున్నాడు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు మచిలీపట్నంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరినీ అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు, జయకృష్ణ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అనేక నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించినట్లు ఏఎస్పీ మలికగర్గ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాసరావుపై 17, జయకృష్ణపై 18 కేసులు ఉన్నట్లు ఆమె చెప్పారు. -
ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్
సాక్షి, అమరావతి/తిరుపతి క్రైం: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోన్న ఎస్ఎం రఫీ రూ.9 వేలు లంచం తీసుకుంటూ శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డాడు. తిరుపతిలోని శ్రీపురం కాలనీలో నివాసముంటున్న రవీంద్రనాథ్ రెడ్డి వద్ద టి.నరసింహ అనే వ్యక్తి ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. ఇంటి పన్నులు నరసింహ పేరుతో రాకపోవడంతో గత నెల 23న 6 వార్డు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఫీని నరసింహ కలిశాడు. ఇంటి పన్ను కాగితాలపై పేరు మార్చేందుకు గాను రూ.10 వేలు లంచం ఇవ్వాలని రఫీ డిమాండ్ చేశాడు. చివరకు రూ.9 వేలకు బేరం కుదిరింది. అనంతరం నరసింహ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం తిరుపతిలోని ఓ బట్టల దుకాణం వద్దకు డబ్బులు తీసుకొని రమ్మని నరసింహకు రఫీ చెప్పాడు. అక్కడ నరసింహ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రఫీని అరెస్ట్ చేశారు. నిందితుడిని నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలు
సాక్షి, అమరావతి/రామసముద్రం (చిత్తూరు జిల్లా)/మందస (శ్రీకాకుళం జిల్లా): రాష్ట్రంలో ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వోలు) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన రైతు బి.వెంకటరమణకు ఈ–పట్టాటారు పాస్‌బుక్ ఇవ్వడానికి వీఆర్వో డి.రాజశేఖర్ రూ.8,500 లంచం అడిగాడు. దీంతో రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ అధికారులు రాజశేఖర్‌ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిరిపురం గ్రామ రైతు రాజేష్ పండకు ఈ–పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇవ్వడానికి బోదరసింగి వీఆర్వో బి.రేణుకారాణి రూ.3వేలు లంచం అడిగారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకుంటుండగా రేణుకారాణిని అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. -
ఏసీబీకి చిక్కిన సీనియర్ ఆడిటర్
సాక్షి, అమరావతి/కడప అర్బన్/చిలకలూరిపేట: వైఎస్సార్ జిల్లా ఆడిట్ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ జబ్బార్ రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ పి.కంజాక్షన్ అందించిన వివరాలు.. మైదుకూరు మండలం తువ్వపల్లెకు చెందిన పెద్ద వెంకటయ్య కడప ఇరిగేషన్ సర్కిల్లో సబార్డినేట్‌గా పనిచేసి పదవీవిరమణ చేశారు. తనకు రావాల్సిన గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైలును జిల్లా ఖజానా అధికారికి పంపించే విషయమై అబ్దుల్ జబ్బార్‌ను సంప్రదించారు. ఇందుకోసం రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు దాడి చేసి జబ్బార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.80,120 స్వాదీనం గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడి చేశారు. కార్యాలయంలో అధిక మొత్తంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు రావడంతో గుంటూరు ఏసీబీ డీఎస్పీలు వెంకట్రావు, ప్రతాప్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు రికార్డులను తనిఖీ చేశారు. ఆ సమయంలో కార్యాలయం లోపల ఉన్న 10 మంది స్టాంప్ వెండరు, ప్రయివేటు ఉద్యోగుల వద్ద నుంచి రూ.80,120ను ఏసీబీ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. -
అవినీతిపై పంజా విసిరిన ఏసీబీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలువురు అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పంజా విసిరింది. సోమవారం ఒక్కరోజునే రాష్ట్రంలో ఐదు వేర్వేరు కేసులను నమోదు చేసింది. సంబంధిత వివరాలను ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు వివరించారు. నీటిపారుదల శాఖ ధవళేశ్వరం సర్కిల్ సీనియర్ అసిస్టెంట్ పల్లంకుర్తి పద్మారావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ..దాడులు నిర్వహించింది. ధవళేశ్వరం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లోని కార్యాలయాలు, ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు సోదాలు జరిపాయి. 1997లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు చేపట్టి 2010 జూన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. పద్మారావు, ఆయన కుటుంబసభ్యుల పేరుతో రూ.10లక్షల విలువైన బంగారంతో సహా..రూ.కోటి 2లక్షల, 35 వేల అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. పద్మారావును రాజమండ్రి ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపర్చనున్నారు. రూ.51వేలు లంచం తీసుకుంటూ దొరికిన లైన్మెన్ ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామ విద్యుత్ లైన్మెన్ వాన్కుడావత్ లక్ష్మా నాయక్ రూ.51వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పోకూరి సుబ్బారావుకు, ఆయన బంధువులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లైన్మెన్ రూ.లక్షా వెయ్యి డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.50వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.51వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లైన్మెన్ నాయక్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అమపపల్లి గ్రామానికి చెందిన వీఆర్వో పక్కి గోవింద్‌ను పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వడానికి గానూ ఓ రైతునుంచి రూ.4వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వోను విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తారు. అలాగే అనంతపురం రిజి్రస్టేషన్ కార్యాలయం, విజయవాడ రూరల్ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఆయా కార్యాలయాల్లో పలు అక్రమాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ
సాక్షి, నెల్లూరు : మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయ్‌కుమార్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం రెండు ఇళ్లు ,5 స్థలాలు,14 ఎకరాల వ్యవసాయ భూమి ,ఒక కేజీ బంగారం, 50 లక్షల బ్యాంకు డిపాజిట్లు గుర్తించినట్లు తెలిపారు. మరిన్ని సోదాలు నిర్వహిస్తామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ శాంత్రో పేర్కొన్నారు. నెల్లూరుతో పాటు విజయ్‌కుమార్ రెడ్డి బంధువుల ఇళ్లు ముత్తుకూరు,కలువాయి,కోట ప్రాంతంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఏసీబీ వలలో ఇరిగేషన్ డీఈ
అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ వలకు ఇరిగేషన్ శాఖ డీఈ చిక్కాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెలలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. అందులో భాగంగా ముదిగుబ్బ మండలం రాఘవపల్లిలో కంచం లీలావతికి చెందిన ఇంటికి ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ. 21 లక్షలు మంజూరు చేసింది. ఈ క్రమంలో పార్నపల్లి సబ్ డివిజన్ డీఈ మోహన్‌గాందీ(సీబీఆర్) లీలావతిని రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని కోరాడు. లీలావతి ఖాతాలో నష్టపరిహారం జమ కాగానే.. లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 25న ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ డీఎస్పీ, అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ అల్లాబ„Š బృందం.. శుక్రవారం ఉదయం రెడ్‌హ్యాండెడ్‌గా డీఈని పట్టుకున్నారు. విలాసవంతమైన భవనం పార్నపల్లి సబ్ డివిజన్ డీఈగా పని చేస్తున్న మోహన్‌గాంధీ ఇల్లు ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, బార్, జిమ్, హోం థియేటర్ ఉన్నాయి. ఆ ఇంటి ధర రూ.3 కోట్ల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. డీఈ ఇల్లు, ఫాంహౌస్‌తో పాటు పులివెందులలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. -
‘ఏపీఎస్పీ’ అసిస్టెంట్ కమాండెంట్ ఇళ్లపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/చిత్తూరు అర్బన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పంతుల శంకర్ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేసింది. ఆయన అక్రమాస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదు రావడంతో తూర్పుగోదావరి, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని శంకర్ ఇళ్లు, అతని బంధువుల నివాసాల్లో ఏసీబీకి చెందిన 13 బృందాలు సోమవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ వివరాలను ఏసీబీ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. శంకర్ 1989 జనవరి 16న పోలీసు శాఖలో చేరాడు. 2001 జూన్‌లో ఇన్స్పెక్టర్గా, 2011 జూలైలో డీఎస్పీగా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనపై ఫిర్యాదు రావడంతో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. రూ.88.81 లక్షల విలువైన 3 నివాస గృహసముదాయాలున్నట్లు గుర్తించారు. రూ.32,64,500 విలువైన 9 ఇళ్ల స్థలాలు, రూ.22.51 లక్షల విలువైన 20.98 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.6.57 కోట్ల విలువైన రెండు పౌల్ట్రీ ఫార్మ్‌లు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది. రూ.59,400 నగదు, రూ.27 వేల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.28,99,812 ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.9,71,704 ఎస్బీఐ లైఫ్ ఇన్‌స్రూ?న్స్, రూ.2.70 లక్షల విలువైన బంగారం, రూ.47,340 విలువైన వెండి వస్తువులున్నట్లు ఏసీబీ సిబ్బంది గుర్తించారు. మొత్తంగా శంకర్ స్థిర, చర ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.8,43,71,756గా లెక్క తేల్చిన ఏసీబీ.. అందులో రూ.2,46,85,516 అక్రమాస్తులుగా ప్రాథమిక అంచనాకు వచ్చింది. శంకర్‌ను అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ తెలిపింది. -
‘నకిలీ చెక్కుల’పై ఏసీబీ విచారణ
సాక్షి, అమరావతి/ తాడికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాలనే పెద్ద కుట్రతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠాతోపాటు దాని వెనుక ఉన్న అదృశ్య శక్తుల నిగ్గుతేల్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ బాగోతాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ముఠా గుట్టురట్టు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆదేశించారు. ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠా పాత్రధారులతోపాటు దీని వెనుక సూత్రధారులను కూడా పట్టుకోవాలన్నారు. (బెడిసికొట్టిన బడా మోసం) దీంతో ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి దోషులను పట్టుకోవాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఆదివారం లేఖ రాశారు. మరోవైపు.. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)లోని సీఎంఆర్ఎఫ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం ఉన్నందున దీని నుంచి చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆమె బ్యాంకు మేనేజరుకు లేఖ రాశారు. అలాగే, బ్యాంకు అధికారుల అప్రమత్తతవల్ల నిధులు విడుదల కాలేదని.. కుట్ర చాలా పెద్దదైనందున విచారణ లోతుగా జరిపి దోషులను తేల్చాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు రాష్ట్రాలల్లో వేర్వేరు పేర్లతో.. ఏపీకి చెందిన సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టేందుకు ఒకేసారి న్యూఢిల్లీ, కోల్‌కత, కర్ణాటక నుంచి వేర్వేరు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు జారీ చేయడం వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఈ ముఠానే ముద్రించిందా? లేక ఇందుకు బ్యాంకు, సీఎంఆర్ఎఫ్ విభాగాల్లోని వారు ఎవరైనా సహకరించారా? అనేది కూడా తేల్చనున్నారు. అద్వైతా వీకే హాలో బ్లాక్స్ అండ్ ఇంటర్‌లాక్స్, మల్లాబ్‌పూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, శర్మ ఫోర్జింగ్ పేర్లతో ఈ నకిలీ చెక్కులు జారీ అయ్యాయి. పక్కా స్కెచ్‌తోనే.. సీఎంఆర్ఎఫ్ నిధులను కొట్టేయాలనే భారీ కుట్రతో ఆ ముఠా పక్కా స్కెచ్‌తోనే యత్నించిందని ఉన్నతాధికారులు అంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు చెక్కులు ఇచ్చారంటే ఆ కంపెనీలు బోర్డుకే పరిమితమైనవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ బృందాలు మూడుచోట్లకు వెళ్లి విచారణ చేయనున్నాయి. తుళ్లూరులో కేసు నమోదు కాగా, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పేరిట భారీగా నగదు విత్‌డ్రా చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పన్నిన పన్నాగంపై ఆదివారం గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సచివాలయం రెవెన్యూ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ పి.మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తుళ్ళూరు–1 సీఐ ధర్మేంద్రబాబు కేసు నమోదు చేశారు. కాగా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ.16 వేలు, రూ.45 వేలు, రూ.45 వేలు చొప్పున ముగ్గురు వ్యక్తులకు జారీచేసిన చెక్కుల స్థానంలో రూ.117.15 కోట్లు విత్‌డ్రా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు నకిలీ చెక్కులు సృష్టించి ఈ ఘరానా మోసానికి యత్నించారు. -
మరో 'కోటి'గారు దొరికారు!
సాక్షి, మెదక్: రెవెన్యూ విభాగంలో వేళ్లూనుకున్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతోపాటు నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. అయితే ఇదే రోజు మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం.. లంచావతారమెత్తిన సదరు అధికారి భారీ డీల్ వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అవినీతి బాగోతంలో ఏసీతోపాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, సర్వేల్యాండ్ జూనియర్ అసిస్టెంట్ వాసిం అహ్మద్‌ను రాత్రి అరెస్ట్ చేశారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రమణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అవినీతి బాగోతం ఇలా.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112.21 ఎకరాల వ్యవసాయ భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) కో సం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి ఇటీవల అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్‌ను ఆశ్రయించాడు. ఎకరాకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.12 కోట్లు ఇవ్వాలని ఏసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు వివిధ దశల్లో ఇప్పటివరకు రూ.40 లక్షలు ముట్టినవి. మిగిలిన రూ.72 లక్షలకు బదులుగా ఐదెకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించినా పని ముందుకు కదలకపోవడంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 12 బృందాలు.. 12 చోట్ల దాడులు బాధితుడి ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో ఆరా తీసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రంగంలోకి దిగారు. 12 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 12 చో ట్ల సోదాలు నిర్వహించారు. ఏసీ నివాసముం టున్న మెదక్ జిల్లా మాచవరంతోపాటు కొం పల్లిలోని ఆయన స్వగృహంలో, భూబాగోతానికి సంబంధించి నర్సాపూర్ ఆర్డీవో కార్యాల యం, క్యాంప్ ఆఫీస్‌లో.. ఘట్కేసర్లోని ఆర్డీవో అరుణ నివాసంలో, సంగారెడ్డిలోని చిలప్‌చెడ్ తహసీల్దార్ సత్తార్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. మాచవరంలోని ఏసీ ఇంట్లో ఉదయం 7 గంటలకు తనిఖీలు ప్రారంభం కాగా.. రాత్రి 10 తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఏసీ ఇంట్లో 8 చెక్కులు.. ఆర్డీవో నివాసంలో రూ.28 లక్షలు మాచవరంలోని అదనపు కలెక్టర్ ఇంట్లో సోదాల సందర్భంగా లింగమూర్తి సైన్ చేసిన ఎనిమిది చెక్కులు, పలు కీలక డాక్యుమెంట్లు లభించాయి. మరోవైపు అడిషనల్ కలెక్టర్ భార్య మమతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ఉన్న బ్యాంక్ లాకర్‌ను తెరిచేందుకు ఆమెను తీసుకెళ్లారు. మరోవైపు ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ వెంకటసాయినగర్ ఫేజ్ 1లోని నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో లెక్కలోకి రాని రూ.28 లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. వీటిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. నర్సాపూర్ ఆర్డీవో ఆఫీసుతోపాటు ఆర్డీవో క్యాంపు కార్యాల యంలో ఏసీబీ అధికారులు బుధవారం ఉద యం నుంచి తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి చిప్పల్‌తుర్తికి చెందిన భూముల రికార్డులను అక్కడికి తెప్పించడంతో పాటు తహసీల్దార్ మాలతిని అక్కడికి పిలిపించి విచారణ చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీ అధికారులు ఆర్డీఓ అరుణారెడ్డిని తమ వెంట తీసుకుని ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లి పలురికార్డులను తనిఖీ చేశారు. ఆయాసం.. వైద్యుల రాక మాచవరంలోని ఇంట్లో సోదాలు జరుపుతున్న క్రమంలో ఏసీ నగేశ్ ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సాయంత్రం 6 గంటల సమయంలో ప్రైవేట్ వైద్యులు వచ్చి పరీక్షించారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణను ప్రశ్నించగా ప్రస్తు తం ఆయన బాగానే ఉన్నారని చెప్పారు. సో దాలు కొనసాగుతుండగానే అదనపు కలెక్టర్ నగేశ్‌తోపాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణారె డ్డి, చిలప్‌చెడ్ ఎమ్మార్వో సత్తార్, సర్వేల్యాండ్ రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్ వాసిం అహ్మద్, ఏసీకి బినామీగా వ్యవహరించిన జీవన్గౌడ్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. మా చవరంలో అదనపు కలెక్టర్‌ను, హైదరాబాద్ లో ఆర్డీవో, ఏసీ బినామీ, సంగారెడ్డిలో ఎమ్మార్వోతోపాటు సర్వేల్యాండ్ రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేశారు. ఏసీబీ ప్రత్యేక జడ్జి ఎదుట వారిని హాజరుపరచనున్నారు. ఫిర్యాదు.. ఆ తర్వాత ఇలా.. ► ఈ ఏడాది ఫిబ్రవరి 29న శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి మరో నలుగురు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 59/31, 59/40, 58/1, 58/2లో ఉన్న 112.21 ఎకరాల భూమి ని కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. ► జూలై 21న సదరు భూమికి సంబంధించి ఎన్వోసీ కోసం నర్సాపూర్ తహసీల్దార్ సత్తార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అదే నెల 23న సదరు అధికారి ఆర్డీవో అరుణారెడ్డికి పంపించాడు. ఆ తర్వాత అదే నెల 25న సదరు అధికారిణి ఈ దరఖాస్తును కలెక్టర్‌కు ఫార్వర్డ్ చేశారు. ► ఇక ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ నగేశ్ రంగంలోకి దిగాడు. ఎకరాకు రూ.లక్ష చొప్పున 112 ఎకరాలకు రూ.1.12 కో ట్లు ఇవ్వాలని లింగమూర్తితో జూలై 31న ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పం దం మేరకు అదేరోజు ఏసీకి తొలి విడతలో రూ.19.05 లక్షలు అందజేశాడు. అనంతరం ఆగస్టు 7న మరో రూ.20.05 లక్షలు ఇచ్చాడు. రెండు విడతల్లో అదన పు కలెక్టర్‌కు రూ.40 లక్షలు ముట్టాయి. ► అయితే మిగిలిన రూ.72 లక్షలు ఇవ్వడంలో జాప్యం జరగడంతో అడిషనల్ కలెక్టర్ తనకు నమ్మకం లేదంటూ లింగమూర్తి కొనుగోలు చేసిన భూమిలో ఐదు ఎకరాలు తనకు సంబంధించిన బినామీకి అమ్మినట్లు ఆగస్టు 21న అగ్రిమెంట్ చేసుకున్నాడు. సికింద్రాబాద్‌కు చెందిన కోల జీవన్‌గౌడ్ (ఏసీ బినామీ)కు అమ్మినట్లు ఒప్పంద పత్రం రాయించాడు. దీంతోపాటు లింగమూర్తి సంతకం చేసిన 8 బ్లాంక్ చెక్‌లను ష్యూరిటీ కింద తీసుకున్నాడు. ► జూలై 31న అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు లింగమూర్తి నుంచి సర్వేల్యాండ్ రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్ వాసిం అహ్మద్ రూ.5 లక్షలు తీసుకొన్నారు. అదేవిధంగా ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్‌చెడ్ తహసీల్దార్ సత్తార్‌కు లక్ష చొప్పున ముట్టాయి. కొత్త చట్టంతో బేరం బెడిసికొట్టింది.. 112 ఎకరాల వ్యవసాయ పొలం.. ఎన్వోసీ ఎకరానికి లక్ష చొప్పున మొత్తం రూ.1.12 కోట్ల బేరం కుదిరింది. అడిషనల్ కలెక్టర్ నగేశ్ నుంచి వీఆర్ఏ దాకా అంతా అనుకూలంగా పనిచేసేందుకు రూ.40 లక్షల నగదు, మరో రూ.72 లక్షల విలువ చేసే స్థలం అడిషనల్ కలెక్టర్‌కు అదనపు బహుమతి.. అంతా బానే ఉంది. వాస్తవానికి ఈ డీల్ దాదాపు గా పూర్తికావొచ్చింది. కానీ, ఆఖరు నిమి షంలో ఏదో తేడా వచ్చింది. అధికారులపై ఫిర్యాదుదారుడికి ఎందుకు అనుమానమొచ్చింది? అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఈ మొత్తం డీల్ రద్దవడానికి, రద్దయిన డీల్ వ్యవహారం అవినీతి నిరోధకశాఖ దాకా వెళ్లడానికి అసలైన కారణం కొత్త చట్టమే అని సమాచారం. కొత్తచట్టంలో అధికారాలకు కోత పెడుతున్నారన్న ప్రచారమే రెవె న్యూ అధికారులను ఏసీబీకి పట్టించిందని సమాచారం. బాధితుడు తన పనికోసం అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నా.. వా రు పని నెమ్మదిగా చేయసాగారు. ఈలోపు అసెంబ్లీ సమావేశాలు ఖరారు కావడం, తొ లిరోజే కేబినెట్ సమావేశంలో రెవెన్యూ చట్టానికి ఆమోదం తెలపడంతో బాధితుల్లో అధికారుల తీరుపై అనుమానాలు చెలరేగా యి. అధికారులు ఈ పని చేసినా.. చెల్లుబా టు అవుతుందా? అన్న అనుమానాలు రో జురోజుకూ పెరిగిపోయాయి. కానీ, ఈ వ్య వహారంతో సంబం«ధమున్న అధికారులు మాత్రం పనిపై ధీమాగానే ఉన్నారు. అయి తే, మంగళవారం వీఆర్వో వ్యవస్థ రద్దు కా వడం, భూరికార్డులు స్వాధీనం చేసుకోవడంతో బాధితులకు ఈ పని కాద ని తేలిపోయింది. అందుకే, తాను అధికారులతో మాట్లాడిన ఆడియోటేపులు, చెక్కులు, డాక్యుమెంట్లు తీసుకుని నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించాడని సమాచారం. -
లంచగొండులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల మాట వినిపించకూడదని, ఎక్కడ అవినీతి ఉన్నా కూకటివేళ్లతో పెకిలించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ చేసిన ఆదేశాలతో అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) లంచ గొండుల భరతం పడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దాడులకు శ్రీకారం చుట్టింది. అవినీతి నిరోధానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘14400’ కాల్ సెంటర్లకు పెద్దఎత్తున కాల్స్ వస్తుండడంతో వీటిపైనా ఏసీబీ వేగంగా స్పందిస్తోంది. ఇప్పటికే ఈ కాల్‌సెంటర్‌పై ప్రజల్లో అవగాహన బాగా పెరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. అలాగే, లంచగొండులపై నిఘాను ముమ్మరం చేసింది. 10 నెలల్లో 44,999 కాల్స్ ► గత ఏడాది నవంబర్‌లో ‘14400’ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ► ఇప్పటివరకు ఈ కాల్ సెంటర్‌కు 44,999 కాల్స్ రాగా ఇందులో అవినీతికి సంబంధించిన కాల్స్ 1,747 ఉన్నాయి. ► ఇందులో 1,712 ఫిర్యాదులను పరిష్కరించారు. మరో 161 కాల్స్‌పై చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 13 ట్రాప్ కేసులను కూడా ఏసీబీ నమోదు చేసింది. మూడు కేసుల్లో క్రిమినల్ దుష్ప్రవర్తన చర్యలను చేపట్టింది. ► మరో 67 ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ► 46 రెగ్యులర్ విచారణలు.. 32 డిస్క్రీట్ విచారణలను చేపట్టారు. ► దీంతో ఈ కాల్‌సెంటర్ సూపర్‌హిట్ అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► అలాగే, వస్తున్న కాల్స్ ద్వారా ఏఏ శాఖల్లో ఏఏ అంశాలపై అక్రమార్కులు ప్రజలను లంచాలు డిమాండ్ చేస్తున్నారో ఏసీబీ గుర్తించింది. ► దీని ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన తిమింగలాలతో పాటు సామాన్య ప్రజలను లంచాల పేరుతో పీడించే వారిపై తక్షణం దృష్టిసారించాలని నిర్ణయించింది. ► ఇందులో భాగంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల్లో అక్రమార్కులపై ప్రధానంగా నిఘా పెట్టనుంది. -
సిఫార్సు వేరు.. ఆర్డర్ వేరు
సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇవ్వడం వేరు, కచ్చితంగా చేయాలని ఆర్డర్ లెటరు ఇవ్వడం వేరు.. అని అవినీతి నిరోధక శాఖ సంయుక్త సంచాలకులు రవికుమార్ వెల్లడించారు. ఈఎస్ఐ స్కాములో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఫలానా కంపెనీకే ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారని, దీంతో మంత్రి, ఆయనతోపాటు ఆ సర్వీసు ప్రొవైడరూ ఇద్దరూ నిందితులేనన్నారు. టెలీహెల్త్ సర్వీసెస్‌కు సంబంధించి అచ్చెన్నాయుడు మొత్తం మూడు లేఖలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏమన్నారంటే... ► మొత్తం రూ.975 కోట్ల కొనుగోళ్లలో రూ.150 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు నిర్ధారించాం. ► రూ.లక్ష విలువ దాటితే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలి. కానీ, నామినేషన్ కింద ఇచ్చారు. ► కడప ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ జనార్దన్ ఇందులో కీలకపాత్ర పోషించారు. ► అధిక ధరలతో బడ్జెట్‌కు మించి కొనుగోళ్లు జరిపారు. కొన్ని మందులు 140% ఎక్కువ రేటుకు కొన్నారు. ► డ్రగ్స్‌కు రూ.293.51 కోట్లు కొనుగోలు అవకాశం ఉండగా, రూ.698.36 కోట్లకు కొన్నారు. ► డిస్పెన్సరీల నుంచి ఇండెంట్లు లేకుండానే కొన్నారు. ఆ మందులు కూడా ఆస్పత్రులకు చేరలేదు. ► అమరావతి, తిరుమల వంటి మెడికల్ ఏజెన్సీలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఆ తర్వాత మాయమయ్యాయి. ► ఈ కేసులో 12మందిని అరెస్టు చేశాం. మరో 8 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరో 5 మంది నిందితులను గుర్తించాం. వారికోసం ఏసీబీ బృందాలు గాలింపు చేస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి పితాని కుమారుడు వెంకటసురేష్ కూడా ఉన్నారు. ► ఈ కేసుపై త్వరలోనే చార్జిషీట్ వెయ్యబోతున్నాం. -
ఈఎస్ఐ స్కాం మూలాలపై కన్ను
సాక్షి, అమరావతి: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో జరిగిన భారీ కుంభకోణంలో మూలాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టిపెట్టింది. చంద్రబాబు జమానాలో జరిగిన ఈ స్కామ్‌పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికతో ఏసీబీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐలో 2014 నుంచి 2019 వరకు నిబంధనలకు విరుద్ధంగా రూ.988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు, టెలీ సర్వీసెస్ సేవల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని నిగ్గుతేల్చింది. ఇందుకు ప్రతిగా అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కలిసి రూ.150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అలాగే, ఈ బాగోతంలో 19 మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. అప్పటి కార్మిక శాఖ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు, ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ సీకే రమేష్‌కుమార్‌తోపాటు మరో ఐదుగురిని అరెస్టుచేసింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో మిగిలిన వారి అరెస్టుకు కూడా రంగం సిద్ధంచేసుకుంటున్న ఏసీబీ.. మరింత లోతైన దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బృందాలతోపాటు సెర్చ్ టీమ్‌లను రంగంలోకి దించింది. ► స్కామ్‌తో ప్రమేయమున్న 19 మంది కాల్‌లిస్ట్‌ను సేకరించి లోతైన దర్యాప్తు చేయడం ద్వారా వారితో ఇంకెవరికి సంబంధాలు ఉన్నాయో ఈ బృందాలు గుర్తించనున్నాయి. ► సచివాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో శాఖాపరమైన జీఓలను పరిశీలించలేదనే ప్రధాన అంశానికి సంబంధించి వారిని అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలపైనా ఆరా.. ► స్కామ్‌లో ప్రమేయమున్న వ్యక్తులు, అక్రమాలకు పాల్పడిన సంస్థలు, కంపెనీలకు చెందిన బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ► 2016లో అచ్చెన్నాయుడు లేఖ రాసిన అనంతరం.. ఈఎస్ఐ స్కామ్‌కు తెరలేపడంతో ఆయా వ్యక్తులు, సంస్థలు, కంపెనీల బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలు ఎప్పుడు జరిగాయి.. ఎలా జరిగాయి.. ఎవరు చేశారు అనే కోణాలపైనా దృష్టిపెట్టారు. ► దీనిలో భాగంగానే ఆయా వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్లను తొలుత స్తంభింపజేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ► అంతేకాక.. మందులు, పరికరాల కొనుగోళ్లు, సేవలకు సంబంధించిన సంస్థలు, కంపెనీల పుట్టుపూర్వోత్తరాలపైనా ఏసీబీ అధికారులు గురిపెట్టారు. ► ఈఎస్ఐతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రుడ్జీ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్, జలమ్ ఎన్విరాన్మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్, జర్కిస్ ఎంటర్ప్రైజెస్, ఎస్కేపీ ఎంటర్ప్రైజెస్ (విజయనగరం), శ్రీ సీతారామ ఫార్మాస్యూటికల్స్ (నరసరావుపేట) తదితర కంపెనీలు, సంస్థలు ఎప్పటి నుంచి ఉన్నాయి. వాటి గుర్తింపు, సామర్థ్యం, సేవల్లో విశ్వసనీయత తదితర అన్ని కోణాల్లోను ఏసీబీ దర్యాప్తు సాగుతోంది. -
టౌన్ ప్లానింగ్‌లో అవినీతిపై ఏసీబీ కొరడా
-
టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: అనధికార నిర్మాణాలకు అండదండలు.. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ.. అడుగడుగునా ఆమ్యామ్యాలు.. అడిగినంత ఇవ్వకపోతే వేధింపులు.. ఇవీ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లోని పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగంలో కొనసాగుతున్న బాగోతాలు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది తీరుపై విసిగి వేసారిపోతున్న జనం ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. అవినీతి నిర్మూలన కోసం ప్రారంభించిన డయల్ 14400 టోల్ ఫ్రీ నెంబర్‌కు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాల్టీల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, ఉభయ తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో మంగళవారం సోదాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు అక్రమాలు, అవినీతి వ్యవహారాలు వెలుగు చూశాయి. పలు కీలక ఫైళ్లు, రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. రెండేళ్లుగా టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చిన దరఖాస్తులు, మంజూరు చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు. భవనాల క్రమబద్ధీకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రైవేట్ వ్యక్తుల పాగా సిటీ ప్లానింగ్ విభాగంలో సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా అనధికార నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో రూ.1,03,813, ఒంగోలులో రూ.8,940, తిరుపతిలో రూ.50,500, ప్రొద్దుటూరులో రూ.15,110, తాడేపల్లిగూడెంలో రూ.5,640, శ్రీకాకుళంలో రూ.14,690, నెల్లూరులో రూ.7,740, విజయవాడలో రూ.34,650, విశాఖపట్నంలో రూ.29,900... మొత్తం రూ.2,70,983 నగదు లభ్యమైంది. పలు టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పలువురు ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. అనుమతి లేకుండా పని చేస్తున్నారు. ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బుధవారం కూడా సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన అనంతరం అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారు. సోదాల్లో ఏసీబీ గుర్తించిన అంశాలు.. చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా భారీ భవంతుల నిర్మాణానికి అనుమతులివ్వడం, నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటికి రోజుల తరబడి అనుమతులు మంజూరు చేయకపోవడం, లంచాలు డిమాండ్ చేయడం, దరఖాస్తుదారులను వేధించడం వంటి అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. - మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలోని మధురవాడ(జోన్–1), గాజువాక(జోన్–5) కార్యాలయాల్లో పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని విచారించారు. వారివద్ద ఉన్న నగదును సైతం పరిశీలించి వివరాలు నమోదు చేశారు. అక్కడ అనధికారికంగా పని చేస్తున్న వ్యక్తుల గురించి ఆరా తీశారు. - విజయనగరం టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. - నెల్లూరు నగరంలో గడిచిన ఏడు, ఎనిమిది నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సంబంధిత భవనాలకు ఏ ప్రాతిపదికన అనుమతులు మంజూరు చేశారని టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిని ప్రశ్నించారు. - తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పలు రికార్డులను పరిశీలించారు. అనధికార కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు తేలింది. - ప్రకాశం జిల్లా ఒంగోలులో సోదాలు నిర్వహించే సమయంలో సల్మాన్ బాషా అనే ప్రైవేట్ వ్యక్తి ఆ విభాగంలోని కంప్యూటర్ వద్ద కూర్చోవడం, అతని వద్ద కవర్లో రూ.8,940 ఉండటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. - చిత్తూరు జిల్లా తిరుపతిలో బీపీఎస్, ఆన్లైన్ భవన నిర్మాణ అనుమతుల రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. రికార్డులు సక్రమంగా నమోదు చేయలేదని, అందులో తప్పుడు వివరాలు ఉన్నట్లు గుర్తించారు. - శ్రీకాకుళంలో కొన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. - గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో బిల్ కలెక్టర్ ఎస్.నాగేశ్వరరావు నుంచి రూ.69,620, టౌన్ ప్లానింగ్ ఔట్సోర్సింగ్ అటెండర్ అల్లంశెట్టి సుధాకర్ నుంచి రూ.29,093, డిప్యూటీ సిటీ ప్లానర్ బి.సత్యనారాయణ నుంచి రూ.5,100.. మొత్తం రూ.1,03,813 అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు. బిల్డింగ్ ప్లాన్లు, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ఇతర విషయాల్లో జరిగిన నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో భవనాల నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనలను ఏసీబీ పరిశీలించింది. -
ఏపీ: ఏసీబీ మెరుపు దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులపై మెరుపు దాడులు నిర్వహించింది. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో ఏక కాలంలో 25 ఏసీబీ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. పక్కా వ్యూహంతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు నగదు, నగలు బయటపడ్డాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మోహన్‌రావు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గంధం వెంకట పల్లంరాజు, తూర్పు గోదావరి జిల్లా సీఈవో ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (కాకినాడ) లంకె రఘుబాబు, విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామ పీఏసీఎస్ స్టాఫ్ అసిస్టెంట్ సీరంరెడ్డి గోవిందు, కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్ (పీఏ టు స్పెషల్ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్) సాకే సత్యం ఇళ్లతోపాటు వారి బంధువులు, బినామీలకు చెందిన ఇళ్లల్లో ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ ఐదుగురుకి చెందిన ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.11 కోట్లు పైబడి ఉంటాయని, బయట మార్కెట్లో ఇంకా ఎక్కువగా ఉంటాయని ఏసీబీ డీజీ తెలిపారు. వారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. భారీగా ఆస్తులు, బంగారం, నగదు గుర్తింపు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై తూర్పుగోదావరి జిల్లా ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (కాకినాడ) సీఈవో లంకె రఘుబాబు ఇంటిపైన, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గంధం వెంకట పల్లంరాజు ఉంటున్న లాడ్జిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాకినాడలో పల్లంరాజుకు సంబంధించిన ఆదాయ వివరాలు ఏమీ లభించకపోవడంతో ఆయనను విశాఖపట్నం తీసుకెళ్లారు. కాగా లంకె రఘుబాబు నివాసంలోని సోదాల్లో దాదాపు రూ.15 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. రఘుబాబు ఇంటితోపాటు విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరంలోని ప్రాంతాల్లో ఉంటున్న ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏక కాలంలో ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. భారీగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ పీఏ ఆస్తుల విలువ రూ.5 కోట్లు విశాఖ జిల్లా మాకవరపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీరంరెడ్డి గోవిందు ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయనకు ఆదాయానికి మించి 1.75 కోట్ల అక్రమాస్తులున్నట్టు గుర్తించారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ సాకే సత్యం ఇంటితోపాటు ఆయన తమ్ముడు నారాయణస్వామి ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు, అనంతపురంలో నిర్వహించిన సోదాల్లో పలు ప్రాంతాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలతోపాటు బంగారు నగలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.5 కోట్లకుపైగానే ఉంటుందని నిర్ధారించారు. గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ) పార్వతీపురంలో ఈఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తూతిక మోహనరావుకు సంబంధించి శ్రీకాకుళం, పార్వతీపురంలో ఉన్న ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. స్థిరాస్తులు, బంగారం, వెండి, గృహోపకరణాలు, గృహాలంకరణ, నగదు అంతా కలిపి మార్కెట్ విలువ ప్రకారం మొత్తం రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు నిర్ధారించారు. -
ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు
సాక్షి, అమరావతి: అవినీతిని సమూలంగా నిర్మూలించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మండల రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు శుక్రవారం మెరుపుదాడులు నిర్వహించాయి. రాష్ట్రంలో 250 ఎమ్మార్వో కార్యాలయాలను ఎంపిక చేసుకున్న ఏసీబీ అప్పటికప్పుడు 20 తహసీల్దార్ కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయాల్లో బీరువాలు, టేబుల్ సొరుగులు, సిబ్బంది బ్యాగులను ఏసీబీ అధికారులు క్షుణ్నంగా సోదాలు చేశారు. కంప్యూటర్లు, రికార్డులను పరిశీలించారు. ఎమ్మార్వో కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చిన ప్రజలను అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీసి వివరాలు సేకరించారు. రెవెన్యూ సేవలపై ఆరా.. చిత్తూరు జిల్లా వడమాలపేట, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, కృష్ణా జిల్లా అవనిగడ్డ, తోట్లవల్లూరు, గుంటూరు జిల్లా నాదెండ్ల, భట్టిప్రోలు, మాచర్ల, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, పెదపూడి, ప్రకాశం జిల్లా పొన్నలూరు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల, కొత్తూరు, విజయనగరం జిల్లా వేపాడ, విశాఖపట్నం జిల్లా భీమిలి, సబ్బవరం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, కావలి, వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం, అనంతపురం జిల్లా ముదిగుబ్బ, కర్నూలు జిల్లా కల్లూరు ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. తనిఖీల్లో రెవెన్యూ సిబ్బంది వద్ద లెక్కల్లో చూపని రూ.4 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలు, భూ రికార్డులు, పాస్ పుస్తకాలు ఎంతవరకు పరిష్కరించారు? పెండింగ్ ఫిర్యాదులను పరిష్కరించకపోవటానికి కారణాలు ఏమిటి? అనే వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, పనులు ఎక్కడైనా లంచాలు డిమాండ్ చేస్తున్నారా? అనే అంశాలపై ఆరా తీశారు. విచారణ కొనసాగిస్తాం... రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 20 చోట్ల తహసీల్దార్ కార్యాలయాల్లో సోదాలు జరిపి రూ.4 లక్షల మేర అనధికారిక సొమ్మును గుర్తించినట్లు ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు మీడియాకు తెలిపారు. ‘రైతులు టైటిల్ డీడ్, ఈ–పాస్‌బుక్ కోసం చేసుకున్న దరఖాస్తులను కారణం చూపకుండానే డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు పెండింగ్‌లో పెడుతున్నారు. పలుచోట్ల దరఖాస్తులను కారణాలు చూపకుండానే తిరస్కరిస్తున్నారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో ఉద్యోగులకు సంబంధించి మూవ్మెంట్ రిజిస్టర్ లాంటి రికార్డులను నిర్వహించడం లేదు. కొందరు తహసీల్దార్లు అధికారిక పనుల కోసం రెవెన్యూ శాఖకు సంబంధంలేని బయటి వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. రెవెన్యూ శాఖలో అక్రమాలపై ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను కనీసం ప్రాథమికంగా విచారించకుండానే తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో పెడుతున్నారు. రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తాం’ అని ఏసీబీ డీజీ తెలిపారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి.. అవినీతిని నిర్మూలించాలని, ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల ఏసీబీపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గట్టిగా సూచించారు. అవినీతిని అంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 14400 టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేయడం తెలిసిందే. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు అత్యధిక ఫిర్యాదులు అందుతున్న ప్రభుత్వ శాఖలను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 10వతేదీన రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ పలు అక్రమాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. తాజాగా ఎమ్మార్వో కార్యాలయాల్లో సోదాలు జరిపింది. -
24 గంటల్లో 5,100 కాల్స్
సాక్షి, అమరావతి: ‘చేయి చేయి కలుపుదాం.. అవినీతి భూతాన్ని తరిమేద్దాం’ అంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. 14400 కాల్ సెంటర్ ప్రారంభించి 24 గంటలు గడవక ముందే రికార్డు స్థాయిలో 5,100 కాల్స్ వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు అందిన వాటిల్లో 283 ఫిర్యాదులను నేరుగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కార్యాలయాలకు పంపించారు. ఫిర్యాదుల్లో గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్ శాఖల్లో సిబ్బంది లంచం కోసం డిమాండ్ చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని అత్యధిక ఫిర్యాదులు అందడం గమనార్హం. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరంతరం విధుల్లో కాల్‌సెంటర్ సిబ్బంది అవినీతిని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కాల్ సెంటర్ నుంచి ఏసీబీకి ఫిర్యాదులు పంపడం, చర్యలు చేపట్టడం అంతా పక్కాగా జరుగుతోంది. 14400కి వచ్చే కాల్స్‌ను ఆర్టీజీఎస్ సిబ్బంది స్వీకరిస్తారు. కాల్ సెంటర్లో 20 నుంచి 25 మంది సిబ్బంది రాత్రిపగలు (24 గంటలు) షిఫ్టుల్లో పని చేస్తారు. అన్ని కాల్స్‌ను రికార్డు చేస్తారు. దీన్ని కంప్యూటర్ ద్వారా వర్డ్ ఫైల్ (డాక్యుమెంటేషన్) రూపొందిస్తారు. బాధితుడి వాయిస్ రికార్డు, కాల్ సెంటర్ డాక్యుమెంట్ కలిపి జిల్లా, రేంజ్, రాష్ట్ర ఏసీబీ అధికారులకు పంపిస్తారు. ఫిర్యాదులకు మరికొన్ని మార్గాలు –అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు 14400 కాల్ సెంటర్‌తోపాటు ఏసీబీ ద్వారా మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా నెలకు సగటున 300కిపైగా ఫిర్యాదులు ఏసీబీకి అందుతుంటాయి. – వాట్సాప్ నంబర్ 8333995858 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. – కేంద్ర ప్రభుత్వ పరిధిలోని టోల్ ఫ్రీ నెంబర్ 1064తోపాటు ట్విట్టర్, ఈ మెయిల్, ఫేస్బుక్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు ప్రజల్లో చైతన్యానికి నిదర్శనం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన 14400 కాల్ సెంటర్‌కు అందే ఫోన్ కాల్స్ ప్రజా చైతన్యానికి అద్దం పడుతున్నాయి. అవినీతిని రూపుమాపాలన్న మహాయజ్ఞంలో ప్రజలు భాగస్వాములు కావడం మంచి పరిణామం. దీనివల్ల ఏసీబీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. వ్యయ ప్రయాసలు ఉండవు. నేరుగా ఒక్క ఫోన్‌కాల్ చేసి సమాచారం ఇస్తే చాలు. ఫిర్యాదుదారుడి వివరాలు రహస్యంగా ఉంచుతాం. లంచం అడుగుతున్నారంటూ అందే ఫిర్యాదులపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల, ఇతర కీలక కేసులపై 30 రోజుల్లోగా చర్యలు చేపడతాం. – కుమార్ విశ్వజిత్ (ఏసీబీ డీజీ) -
అవినీతిలో ‘సీనియర్’
ఏఎన్‌యూ, కాజ (మంగళగిరి)/సాక్షి, అమరావతి: ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు మరో అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) అకౌంట్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జవ్వాది శ్రీనివాసరావుపై ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం అతని కార్యాలయం, నివాసం, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 బృందాలు సోదాలు నిర్వహించాయి. బహిరంగ మార్కెట్లో రూ. 30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాజ, ఆరేపల్లి ముప్పాళ్ల, అన్నవరం, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు, నర్సరావుపేట, అమరావతి పట్టణాల్లో తనిఖీలు చేశారు. శ్రీనివాసరావు పేరుతో జీ ప్లస్ 2, జీ ప్లస్ 1 భవనాలు, పలు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, ఏడు ఇళ్ల స్థలాలు, 7.56 ఎకరాల వ్యవసాయ భూమి, ఆయన భార్య సుజాత పేరుతో రెండు భవనాలు, 5.94 ఎకరాల వ్యవసాయ భూమి, కుమారుడు వెంకటకృష్ణ పేరుతో ఆరు ఇళ్ల స్థలాలు, 5.19 ఎకరాల వ్యవసాయ భూమి, కుమార్తె నందిని పేరుతో రెండు ఇళ్ల స్థలాలు, 6.90 ఎకరాల వ్యవసాయ భూమి, కోడలు మానస పేరుతో ఇంటి స్థలం గుర్తించారు. సోదాల్లో రూ. 29 లక్షల నగదు, రూ. 26.23 లక్షల బ్యాంకు నిల్వ, రూ. 12 లక్షల విలువైన బంగారం ఆభరణాలు, రూ. 47,600 విలువైన వెండి ఆభరణాలు, రూ. 4.50 లక్షల విలువైన సామగ్రి, రూ. 3.65 లక్షల ప్రామిసరీ నోట్లు దొరికాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 3.50 కోట్లు ఉంటుందని ఏసీబీ డీజీ విశ్వజిత్ తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ రూ. 30 కోట్లకుపైగా ఉండవచ్చని తెలిసింది. తనిఖీలు నిర్వహించిన అనంతరం శ్రీనివాసరావును అరెస్ట్ చేసి గుంటూరు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ వలలో రెండోసారి.. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనివాసరావు ఏసీబీ కేసులో ఇరుక్కోవడం ఇది రెండోసారి. 14 ఏళ్ల కిందట అతను యూనివర్సిటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయ్యాడు. అయినా తన తీరు మార్చుకోలేదు. టీడీపీ హయాంలో మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ అండతో అతను అక్రమాస్తులు కూడబెట్టారని స్థానికులు చెబుతున్నారు. విశ్రాంత ఉద్యోగి ఇంటిపై ఏసీబీ సోదాలు వర్సిటీలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఎం.మల్లేశ్వరరావు అనే ఉద్యోగి నివాసంలోనూ ఏసీబీ దాడులు చేసినట్లు సమాచారం. గుంటూరులోని జేకేసీ కళాశాల ప్రాంతంలో ఉన్న ఇతని నివాసంలో శుక్రవారం మూడు గంటలకుపైగా తనిఖీలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఏసీబీ కేసులో సస్పెండ్ అయిన శ్రీనివాసరావు తిరిగి విధుల్లో చేరేందుకు మల్లేశ్వరరావు సహకరించారని సమాచారం. దీంతో వీళ్లిద్దరి మధ్య సంబంధాలపై అధికారులు విచారిస్తున్నారు. -
జలగలకు వల
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కేశంపేట తహసీల్దార్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేసిన దాడిలో ఏకంగా రూ.93 లక్షల నగదు లభించిన సంగతి తెలిసిందే. అంతపెద్ద మొత్తం లెక్కపెట్టేందుకు ఏసీబీ అధికారులకు గంటపైగా సమయం పట్టింది.. ఏసీబీకే చెందిన సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. - ఏసీబీ అధికారులు వలపన్ని నమోదు చేసిన కేసుల్లో అసెంబ్లీ ఉద్యోగుల నుంచి పంచాయతీ అటెండర్ వరకు దాదాపు అన్ని శాఖల ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచే అధికం. - సంక్షేమ పథకాల జారీలో ప్రతి దానికి లంచం అడగడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో అధిక శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే. - భూ ప్రక్షాళన, పట్టాదారు పాసు పుస్తకాల జారీ విషయంలో రెవెన్యూ ఉద్యోగులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. కిందిస్థాయి అటెండర్ నుంచి వీఆర్ఏ, వీఆర్వో, తహసీల్దార్ వరకు అంతా అవినీతికి గేట్లు తెరిచారు. కొత్త జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోంది. దీన్ని కూడా వారు అవకాశంగా తీసుకుని బాధితుల వద్ద అందినకాడికి దండుకుంటున్నారు. -
వేగంగా ఏసీబీ కేసుల దర్యాప్తు
సాక్షి, అమరావతి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులను ఏళ్ల తరబడి నాన్చకుండా వీలైనంత త్వరగా చట్టప్రకారం చర్యలు తీసుకునేలా ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం ఆ కేసులపై దృష్టిపెట్టింది. గత నెల 24, 25 తేదీల్లో ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్లు, ఐపీఎస్‌లతో సమావేశం సందర్భంగా ఐపీఎస్‌లతో శాంతిభద్రతలపై సమీక్షించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో ఏసీబీ కేసుల పురోగతిపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో ఈ నెల 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నిర్వహించిన సమావేశంలో ఏసీబీ కేసుల పురోగతిపై ఆరా తీశారు. రాష్ట్రంలో ఏసీబీ కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం, కుప్పలుగా పేరుకుపోయిన ఏసీబీ కేసుల్లో చార్జిషీటు, దర్యాప్తు, విచారణ దశలకు చేరకపోవడం వంటి వైఫల్యాలను చర్చించారు. ఏసీబీలో 31 కీలక కేసుల్లో 27 కేసులపై శాఖాపరంగా కూడా కనీస చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావించారు. ఈ కేసుల పురోగతికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 31వ తేదీలోగా నివేదించాలని ఏసీబీ అధికారులకు గడువు విధించారు. గతంలో ఏసీబీ కేసుల నమోదులో కక్షసాధింపు చర్యలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అవినీతి నిర్మూలనకు నిష్పక్షపాతంగా అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏసీబీ కేసులపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఏసీబీ కేసుల పురోగతికి కీలక నిర్ణయాలు... ఎవరైనా ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కితే ఆ ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు, కేసు దర్యాప్తు, విచారణ వంటి ప్రక్రియలు వేగవంతం చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏసీబీ కేసుల్లో పట్టుబడిన ఉద్యోగి చిన్న స్థాయి అవినీతికి పాల్పడితే మూడు నెలలు, పెద్ద స్థాయి అవినీతి అయితే ఆరు నెలల వరకు సస్పెండ్ చేయాలి. ఏసీబీ కేసుల్లో పారదర్శకత కోసం కేసు నమోదు నుంచి చివరి వరకు అన్ని వివరాలను ప్రస్తావించాలి. ఈ కేసుల్లో ఎటువంటి గందరగోళానికి తావులేకుండా క్రమశిక్షణ చర్యలు ఉండాలి. అవినీతి ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో సందిగ్ధత వస్తే అవసరమైతే సదరు ఉద్యోగి పనితీరుపై విజిలెన్స్ నివేదిక కూడా తీసుకుంటే కేసు దర్యాప్తునకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏసీబీ కేసుల దర్యాప్తులో ఇంటెలిజెన్స్ విభాగం నుంచి పూర్తి వివరాలు తెప్పించుకోవాలి. అవినీతికి పాల్పడిన వారి విషయంలో కచ్చితమైన సమాచారం సేకరించడం, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ నుంచి వివరాలు సేకరించేందుకు ఒక ప్రత్యేక ప్యానల్‌ను ఉపయోగించుకుంటే కేసు బలంగా ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగులపై అవినీతి కేసుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తే పెన్షన్ నిబంధనలు రూల్–9ను సవరించాల్సి ఉంది. అవినీతి కేసులో చిక్కిన ఉద్యోగి రిటైర్ అయిన తరువాత నేర నిరూపణ జరిగితే చట్టపరమైన చర్యల్లో భాగంగా అతని పెన్షన్‌ను పూర్తిగా (నూరు శాతం) తొలగించాలంటే ఏపీపీఎస్సీని సంప్రదించాలి. నేర నిరూపణతో శిక్షలు పడిన అవినీతి అధికారులపై నెలలోపే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఏసీబీ కేసుల్లో జాప్యం జరిగినా, అలక్ష్యం వహించినా సంబంధిత దర్యాప్తు అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏపీ సివిల్ సర్వీసెస్ (డీపీటీ) చట్టం–1960 కింద ఏర్పాటు చేసిన క్రమశిక్షణ విధానాల ట్రిబ్యునల్ న్యాయ విభాగాన్ని సంప్రదించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఏసీబీ కేసుల్లో క్రమశిక్షణ చర్యలు, కేసుల పురోగతిపై ఒక కేంద్రీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేయడంతోపాటు సచివాలయ స్థాయి నుంచి పర్యవేక్షించాలి. ఏసీబీ కేసుల్లో ఫైళ్లు జాప్యం జరగకుండా సచివాలయంలోని అధికారులు, సీనియర్, జూనియర్ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
సర్వశిక్ష అభియాన్‌లో అడ్డగోలు దోపిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేసిన పుస్తకాల కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. దాదాపు రూ.4.66 కోట్ల సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులను మింగేసిన గోల్మాల్ భాగోతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడితో పాటు ఎస్ఎస్ఏ ఎస్పీడీ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి జి.శ్రీనివాస్‌కు అవినీతి నిరోధక శాఖ శుక్రవారం నోటీసులు జారీ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ‘డ్రీమ్‌వరల్డ్ ఇండియా’ సీడీలు, డీవీడీలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామని రెండున్నరేళ్ల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావుకు 16 రకాల పుస్తకాలతో ప్రతిపాదనలు అందజేసింది. పుస్తకాల వాస్తవ ధరలపై 71 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని పేర్కొంది. ఎస్ఎస్ఏ ద్వారా పుస్తకాల కొనుగోలుకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్ఈఆర్టీ) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన తరువాత 11 రకాల పుస్తకాలు కొనుగోలు చేయాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీ జి.శ్రీనివాస్ నిర్ణయించారు. ఎస్ఎస్ఏ అధికారులు, డ్రీమ్‌వరల్డ్ కంపెనీతో కుమ్మక్కు కావడంతో..ముందుగా చెప్పిన రేట్లకు బదులు పుస్తకాల ధరను భారీగా పెంచేశారు. సీఎం రమేష్ ప్రవేశంతో ‘డబుల్’ దందా! డ్రీమ్‌వరల్డ్ తొలుత పేర్కొన్న ధరల ప్రకారం 11 పుస్తకాల సెట్టు ధర రూ.7,200 మాత్రమే. కానీ తరువాత ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, ఆ సంస్థ కుమ్మక్కై ఈ ధరను అమాంతం రూ.13,489కి పెంచేశారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పుస్తకాల కోసం డ్రీమ్వరల్డ్కు ఆగమేఘాల మీద ఆర్డర్లు ఇచ్చారు. డిస్కౌంట్‌ను కూడా 71 శాతానికి బదులు 30 శాతానికి పరిమితం చేశారు. భారీగా కమిషన్ల కోసం రేట్లను అమాంతం పెంచేశారు. డ్రీమ్ వరల్డ్ సంస్థకు రాష్ట్ర కార్యాలయం నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉన్నా.. నిబంధనలను తుంగలో తొక్కి జిల్లా కార్యాలయాల నుంచి చెల్లింపులు చేయించారు. ముఖ్యకార్యదర్శి పరిశీలనలో తేలిన అక్రమాలు.. ఎస్ఎస్ఏలో నిధుల గోల్‌మాల్‌పై తనకు అందిన ఫిర్యాదుల ఫైలును పరిశీలించిన ముఖ్యకార్యదర్శి పుస్తకాల రేట్లు అమాంతం పెరిగిపోవడాన్ని గుర్తించారు. డ్రీమ్‌వరల్డ్ తొలుత ప్రభుత్వానికి అందించిన ధరల ప్రతిపాదనల పత్రాలు ఫైల్లో లేకపోవడం, వాటి స్థానంలో అధిక ధరలతో వేరే పత్రాలు ఉండడం ముఖ్యకార్యదర్శి దృష్టికి వచ్చింది. ముందుగా ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఒక్కో సెట్టు వాస్తవ ధర రూ.7,200 కాగా రూ.13,489కి పెంచేశారు. 11 పుస్తకాల సెట్టు రూ.7200 చొప్పున 7,413 సెట్లకు రూ.5,33,73,600 మాత్రమే అవుతుంది. అయితే ఎస్ఎస్ఏ ఎస్పీడీ కొత్త ధరల పట్టికను చూపిస్తూ రూ.13,489 చొప్పున రూ.9,99,93,957 చెల్లింపులు చేశారు. అసలది పబ్లిషింగ్ సంస్థే కాదు.. విచిత్రమేమంటే డ్రీమ్‌వరల్డ్ ఇండియా సంస్థ అసలు పబ్లిషింగ్ సంస్థే కాదని.. కేవలం పంపిణీదారు మాత్రమేనని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. తొలుత ప్రతిపాదించిన ధరల కన్నా ఎక్కువ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీని ముఖ్యకార్యదర్శి ఆదేశించినా ఫలితం లేకుండాపోయింది. ఇదిలా ఉండగా..ఈ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ రంగంలోకి దిగి రికార్డులను స్వాధీనం చేసుకుంది. వాస్తవాలు తేటతెల్లంగా తెలుస్తున్నా సీఎం రమేష్ సహా టీడీపీ నేతల ఒత్తిడితో గత ప్రభుత్వ హయాంలో కేసు ముందుకు సాగలేదు. తాజాగా ప్రభుత్వం అవినీతిపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఏసీబీ ఎస్పీడీకి నోటీసులు జారీ చేసింది. అక్రమాలకు సాక్ష్యాలివిగో.. ప్రభుత్వానికి ముందుగా సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ‘స్పిరిట్ ఆఫ్ ఇండియా’ పుస్తకం ధర రూ.1,495 ఉంటే ఎస్పీడీ ప్రతిపాదనల్లో అది రూ.2,495కి పెరిగింది. -
మరో కేసు డ్రాప్
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ సరైన ఆధారాలు సేకరించకపోవడంతో మరో కేసును డ్రాప్ చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్ వై.వెంకటేశ్వర్రావు అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీ 2009లో కేసు నమోదు చేసింది. దీంతో 11 నెలలపాటు పోలీస్ శాఖ సస్పెన్షన్ చర్యలు తీసుకుంది. ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన్ను నగర కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా నియమించింది. అయితే కేసు నమోదు తర్వాత అవినీతి నిరోధక శాఖ సరైన సాక్ష్యాలు సేకరించలేదు. దీంతో తనపై నమోదైన కేసులో అవినీతి ఆరోపణలు రుజువు కాలేదని, తనకు న్యాయం చేయాలని వెంకటేశ్వర్రావు హోంశాఖకు అప్పీల్ చేసుకున్నారు. ఆయన అప్పీల్‌ను పరిశీలించిన ప్రభుత్వం అవినీతి ఆరోపణలు రుజువు కాకపోవడంతో 11 నెలల సస్పెన్షన్ సమయాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని సూచిస్తూ.. ఆ 11 నెలల కాలానికి వెంకటేశ్వర్రావుకు దక్కాల్సిన జీతభత్యాలతో పాటు తదుపరి ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. 2016లో ఆధారాల్లేని 125 కేసులు ఏసీబీ మూసివేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. -
ఏసీయూ నివేదిక తర్వాతే!
న్యూఢిల్లీ: పీకల్లోతు కేసుల్లో ఇరుక్కున్న పేసర్ మొహమ్మద్ షమీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి సెంట్రల్ కాంట్రాక్టు రావాలన్నా, ఈ సీజన్లో ఐపీఎల్ ఆడాలన్నా అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) నుంచి క్లీన్చిట్ కావాల్సిందేనని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. బీసీసీఐ నియమావళిలోని క్రికెటర్ల ఎథిక్స్ కోడ్ ప్రకారం కేవలం అవినీతి, అనుచిత ఆర్థిక వ్యవహారాల్లో మాత్రమే బోర్డు జోక్యం చేసుకుంటుంది. వ్యక్తిగత, వైవాహిక అంశాలు బోర్డు పరిధిలోకి రావని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏసీయూ చీఫ్ నీరజ్ కుమార్... షమీ భార్య హసీన్ జహాన్ పేర్కొన్న ఆర్థిక లావాదేవీపైనే విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. తన భర్త పాకిస్తానీ ప్రియురాలికి, మొహమ్మద్ భాయ్‌కి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని హసీన్ ఆరోపించింది. బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపి వారంలోగా నివేదిక ఇవ్వాలని ఏసీయూ హెడ్ నీరజ్ కుమార్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏసీయూ షమీకి క్లీన్చిట్ ఇస్తే సెంట్రల్ కాంట్రాక్టుతో పాటు ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడే అవకాశమిస్తామని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా చెప్పారు. -
సీనియర్ అసిస్టెంట్ ఆస్తులు రూ.50 కోట్లు
అనంతపురం సెంట్రల్: మహిళా, శిశు సంక్షేమశాఖ పెనుకొండ ప్రాజెక్టు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి ఆస్తులపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధకశాఖ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో పలువురు సీఐలు ఎనిమిది బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేశారు. అనంతపురం జిల్లాతో పాటు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పాకాల మండలం రామచేర్ల గ్రామంలోనూ సోదాలు చేపట్టారు. దాడుల్లో దాదాపు రూ.50 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. విచారణ అనంతరం నిందితుడిని కస్టడీలోకి తీసుకుని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ జయరామరాజు వెల్లడించారు. -
గంగాధరం ఆస్తులు రూ.150 కోట్లు!
ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సాక్షి, విశాఖపట్నం: ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం అక్రమాస్తుల కేసులో సోదా లు ముగిశాయి. ఈ నెల 1 నుంచి 4 వరకు జరిగిన దాడుల్లో వెలుగుచూసిన మొత్తం ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.11 కోట్లని అవినీతి నిరోధకశాఖ అధి కారులు తేల్చారు. వీటి మార్కెట్ విలువ రూ. 150 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 25 బృందాలతో 16 ప్రాంతాల్లో దాడులు చేశామని, ఇంత వరకు ఏ అధికారి దగ్గరా దొరకనన్ని ఆస్తులు గంగాధరం, ఆయన కుటుంబసభ్యులు, స్నేహితుల వద్ద లభించాయని చెప్పారు. కుటుంబసభ్యులు, వియ్యంకుడు రామ సుబ్బారెడ్డి పేరుమీద రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు తాజాగా బయటపడ్డాయన్నారు. రూ.20 లక్షలను షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించామని తెలిపారు. తొమ్మిది లాకర్లు గుర్తించామని, వీటిలో ఏడు హైదరాబాద్‌లో, రెండు విశాఖలో ఉన్నా యన్నారు. 4 కిలోల బంగారం, రూ.కోటికి పైగా నగదు, చిత్తూరు, నెల్లూరు, రంగారెడ్డి, విశాఖ జిల్లాల్లో 54 ఎకరాల భూములు, రాంకీ విల్లా, శ్వాన్‌లేక్, కూకట్‌పల్లిలో డూప్లెక్స్ హౌస్‌లతో కలిపి ఏడు ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు. సుప్రజలో రూ.2 కోట్లు, నమిత హోమ్స్‌లో రూ.1.3 కోట్లు, మరో ఐదు కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టారని వివరించారు. ఎస్ఎస్ ఫామ్స్, ఆర్ఆర్ ఫామ్స్, ఐమాజిక్స్ పొలారసిస్‌లలో రూ.24 లక్షల డిపాజిట్లున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లు నాగభూషణం, విశ్వేశ్వరరావు, కిశోర్ ఇళ్లపై దాడులు చేశా మని, వారికి గంగాధరంతో ఉన్న సంబం ధాలపై విచారణ చేస్తున్నామని చెప్పారు. -
ఏసీబీకి చిక్కిన సీటీవో
నరసన్నపేట : అవినీతి నిరోధక శాఖ వలలో వాణిజ్యపన్నుల శాఖ అధికారి (సీటీవో) చిక్కారు. ఓ హోటల్‌కు సంబంధించి వ్యాట్ లైసెన్స్, ఇద్దరు పేరున ఉన్న వ్యాట్ లెసెన్స్ రద్దు కోసం ఊణ్ణ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి మంగళవారం పది వేల రూపాయల లంచం తీసుకుంటూ నరసన్నపేట సీటీవో కె.నాగరాజు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేటలోని లక్ష్మీ టాకీస్ వద్ద ఊణ్ణ వెంకటేశ్వరరావు పేరున అన్నపూర్ణ గార్డెన్ రెస్టారెంట్ ఉంది. దీన్ని ఎన్.గోవిందరావు అనే వ్యక్తి ఇటీవల లీజుకు తీసుకున్నారు. ఈయన పేరున వ్యాట్ లైసెన్స్ కావాలని సీటీఓను వెంకటేశ్వరరావు సంప్రదించారు. అయితే అప్పటికే గోవిందరావు పేరున మరో చిరునామాతో వ్యాట్ లైసెన్స్ ఉంది. దీన్ని రద్దు చేస్తేనే కొత్తది ఇవ్వగలమని సీటీఓ స్పష్టం చేశారు. అలాగే వెంకటేశ్వరరావు, గోవిందుల పేరున ఉన్న వ్యాట్ లైసెన్స్‌లు రద్దు చేస్తూ కొత్తగా అన్నపూర్ణ గార్డెన్ రెస్టారెంట్ పేరుతో గోవింద్‌కు కొత్తగా వ్యాట్ రిజిస్టేషన్ కావాలని వీరు కోరారు. ఈ పనులన్నీ పూర్తికావాలంటే 25 వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని సీటీవో నాగరాజు డిమాండ్ చేయగా.. పది వేల రూపాయలు ఇచ్చేందుకు హోటల్ నిర్వాహకులు అంగీకరించినట్టు డీఎస్పీ చెప్పారు. తరువాత లంచం డిమాండ్ చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి వెంకటేశ్వరరావు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఆయన చేతికి పది వేల రూపాయలు ఇచ్చి.. సీటీవోకు ఇవ్వాలని మంగళవారం మధ్యాహ్నం పంపించామన్నారు. కార్యాలయంలోనే వెంకటేశ్వరరావు నుంచి సీటీవో నాగరాజు లంచం తీసుకుంటుండగా.. దాడి చేసి రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నట్టు వివరించారు. సీటీవోను అరెస్టు చేశామని..విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో బుధవారం హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. స్థానికంగా సంచలనం అవినీతి నిరోధక శాఖ అధికారులకు సీటీవో చిక్కిన విషయం నరసన్నపేటలో సంచలనమైంది. సీటీఓ నాగరాజు ఉదయం 11 గంటలకే కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ విధులు నిర్వహించుకుంటున్నారు. ఒంటి గంట సమయంలో హోటల్ యజమాని వెంకటేశ్వరరావు సీటీవో కార్యాలయానికి రావడం, కొద్ది సమయానికే ఏసీబీ అధికారులు దాడి చేసి సీటీవోను అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏసీబీ దాడుల్లో సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన కుటుంబ సంక్షేమ శాఖ ఏడీ
రూ. 17 వేల నగదు స్వాధీనం హైదరాబాద్: డిప్యుటేషన్‌కు సంబంధించిన ఉత్తర్వుల జారీకిగాను రూ.12 వేలు లంచం తీసుకుంటూ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సంచాల కులు (అడ్మిన్–1) ఎం.సంజీవరావు, అటెండర్, డ్రైవర్ మంగళవారం ఇక్కడ అవినీతి నిరోధకశాఖ అధికారుల కు చిక్కారు. వివరాలను సిటీ రేంజ్–1 అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ అశోక్‌కుమార్ వెల్లడించారు. వరంగల్ జిల్లా దామెర పీహెచ్సీ ఫార్మాసిస్టు శైలజ వరంగల్ జిల్లాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌కు డిప్యుటేషన్ ఇవ్వాలని కోరడంతో వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎం.సంజీవరావు నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. శైలజకు డిప్యుటేషన్ మీద సెంట్రల్ డ్రగ్స్‌స్టోర్‌కు వేయాలని కమి టీ నిర్ణయించింది. ఉత్తర్వుల జారీకిగాను సంజీవరావు శైలజను రూ.12 వేలు డిమాండ్ చేశారు. దీనిపై శైలజ బంధువు రజనీకాంత్ ఈ నెల 16న ఏసీబీని ఆశ్రయించ డంతో అధికారులు సంజీవరావుపై నిఘా పెట్టారు. ఏడీ డ్రైవర్ తౌఫిక్ రూ.15 వేలు, అటెండర్ అంబర్‌బాబా మరో రూ.2 వేలు తీసుకుంటుం డగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, రాజేశ్, మంజుల పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో అవినీతి అధికారులు
ముగ్గురు టీటీడీ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు రూ. కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం తిరుచానూరు/తిరుపతి క్రైం: టీటీడీలో ముగ్గురు అధికారులు ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారు. వీరిపై ఫిర్యాదులు అందడంతో వారి ఇళ్లపై ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కోట్లాది రూపాయల విలువజేసే డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టీటీడీ పరిపాలనా భవనంలో నియామక విభాగపు సూపరింటెండెంట్ నరేంద్రరెడ్డి, తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సూపరింటెండెంట్ మోహన్‌రెడ్డి, తిరుమల కల్యాణకట్ట సూపర్వైజర్ తంగవేలులకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని సమాచారం రావడంతో వారిపై నిఘా పెట్టారు. మంగళవారం తిరుచానూరు వసుంధరనగర్‌లో నరేంద్రరెడ్డి నివాసంలో, తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటున్న మోహన్‌రెడ్డి, కొర్లగుంట వాసి తంగవేలు ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. అదే సమయంలో నరేంద్రరెడ్డి బంధువులు నలుగురి ఇళ్లలోనూ సోదాలు చేశారు. వీరందరి ఇళ్లల్లో కోట్లాది రూపాయల విలువైన డాక్యుమెంట్లు, ఇంటి పత్రాలు, బ్యాంకు లాకర్ల వివరాలు, బ్యాంకు పాసు బుక్కులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి
మామూళ్లు తీసుకుంటున్న వాణిజ్య పన్నుల శాఖాధికారిని అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. సరూర్‌నగర్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వేణుగోపాలరావు ఓ వ్యక్తి నుంచి రెండువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీకి పట్టుబడ్డ వేణుగోపాలరావు కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. -
మళ్లీ మళ్లీ.. పెళ్లి!
♦ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లో బయటపడుతున్న లీలలు ♦ అధికారులు, దళారుల మిలాఖత్ ♦ సరూర్‌నగర్ మండలంలోనే 100కుపైగా నకిలీలు ♦ ఓ మధ్యవర్తి మూడు దరఖాస్తుల్లో పెళ్లికొడుకు ♦ రెండు గంటల్లోనే కుల, ఆదాయ సర్టిఫికెట్లు ♦ తీగలాగుతున్న అవినీతి నిరోధక శాఖ ♦ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ సరూర్‌నగర్ మండలానికి సంబంధించి దాదాపు వందకుపైగా నకిలీ లబ్ధిదారులున్నట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్రమంలో 16 మంది నకిలీల బాగోతాన్ని బయటపెట్టింది. ఇప్పటివరకు నకిలీలుగా గుర్తించిన దరఖాస్తుల్లో ఎజాజుల్లాఖాన్ అనే మధ్యవర్తి తానే మూడు చోట్ల పెళ్లికొడుకు స్థానంలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో అక్రమాల డొంక కదులుతోంది. ఈ పథకాల సొమ్ము లబ్ధిదారులు కాకుండా మధ్యవర్తులకు దక్కుతోందని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే పదిరోజుల క్రితం అక్రమాలు జరుగుతున్న తీరును బయటపెట్టిన ఏసీబీ.. తాజాగా సర్కారు సొమ్ము దారిమళ్లిందన్న విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారంలో సూత్రధారుల బాగోతాన్ని బహిర్గతం చేస్తూ.. అందుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేసింది.- సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : నిరుపేద దళిత, మైనార్టీల కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రక్రియను సాజావుగా సాగించి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాల్సి ఉండగా.. కొందరు అధికారులు ధనార్జనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. షాదీముబారక్ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలుగులోకి తెస్తోంది. ఈ క్రమంలో తవ్వేకొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. పది రోజుల క్రితం సరూర్‌నగర్ మండలానికి చెందిన సుల్తానాబేగం పేరిట మంజూరైన షాదీముబారక్ నగదును ఇతరులు కాజేసిన వైనాన్ని ఏసీబీ బయటపెట్టింది. అయితే ఈ మొత్తాన్ని ఎవరు తీసుకున్నారు.. ఎలా చెల్లింపులు జరిగాయి.. సుల్తానాబేగం పేరిట దరఖాస్తు చేసిన తీరును పూర్తిగా అధ్యయనం చేసిన ఏసీబీ పలు ఆసక్తికర విషయాల్ని మంగళవారం మీడియాకు వెల్లడించింది. మైనార్టీ శాఖలో దళారుల రాజ్యం.. ప్రస్తుతం షాదీముబారక్ పథకంలో అక్రమాలను వెలికితీసే క్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ తాహెరుద్దీన్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. షాదీముబారక్ పథకం కింద నకిలీ దరఖాస్తులను సృష్టిస్తూ.. వాటిని శాఖపరంగా ఓకే చేయించే క్రమం లో తాహెరుద్దీన్ చురుకైన పాత్ర పోషిం చినట్లు ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది. అదేవిధంగా అన్ని అర్హతలున్న ఒక్కో లబ్ధిదారుడి నుంచి కూడా కనిష్టంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసి వారికి మంజూరు పత్రాన్ని అందిస్తున్నట్లు గుర్తించింది. మైనార్టీ శాఖ ఉద్యోగిలా కాకుండా.. బయటివ్యక్తిలా మాట్లాడుతూ లబ్ధిదారులతో బేరసారాలు చేయడం, అనర్హుల నుంచి దరఖాస్తు చేయించడంలో ఒక ముఠాను ఏర్పాటు చేసి చక్రం తిప్పుతున్న తీరును కూడా ఏసీబీ నిగ్గుతేల్చింది. ఇలా దరఖాస్తు.. అలా సర్టిఫికెట్.. సరూర్‌నగర్ మండలానికి సంబంధించి దాదాపు వందకుపైగా నకిలీ లబ్ధిదారులున్నట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్రమంలో 16 మంది నకిలీల బాగోతాన్ని బయటపెట్టింది. వీరికి సంబంధించి దరఖాస్తు చేసుకునే తీరు మొదలు.. నగదు మంజూరయ్యే వరకు ప్రతిచోట దళారులు చురుకైన పాత్ర పోషించారు. సరూర్‌నగర్ మండలంలో ఎజాజుల్లాఖాన్ అనే మధ్యవర్తి మీసేవా కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తాడు. అనంతరం వారికి సంబంధించి కుల, ఆదాయ సర్టిఫికెట్లను చంద్రాయణగుట్టలోని క్లిక్ నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసిన తర్వాత.. సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో మరో మధ్యవర్తిని ఆశ్రయించి కుల, ఆదాయ సర్టిఫికెట్లను రెండు మూడు గంటల్లో పొందుతాడు. ఆ తర్వాత పహడీషరీఫ్‌లోని ఇండియన్ బ్యాంకులోనూ ఎలాంటి పరిచయస్తులు, ఆధారాలు లేకుండా బ్యాంకు ఖాతాను తెరిచి ఒక రోజులోనే ఈ వివరాలను మైనార్టీ శాఖలోని తాహెరుద్దీన్‌కు అందిస్తాడు. ఇక శాఖాపరంగా జరిగే పరిశీలన.. ఫైల్ మూవ్మెంట్ అంతా అక్కడ చకచకా సాగిపోతుంది. ఈ ప్రక్రియకోసం తాహెరుద్దీన్ సగటున రూ.5 నుంచి రూ.10వేలు తీసుకుంటాడని, క్షేత్రస్థాయిలో పని పూర్తిచేసేందుకు ఎజాజుల్లాఖాన్ రూ.వెయ్యి రూపాయలు తీసుకుంటాడని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ లక్ష్మి విలేకర్లకు వివ రించారు. నకిలీలుగా గుర్తించిన 16 దరఖాస్తుల్లో ఎజాజుల్లాఖాన్ మూడు చోట్ల పెళ్లికొడుకు స్థానంలో ఉన్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే తాహెరుద్దీన్, ఎజాజుల్లాఖాన్లను అదుపులోకి తీసుకోగా.. తహసీల్దార్ కార్యాలయం, ఇండియన్‌బ్యాంకులో వీరికి సహకరించినవారిని త్వరలో పట్టుకోనున్నట్లు పేర్కొన్నారు. -
సంక్షేమ పథకాలపై ఏసీబీ నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల్లో అవకతవకలకు పాల్పడిన వారిని ఇకపై కటకటాల్లోకి నెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో అవకతవకలు చోటుచేసుకుం టున్నట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ప్రభుత్వాదేశాలతో ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబి తాను ఆయా శాఖల నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దరఖాస్తుదారులను, విడుదలైన నిధుల చిట్టాపద్దులను పరిశీలించగా భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దళారులు, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ నిధులను కొల్లగొట్టినట్లు ఏసీబీ విచారణలో బయటపడుతోంది. మంగళవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 కేసులు నమోదు చేసింది. మరో 20 కేసులు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. -
వార్డెన్లు లేరు.. విద్యార్థుల్లేరు
♦ సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు ♦ రికార్డులకు, ఉన్న విద్యార్థులకు పొంతన లేని వైనం సాక్షి నెట్వర్క్: తెలంగాణలో పలుచోట్ల సంక్షేమ వసతి గృహాలపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ తనిఖీలు జరిగాయి. చాలా చోట్ల రికార్డులకు, ఉన్న విద్యార్థులకు పొంతనే లేదని తేలింది. నల్లగొండ జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి బీసీ వసతి గృహంలో 29 మంది విద్యార్థులుంటే.. వార్డెన్ మాత్రం 140 మంది పిల్లలు ఉన్నట్టు రికార్డుల్లో చూపిస్తున్నట్టు తేలింది. అయితే విద్యార్థులకు జనవరి వరకు వండి పెట్టాల్సిన బియ్యానికి సంబంధించి ఇంకా 21 బస్తాలు మిగిలి ఉండగా, కొత్తగా మరో 40 బస్తాలు తెచ్చుకున్నారు. ఇదే జిల్లా మర్రిగూడ హాస్టల్ రికార్డుల్లో 250 మంది ఉంటే.. 70 మందే విద్యార్థులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొండనాగుల బీసీ హాస్టల్ రికార్డుల్లో 138 మంది విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నా.. విచారణలో 98 మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు రికార్డులను స్వాధీ నం చేసుకున్నారు. ఇదే జిల్లా మన్ననూర్ గిరిజన బాలికల వసతి గృహం రికార్డులు వార్డెన్ ఇంటి వద్ద ఉండడంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. బిల్లుల డ్రా చేయడంలో మోసాలు వెలు గు చూశాయి. రంగారెడ్డి జిల్లా యాలాల బీసీ బాలుర హాస్టల్లో మొత్తం 96 మంది విద్యార్థులు ఉన్నట్టు రికార్డుల్లో ఉండగా, తనిఖీలో 56 మందే ఉన్నట్లు గుర్తించారు. ముజాహిద్పూర్ ఎస్టీ హాస్టల్లో 273 మంది విద్యార్థులున్నట్లు రిజిస్టర్లో ఉన్నా.. వాస్తవానికి 151 మందే ఉన్నట్టు తేలింది. ఖమ్మం జిల్లా కామేపల్లి బీసీ బాలికల హాస్టల్, బయ్యూరం మండలం ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాలలో పలు అక్రమాలు బయటపడ్డాయి. -
గుండెపోటా..వేధింపులా?
చెన్నై, సాక్షి ప్రతినిధి: అవినీతి నిరోధక శాఖ (చెన్నై) అదనపు ఎస్పీ హరీష్ (33) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గుండెపోటు కారణమని పోలీసు లు చెబుతుండగా, ఉన్నతాధికారుల వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని మరో ప్రచారం జరుగుతోంది. చెన్నై ఏసీబీ విభాగంలో ఎన్ హరీష్ అదనపు ఎస్పీ గా రెండు నెలల క్రితమే చేరారు. అవివాహితుడు కావడంతో చెన్నై ఎగ్మూరులోని పోలీసు అధికారు లు క్వార్టర్స్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. గురువారం ఉద యం ఇంటి నుంచి బయటకు రాకపోవడం, ఆయన కారు డ్రైవర్ ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన క్వార్టర్స్ సిబ్బంది ఎగ్మూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిచూడగా మంచంపై హరీష్ శవంగా పడి ఉన్నాడు. పోలీసు అదనపు కమిషనర్ శంకర్, సహాయ కమిషనర్ పెరుమాళ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న సమాచారం వేగంగా ప్రచారం కావడంతో పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు క్వార్టర్స్ సముదాయం వద్దకు చేరుకోగా రెండుగేట్లు మూసివేసి అడ్డుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడిలో శిక్షణ పూర్తిచేసుకుని అదనపు ఎస్పీగా విధుల్లో చేరారు. మదురై జిల్లాలో కొంతకాలం పనిచేసి ప్రస్తుతం చెన్నై ఏసీబీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐపీఎస్‌లో ఉత్తీర్ణులైన వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన భాషలోఉత్తీర్ణత పొందాలని చెబుతున్నారు. అయితే హరీష్ తమిళ భాష పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదని తెలుస్తోంది. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించే హరీష్ ఉన్నతాధికారుల వద్ద దాసోహం అన్నట్లు వ్యవహరించలేదని అంటున్నారు. దీనిని మనసులో పెట్టుకుని గతంలో డీజీపీ రామానుజం హరీష్‌పై విచారణకు ఆదేశించారు. ఈ విచారణ సంఘటన తరువాత పోలీస్‌శాఖలోని ఉన్నతాధికారులంతా వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హరీష్‌పై విచారణ సాగుతున్నందున పదోన్నతిని కోల్పోయారు. అతనితోపాటు పనిచేసిన ఐపీఎస్ అధికారులు 2013లోనే ఎస్పీలుగా పదోన్నతిని పొందారు. హరీష్ తరువాత బ్యాచ్ ఐపీఎస్ అధికారులు సైతం పదోన్నతిని అందుకున్నారు. దీంతో తనకంటే జూనియర్ల వద్ద హరీష్ పనిచేయాల్సి వచ్చింది. శాంతి భద్రతల విభాగంలో ఉంటే తన కంటే జూనియర్ల వద్ద విధులు నిర్వర్తించాల్సి వస్తుందన్న బాధతోనే ఏసీబీకి మార్చమని ప్రస్తుత డీజీపీ అశోక్‌కుమార్‌కు విన్నవించుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు వేధింపులు కొనసాగడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు హరీష్ ఇంటిలో ఉత్తరం దొరికిందని తెలుస్తోంది. అయితే పోలీసులు ఉత్తరం విషయాన్ని ధ్రువీకరించడం లేదు. హరీష్‌ది ఆత్మహత్య కాదు, గుండెపోటుకు గురై మరణించాడని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల వేధింపుల కారణంతో తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఈ దశలో ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం పోలీస్‌శాఖను కలవరపెడుతోంది. -
'అవినీతి' కి దడ
ముమ్మరంగా ఏసీబీ దాడులు అడ్డంగా దొరికిపోతున్న అవినీతి అధికారులు గత ఏడాదితో పోలిస్తే పెరిగిన కేసులు దొరికిన వారిలో ఎక్కువమంది గెజిటెడ్లే తాజాగా టీటీడీ డిప్యూటీ ఈవో ఇంటిపై దాడి తిరుపతి: జిల్లాలోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నా యి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల నేపథ్యంలో వారికి కంటిమీద కునుకు లేకుం డాపోతోంది. ఆదాయానికిమించి ఆస్తులు కలి గిన వారు, చెక్‌పోస్టులు, ప్రభుత్వ కార్యాల యాలపై దాడులతో హడలిపోతున్నారు. ఇ ప్పటికే పలువురు అధికారులు, అవినీతి జరిగే కార్యాలయాల జాబితా ఏసీబీ చేతిలో ఉండడంతో ఏ క్షణాన దాడులు జరుగుతాయోనని బెంబేలెత్తుతున్నారు. తాజాగా సోమవారం టీటీడీ డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో పలువురు అధికారులు వణికిపోతున్నారు. ఈ ఏడాది చిక్కినవారిలో ఎక్కువమంది గెజిటెడ్ అధికారులే ఈ ఏడాది ఏసీబీ దాడుల్లో ఇప్పటి వరకు 13 మంది అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది గెజిటెడ్ అధికారులే ఉండడం గమనార్హం. ఇందులో నలుగురు తహశీల్దార్లు, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు వీఆర్వోలు, ఎండోమెంట్ అధికారి ఒకరు, ఎక్సైజ్ శాఖలో ఈఎస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్ శాఖల్లో ఏఈలు ఉన్నారు. ఇవేకాకుండా ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కమర్షియల్ చెక్‌పోస్టులు 3, రవాణా చెక్‌పోస్టు 1, ఆస్పత్రులు 1, సాంఘిక సంక్షేమ శాఖపై రెండు సార్లు దాడులు నిర్వహించారు. పెరిగిన కేసులు సంవత్సరం ట్రాప్‌లు ఆదాయానికి మించిన ఆకస్మిక తనిఖీలు ఆస్తులపై దాడులు 2014-15 09 01 07 2015-16 13 04 08 2014-15 సంవత్సరంలో తొమ్మిది మంది ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఒకరిపైన దాడులు చేయగా, కమర్షియల్ చెక్పోస్టులపై మూడుసార్లు, ట్రాన్స్‌పోర్టు చెక్పోస్టులపై మరో మూడు సార్లు, రిజిస్ట్రార్ ఆఫీసుపై ఒకసారి దాడులు కొనసాగాయి. ఆయాశాఖల అధికారులపై కేసులు నమోదుచేసి అరెస్ట్ చేశారు. అవినీతి అధికారుల భరతం పడతాం అవినీతి అధికారుల భరతం పడతాం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వ్యక్తులుంటే వారి పేర్లు మా దృష్టికి తీసుకురావచ్చు. వారి పేర్లలను గోప్యంగా ఉంచుతాం. ఎవరైనా లంచం ఇవ్వందే పనిచేయమని ఇబ్బంది పెడితే వెంటనే మాకు తెలియజేయండి. వారిని ట్రాప్ చేసి కేసులు నమోదు చేస్తాం. అవినీతి ఎక్కడైన జరుగుతుంటే ఈ నెంబరుకు 9440446190 ఫోన్ చేసి విషయం చెప్పండి. -శంకరరెడ్డి, ఏసీబీ డీఎస్పీ, తిరుపతి -
ఏసీబీ వలలో ఆర్ఐ, వీఆర్వో
భూమికి సంబంధించిన వివరాలను పహాణి లోకి రికార్డు చేయమని దరఖాస్తు చేసుకున్న రైతు నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్ స్పెక్టర్, వీఆర్వో ఏసీబీకి చిక్కారు. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన రైతు ఆది చంద్రమోహన్ తన భూమిని పహాణిలోకి ఎక్కించమని దరఖాస్తు చేసుకున్నాడు. అతడిని వీఆర్వో రవీందర్ రూ. 3 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఆర్వో రవీందర్‌తో పాటు ఈ అవినీతి భాగోతంలో భాగస్వామి అయిన ఆర్ఐ లక్ష్మినారాయణను అదుపులోకి తీసుకున్నారు. అదనపు సమాచారంకోసం వారిని విచారిస్తున్నారు. -
ఏసీబీ వలలో శానిటరీ ఇన్స్పెక్టర్
కాంట్రాక్టు కార్మికుని ఉద్యోగానికి లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం గోపాలపట్నం: గోపాలపట్నంలోని 66వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టు కార్మికుని ఉద్యోగం కోసం రూ. 30 లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కాడు. వివరాలివీ... వార్డులో కన్నమ్మ అనే కాంట్రాక్టు కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని కొడుకు శివ కి ఆ ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ తరుణంలో కొంతకాలంగా శివ ఇక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రూ.30 వేలు ఇస్తేనే ఉద్యోగం అని శానిటరీన్‌స్పెక్టర్ తెగేసి చెప్పాడు. దీంతో శివ మొదటి సారి అప్పు చేసి రూ.10 వేలిచ్చాడు. తర్వాత స్థోమత లేదని చెప్పినా తాను చెప్పినంత ఇవ్వాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ఒత్తిడి చేశాడు. ఏం చేయాలో పాలుపోక శివ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇక్కడి కొత్తపాలెంలో ఉన్న వార్డు కార్యాలయంలో ఈశ్వర్రావుకి శివ రూ.10 వేలు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని ఇక్కడ పనిచేస్తున్న రమణి ద్వారా శానిటరీ ఇన్స్పెక్టర్ తీసుకున్న వెంటనే ఏసీడీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌తో పాటు సీఐలు రామకృష్ణ, రమేష్, రమణమూర్తి దాడి చేసి పట్టుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు రమణిని అదుపులోకి తీసుకుని వేలిముద్రలు సేకరించారు. రికార్డులు పరిశీలించారు. ఈశ్వర్రావుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అడిగింది ఇవ్వాల్సిందే
లంచంలో పైసా తగ్గించని వీఆర్వో రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం ఏసీబీ చట్రంలో చిక్కిన రెవెన్యూ ఉద్యోగి రావికమతం: అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)అధికారుల వలకు వీఆర్వో చిక్కాడు. వంద!, వెయ్యి! కాదు ఏకంగా రూ.50 వేలు లంచం తీసుకుంటూ గురువారం పట్టుబడ్డాడు. మండల రెవెన్యూశాఖలో ఘటికుడుగా గుర్తింపుపొందిన గుడివాడ వీఆర్వో వాలిమరక ముత్యాలు దొరికిపోవడం స్థానికంగా సంచలనమైంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాకకు చెందిన సూరిశెట్టి కన్నారావు, పెంటకోట గోవిందరావులు గుడివాడ రెవెన్యూ పరిధిలో గతంలో 4.11ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అప్పట్లో వీఆర్వోకు రూ.1.25లక్షలు ముట్టజెప్పి పట్టాదారు పాసుపుస్తకం పొందారు. ఆ భూమిని వారు వేరొకరికి విక్రయించారు. పాసుపుస్తకంలో ప్రస్తుతం కొనుగోలు చేసినవారి పేరు మార్పునకు, ఆన్లైన్ చేసేందుకు వీఆర్వోను కలిశారు. అతను రూ.50వేలు డిమాండ్ చేశాడు. గతంలో పెద్ద మొత్తం ఇచ్చామని, ఇప్పుడు ఫ్రీగా చేయాలని కోరారు. కనీసం కొంతయినా తగ్గించాలన్నారు. అయినా వీఆర్వో అంగీకరించకపోవడంతో రూ.50వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా నగదు ముట్టజెబితేనే పని అంటూ నెలల తరబడి తిప్పడంతో విసిగిపోయిన గోవిందరావు, కన్నారావులు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌ను కలిశారు. ఆయన సూచనమేరకు గురువారం ఉదయం రైతులిద్దరూ పాసుపుస్తకాలు పూర్తయ్యాయా.. డబ్బుతెచ్చామంటూ వీఆర్వోను కలిశారు. పోలీసు స్టేషన్‌కు ఎదురుగా ఉన్న తన ప్రైవేటు కార్యాలయానికి డబ్బు తేవాలని చెప్పాడు. అక్కడ వారిద్దరూ రూ.50వేలు ఇచ్చారు. దానిని లెక్కచూసుకుని సొరుగులో పెడుతుండగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్, సీఐలు రామకృష్ణ, గణేష్, రమణమూర్తిలు రెడ్‌హ్యాండెడ్‌గాా వీఆర్వోను పట్టుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల పక్కా ప్లాన్‌లో వీఆర్వో ఇరుక్కుపోయాడు. ఏసీబీ డీఎస్పీకి రైతుల మొర.. వీఆర్వో ముత్యాలు ఏసీబీకి చిక్కాడని తెలిసి ఆ గ్రామం నుంచి చాలా మంది రైతులు రావికమతం వచ్చి డీఎస్పీ రామకృష్ణను కలిశారు. పాసుపుస్తకాల కోసం, ఆన్లైన్ చేయించడానికి, తప్పొప్పులు సరిచేయడానికి తమ నుంచి చాలా నగదు తీసుకున్నారని, ప్రస్తుతం ఆయన స్సపెండ్ అయితే తమ డబ్బు పోతుందని వాపోయారు. పనులు కావంటూ రైతులు అక్కిరెడ్డి రామారావు, జెర్రిపోతుల రాంబాబు,నక్కా అప్పారావు, కరణం అమ్మాజి,గేదెల పరదేశినాయుడు తదితరులు మొరపెట్టుకున్నారు. తమకు డబ్బులిప్పించాలని కోరారు. ఆ విషయంలో తానేమీ చేయలేనని,డబ్బులు డిమాండ్ చేసినపుడే తమను ఆశ్రయించాల్సిందని డీఎస్పీ బదులిచ్చారు. -
డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
రూ. 5 కోట్ల అక్రమ సంపాదన గుట్టురట్టు హైదరాబాద్: కోట్లకు పడగలెత్తిన కరెంటు అధికారి అక్రమ సంపాదనను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బట్టబయలు చేసింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ శ్రీధర్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్, మరో 8 మంది అధికారులు మంగళవారం హైదరాబాద్ బల్కంపేటలోని అతడి ఇంటిలో సోదాలు చేశారు. అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి అతడి నివాసంతోపాటు బంధువులు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసి సుమారు రూ.5 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. బల్కంపేటలో విలువైన భవనం, నగరంలో మరో రెండు ఫ్లాట్లు, కరీంనగర్, సిరిసిల్లల్లో భవనాలు, 60 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు, ఆరు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలు, లాకర్లను పరిశీలించాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ వెన్నెలగడ్డలో ఉన్న మేడ్చల్ విద్యుత్ డీఈ కార్యాలయంలో ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇన్స్పెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. -
రేవంత్ బెయిల్ రద్దు చేయండి.
-
రేవంత్ బెయిల్ రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ షరతులను రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారని, కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేస్తున్నారని ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి పిటిషన్లో కోరారు. రేవంత్‌రెడ్డి మాటల వల్ల కేసులో సాక్ష్యం ఇచ్చేందుకు సాక్షులెవరూ ముందుకొచ్చే అవకాశాలు ఉండవని కోర్టుకు విన్నవించారు. ‘‘ఓటుకు కోట్లు’ కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు పలు షరతులు విధించింది. నియోజకవర్గాన్ని దాటవద్దని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. కానీ బెయిల్‌పై విడుదలైన వెంటనే బహిరంగ ర్యాలీ నిర్వహించిన రేవంత్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరువాత అనారోగ్య కారణాలను చూపుతూ బెయిల్ షరతుల సడలింపునకు పిటిషన్ దాఖలు చేసి, అనుకూల ఉత్తర్వులు పొందారు. కీలక షరతులను సడలించిన హైకోర్టు, దర్యాప్తులో జోక్యం చేసుకోవడం గానీ, కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం గానీ చేయరాదని రేవంత్‌కు స్పష్టం చేసింది. కానీ ఈ షరతును రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారు. ఈనెల 9న హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నా మీద కుట్రలు, కుతంత్రాలు చేసి ఆ తరువాత జైలు పంపించారు. దీంతో కొడంగల్ నియోజకవర్గానికి పరిమితమై ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చాను. ఆట మొదలైందని అంటున్నారు మిత్రులు. ఆటకాదు వేట మొదలైంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు తీవ్ర అభ్యంతరకరం. ఇది కేసు గురించి వ్యాఖ్యలు చేయడమే కాదు. హైకోర్టు విధించిన షరతును ఉల్లంఘించడమే. సాక్ష్యం చెప్పేందుకు సాక్షులు ముందుకు రాకుండా చేసేందుకే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా చేయడం కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే. కాబట్టి రేవంత్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేసి తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి పంపితే తప్ప దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిరాజ్యం
నెల్లూరు(క్రైమ్) : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది. చేయి తడపందే ఫైళ్లు కదలడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరాలన్నా...ఫించన్ మంజూరు కావాలన్నా... భూమికి పట్టాదారు పాసుపుస్తకం తీసుకోవాలన్నా.. ఇలా ప్రభుత్వ శాఖల్లో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కలెక్టరేట్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. చేయి తడపకపోతే పనుల్లో జాప్యం తప్పదు. నిబంధనలకు అనుగుణంగా అన్నీ సవ్యంగా ఉన్నా దక్షిణ ఇచ్చుకుంటే తప్ప పనులు జరగడం లేదు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వారి అవకాశాలను బట్టి జేబులు నింపుకుంటున్నారు. అవినీతిని అంతమొందించేందుకు ఏర్పాటు చేసిన అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) పనితీరు సైతం అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాలో గడిచిన రెండేళ్లలో కేవలం 21 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జాఢ్యం రేషన్‌కార్డు నుంచి ఇళ్లపట్టాల వరకు, జనన సర్టిఫికేట్ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం వరకు ఆయా శాఖల సిబ్బందికి చేయి తడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదవీ విరమణ చేస్తున్న సమయంలో వారికి రావాల్సిన నిధులు ఇచ్చేందుకు లంచం ఇవ్వాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం ఇవ్వందే పనికావడం లేదు. లెసైన్సు మొదలు బండి రిజిస్ట్రేషన్ వరకు ఆర్టీవో కార్యాలయ సిబ్బందికి చేయి తడపాల్సిందే. వాణిజ్య పన్నులశాఖలో వసూళ్ల రాజాలు ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ, నగరపాలకసంస్థ, అటవీశాఖ, నీటిపారుదళశాఖ, విద్యుత్, ఉమ్మడి తనిఖీ కేంద్రంలో అవినీతి పతాకస్థాయికి చేరింది. పోలీసు కార్యాలయంలో చేయి తడపందే పనికావడం లేదన్న ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది బాధితులు నేరుగా జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసుస్టేషన్లలో డబ్బులు కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. కానిస్టేబుల్ నుంచి అధికారి వరకు పోలీసు కార్యాలయంలో పనిచేయించుకోవాలంటే అమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిందేననన్న ఆరోపణలున్నాయి. రెవెన్యూ విభాగంలో ప్రతి పనికోరేటు విధించారన్నది బహిరంగ రహస్యమే. ఎక్సైజ్‌శాఖ మామూళ్లు మత్తులో జోగుతోంది. వైద్యారోగ్యశాఖతో పాటు పలు కార్యాలయాలకు సంబంధించిన కేసుల్లో ఏసీబీ అధికారులు విచారణ ఇంకా పూర్తిచేయలేదు. దీంతో వాటి దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది. నామమాత్రంగా దాడులు... జిల్లాలో కొంతకాలంగా ఏసీబీ తన ఉనిఖి కోసం నామమాత్రపు దాడులతో సరిపెడుతోందన్న విమర్శలున్నాయి. రెండేళ్లు గణాంకాలు పరిశీలిస్తే 2014లో కేవలం 8 ట్రాప్, ఒక ఆదాయానికి మించిన ఆస్తులు, రెండు సర్ప్రైస్ చెక్లకే పరిమితమైంది. 2015లో ఇప్పటి వరకు కేవలం 8 ట్రాప్‌లు, రెండు సర్ప్రైస్ చెక్లకే పరిమితమైంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పతాకస్థాయికి చేరింది. సుమారు 10నెలలుగా నెల్లూరు ఏసీబీ కార్యాలయం ఇన్చార్జి డీఎస్పీ ఆర్వీఎస్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పనిచేస్తోంది. సిబ్బంది కొరత ఉంది. ఇటీవల ఏసీబీ సిబ్బందిపై పలు అవినీతి, ఆరోపణలు వినిపించాయి. ఇక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది వివిధ ప్రభుత్వ కార్యాలయ అధికారులతో లోపాయకారి సంబంధాలు నెరుపుతూ నెలమామూళ్లు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అందుకు గాను దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీడీ ఉన్నతాధికారులు ఈ ఘటనలపై విచారణ జరపడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. -
కంచే.. చేను మేస్తోంది..
రాజమండ్రి క్రైం :అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేరుచెబితేనే అవినీతి అధికారులు హడలెత్తిపోతారు. అలాంటి శాఖలో జిల్లాలో ఒక అధికారి ఆ శాఖ ప్రతిష్టనే మసకబారుస్తూ.. అవినీతికి పాల్పడే వారి జాబితా దగ్గర పెట్టుకుని, వారిని దాడుల పేరుతో బెదిరించి తానే అవినీతికి తెగబడుతున్నాడు. ఆ శాఖ ఉన్నతాధికారి విశాఖపట్నం నుంచి విధులు నిర్వహిస్తుండటం అతడి అవినీతికి ఆజ్యం పోస్తోంది. జిల్లాలో అతడి బారిన పడిన పలు శాఖల అధికారులు లబోదిబోమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖకు రాజమండ్రిలో రేంజ్ కార్యాలయం ఉంది. ఈ రేంజ్‌కు డీఎస్పీగా 2014లో వెంకటేశ్వరరావు పని చేశారు. ఆయన బదిలీ అయ్యాక విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ ఎన్.రమేష్‌కే 2014 నవంబర్ నుంచి రాజమండ్రి బాధ్యతలు కూడా అప్పగించారు. ఆయన విశాఖ కేంద్రంగానే విధులు నిర్వహిస్తూ ప్రాధాన్యం ఉన్న కేసులు ఉన్నప్పుడు జిల్లాకు వస్తుంటారు. దానిని ఆసరాగా చేసుకుని జిల్లాకు చెందిన ఆ శాఖ అధికారి అవినీతికి తలుపులు బార్లా తెరిచారు. ఈ విషయాన్ని ఆ శాఖలోని ఉద్యోగులే బహిరంగంగా చెప్పుకొంటున్నారు. డబ్బులు వచ్చే శాఖలపైనే గురి.. ఆ ‘అవినీతి’ అధికారి దృష్టంతా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖలపైనే. జిల్లాలో రిజిస్ట్రేషన్, సేల్స్ టాక్స్, ఇరిగేషన్, విద్యుత్, ట్రెజరీ, తహశీల్దార్ కార్యాలయాలే లక్ష్యాలుగా వసూళ్ల దందా సాగిస్తున్నారు. స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకూ భయపెట్టి గుంజుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడి బారినపడిన అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఓ అధికారి ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు. గత వారం తన నుంచి రూ.లక్షన్నర గుంజినట్టు చెప్పారు. తాజాగా బుధవారం రాజమండ్రి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ వసూళ్ల దందా చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకూ కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, రావులపాలెం, రంపచోడవరం, ఏలేశ్వరం, తుని తదితర ప్రాంతాల్లో ఇలా గుంజినట్టు పై అధికారుల దృష్టికి కూడా వెళ్లిందని తెలుస్తోంది. ఇలా వ సూలు చేస్తారు.. సదరు అవినీతి అధికారికి సహకరిస్తూ.. ఇద్దరు దిగువస్థాయి సిబ్బంది వసూళ్ల తంతును చక్కబెడుతున్నారు. ముందుగా ఆ సిబ్బంది ఇద్దరు ఎంచుకున్న కార్యాలయానికి వెళ్లి, పథకం ప్రకారం ‘టార్గెట్’ చేసిన ఉద్యోగితో ముందస్తుగా మాట్లాడతారు. మీపై పలు ఆరోపణలు ఉన్నాయంటారు. ఆ మాటలకు భయపడి ముడుపులు సమర్పించుకుంటే సరేసరి. లేకుంటే ‘పై అధికారులు కార్యాలయం, ఇళ్లు, ఇతర ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేస్తారని బెదిరిస్తారు. వచ్చింది ఏసీబీ అధికారులు...చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం.. అని భయపడిన ‘అవినీతి అధికారులు’ వారు అడిగిన మొత్తం సమర్పించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలో బదిలీ కానున్నదనే సదరు అవినీతి అధికారి ఈ దందాకు పాల్పడుతున్నారంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, అతడి అవినీతికి అడ్డుకట్ట వేయాలని పలు శాఖల అధికారులు, సిబ్బంది కోరుతున్నారు. -
అవినీతిపై స్పందించండి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు లంచం అడిగితే ఫిర్యాదు చేయూలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డీఎస్పీ కె.రంగరాజు కోరారు. లంచం కేసుల నమోదుకు, శిక్ష పడేం దుకు ఫిర్యాదీ కచ్చితంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ అవినీతి నిర్మూలనా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 12 కేసులు ఈ ఏడాది ఇప్పటివరకు ఏసీబీ పరిధిలో జిల్లాలో ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఒకటి, ఏడు లంచం కేసులు, ఆకస్మిక తనిఖీలు నాలుగు సార్లు జరిపి నివేదికల్ని ఉన్నతాధికారులకు పంపించామన్నారు. గతేడాదితో పోల్చిచూస్తే ఈ సమయానికి ఎనిమిది లంచం కేసులు నమోదయ్యాయని, ఆకస్మిక తనిఖీలకు సంబంధించి ఈ ఏడాది ఒకటి ఎక్కువ నమోదు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదీలు ధైర్యంగా ముందుకు వచ్చి లంచగొండలపై సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఏసీబీలో జిల్లాలో రెండు సీఐ పోస్టులు ఖాళీ ఉండగా మొత్తం నలుగురు అధికారుల పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉందన్నారు. తను విధుల్లో చేరిన తరువాత మొత్తం నాలుగు కేసులు నమోదు చేసినట్టు రంగరాజు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు కేసుల్లో ..ఒకటి ఆదాయానికి మించి ఆస్తుల కేసు, మూడు లం చం కేసుల్లో నింది తులకు శిక్ష పడిం దని చెప్పారు. స్పందన కరువు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సంబంధించి ఈ జిల్లాకు స్పందన తక్కువగా ఉందని రంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. లంచం గురించి ఏసీబీకి ఫిర్యాదిస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోందనో, ఇబ్బందులుంటాయన్న భయంతో కొంతమంది వెనకాడుతున్నారన్నారు. ప్రభుత్వ సిబ్బంది లంచం అడుగుతున్నారని తమకు ఫోన్లు వస్తున్నా, వాస్తవరూపం వచ్చేసరికి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడం లేదన్నారు. వారం రోజుల నుంచి టోల్‌ఫ్రీ నంబర్ నుంచి తమకెలాంటి ఫిర్యాదులూ అందలేదని, ఫిర్యాదీలు కనీసం 94404-46124కు అయినా సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఏదైనా పనికి సంబంధించి ప్రభుత్వ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. -
అవినీతి ‘లక్షణ’రావు
యనగరం ఫోర్ట్: అవినీతి నిరోధక శాఖ వలకు మరో అవినీతి చేప చిక్కింది. లంచాలు మరిగి, బాధ్యతలు మరిచిన పంచాయతీ రాజ్ అధికారిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఓ బాధితుడు ఇచ్చిన సమాచారంతో అవినీతి అధికారి ఆట కట్టించారు. ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపిన వివరాల ప్రకారం మెంటాడ మండలం జక్కువ గ్రామానికి చెందిన శంకరరావు అనే కాంట్రాక్టర్ గత కొంత కాలంగా కురుపాంలో మండల పరిషత్ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని కొద్దిరోజులుగా కురుపాం పంచాయతీ రాజ్ శాఖ డీఈ పీఎస్వీ లక్ష్మణరావును కోరుతున్నాడు. అయితే చేయి తడపనిదే పని చేసే అలవాటు లేని డీఈ రూ.13,500 లంచం కావాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకుంటే బిల్లులు చెల్లించేది లేదని చెప్పడంతో విసుగు చెందిన శంకర్రావు మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు చెప్పిన ప్రకారం కాంట్రాక్టర్ శంకర్రావు డీఈకి ఫోన్ చేసి ‘అడిగిన డబ్బు ఇస్తాను ఎక్కడకు రావాల’ని అడగడంతో... బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు రావాలని డీఈ లక్ష్మణరావు తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద కాపు కాశారు. డీఈ లక్ష్మణరావు రాగానే శంకర్రావు అతని వద్దకు వెళ్లి రూ.13,500 ఇచ్చాడు. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా డీఈని పట్టుకున్నారు. డీఈని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. డీఈ లక్ష్మణరావు విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ప్లీజ్... ఫోన్ చేయండి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:లంచం అడిగిన మున్సిపల్ కమిషనర్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిచ్చేందుకు 70 ఏళ్ల వృద్ధుడు సాహసించాడు. చదువురాని గ్రామస్తులు మరో అవినీతి అధికారిని పట్టించారు. ఏసీబీ అధికారులు కోరుకుంటున్న చైతన్యం ఇదే. కానీ జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వడమూ నేరమే. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్న వారూ కటకటాలు లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రజలు చేయాల్సిందల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేయడమే. ఈ విషయంలో జిల్లా ప్రజల్లో ఇంకా కావలసినంత చైతన్యం లేదని వారు బాధపడుతున్నారు. ఏసీబీ అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, ఫిర్యాదు చేయాలని కోరుతున్నా అనుకున్న స్పందన మాత్రం కొరవడుతోంది. ఫిర్యాదుచేస్తే అధికారులు, కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందనో, డబ్బు ఖర్చవుతుందనో వారు వెనుకడుగు వేస్తున్నారు. వాస్తవానికి అటువంటి భయం అక్కర్లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఎంత చిన్నమొత్తం లంచం డిమాండ్ చేసినా మమ్మల్ని గుర్తుంచుకోవాలని, అడిగిన వ్యక్తి పనిపడతామని ఏసీబీ అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఫిర్యాదీలకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా ఒకేరోజు సాక్ష్యాల సేకరణ, ఫిర్యాదుకు సంబంధించిన లిఖిత పూర్వక అంశాలన్నీ పూర్తి చేస్తామని చెబుతున్నారు. నిందితుల నుంచి బెదిరింపులు రాకుం డా కూడా తాము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఇదీ పరిస్థితి: జిల్లాలో 2012లో ఓ లంచం కేసు నమోదైంది. 2013లో 9 లంచం కేసులు, ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఒకటి నమోదైంది. పాలకొండ, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్లపై నమోదు చేసిన కేసులు సంచలనం సృష్టించాయి. ఇక 2012 డిసెంబర్లో నమోదైన మద్యం సిండికేట్ల కేసు జిల్లాలో సంచలనమే అయింది. దీనికి సంబంధించి అధికారులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు పెద్ద సం ఖ్యలో అధికారుల్ని కేటాయించడంతో మిగిలిన కేసులపై దృష్టిసారించలేకపోవడం వాస్తవమేనని శాఖాధికారులే అంగీకరిస్తున్నారు. ఇటీవల కాలంలో నమోదైన కేసుల్లో గత ఏడాది నలుగురికి శిక్ష పడగా, ఈ ఏడాది మరో ముగ్గురికి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటి రెండు లంచం కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక డీఎస్పీ ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒకే డీఎస్పీ బాధ్యతలు నిర్వహించే వారు. దీంతో సీఐ స్థాయి అధికారే ఇక్కడి కేసులు పర్యవేక్షించే వారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఏసీబీకి ప్రత్యేక డీఎస్పీ కేటాయించే అవకాశం ఉంది. సిబ్బంది సంఖ్యను పెంచడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇక తమకు పని చెప్పాల్సింది ప్రజలేనని అధికారులంటున్నారు. మిస్డ్ కాల్స్ సమస్య ఏసీబీ అధికారుల్ని మిస్డ్ కాల్స్ సమస్య వేధిస్తోంది. ప్రజల్ని చైతన్య పరిచేందుకు పోస్టర్లు, స్టీక్కర్లను బస్సులు, రైళ్లతోపాటు పలు చోట్ల గోడలకు అతికిస్తున్నారు. అందులో ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఈ నంబర్లకు మిస్డ్ కాల్స్ ఇస్తున్నారని, తిరిగి చేస్తే ఇది మీ నంబరో, కాదో తెలుసుకునేందుకు చేశామని చెబుతున్నారని అధికారులు వాపోతున్నారు. ఇక మరికొందరు ప్రైవేటు వ్యక్తులపై దాడులు చేయాలని కోరుతున్నారని, తాము ఉన్నది ప్రభుత్వ అధికారులపై నిఘాకు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. కొందరు ఫిర్యాదు చేసినా లిఖిత పూర్వకంగా ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం కూడా సమస్యవుతోందంటున్నారు. -
ఏసీబీ వల.. ‘అవినీతి’ విలవిల..!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రతిరోజూ సరాసరి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడుతున్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల్లోపే అవినీతిపరుల సంఖ్య రెట్టింపు ఉంది. ఈ వివరాలు ఏసీబీ శాఖలో నమోదు చేసిన కేసులను బట్టి వెలుగులోకి వచ్చింది. 2014 జనవరి నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 534 ఫిర్యాదుల్లో అధికారులు వలపన్ని లంచాలు స్వీకరిస్తున్న 722 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు. అదే 2013లో మొత్తం 583 కేసులు నమోదుకాగా 500 మందికి పైగా ఉద్యోగులను అరెస్టు చేశారు. 2013 జూన్ 21 వరకు 267 కేసుల్లో వలపన్ని 341 మందిని అరెస్టు చేశారు. అదే ఈ ఏడాది కేవలం అరు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఈ సంఖ్య నమోదైంది.ఇదిలాఉండగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలతో పోలిస్తే అవినీతిలో పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉండగా, ద్వితీయ స్థానంలో రెవెన్యూ శాఖ ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైన విషయం తెలిసిందే. ఇదే బాటలో మిగతా శాఖలూ పోటీపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరేళ్లలో నమోదైన లంచం కేసులు... సంవత్సరం నమోదైన కేసులు 2014 (జూన్) 534 2013 583 2012 489 2011 479 2010 486 2009 475 -
హాస్టళ్లలో అక్రమాలపై తీసుకున్న చర్యలేంటి?
ఆయా శాఖలకు గవర్నర్ సలహాదారు రాయ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పేదలకు అందాల్సిన ఉపకారాలను కాజేస్తున్న ఉద్యోగులు, అధికారులపై గవర్నర్ సలహాదారు ఎఎన్. రాయ్ చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జూన్ 1తో ఆయన అధికారాలు ముగుస్తున్న నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలను కాజేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోనున్నారు. అవినీతి నిరోధక శాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికితీసింది. దానికి బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ప్రభుత్వ సీఎస్‌కు నివేదిక సమర్పించింది. అయినా ఇప్పటి వరకు వారిపై ఎటువంటి చర్యలను తీసుకోలేదని రాయ్ గుర్తించి... హాస్టళ్లలో అక్రమాలపై తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాల్సిందిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శులకు గురువారం ప్రత్యేకంగా నోట్ పంపించారు. -
అవినీతి భాస్కరుడు
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఈఎస్) అల్లం విజయ్ భాస్కర్‌రెడ్డి చిక్కాడు. శుక్రవారం ఈఎస్ తన చాంబర్లో మద్యం వ్యాపారి చింతల రవీందర్‌రెడ్డి నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. రవీందర్‌రెడ్డికి ఆదిలాబాద్ పట్టణంలోని గజిట్ షాపు నంబర్ 1, జైనథ్‌లోని షాపు నంబర్ 2, భోరజ్ చెక్‌పోస్టు వద్ద షాపు నంబర్-8 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ మద్యం దుకాణాల నుంచి నెలకు ఒక్కో దుకాణానికి రూ.3 వేల చొప్పున మామూళ్లు ఇవ్వాలని ఈఎస్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మామూళ్లు ఇవ్వకుంటే ఎక్సైజ్ యాక్డు కింద కేసు నమోదు చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఎనిమిది నెలల మామూళ్లు రూ.72 వేలు ఇవ్వాలని రవీందర్‌రెడ్డిపై ఈఎస్ ఒత్తిడి తెచ్చాడు. ప్రస్తుతం రూ.30 వేలు ఇవ్వాలని తెలుపడంతో రవీందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను వారం రోజుల క్రితం ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం శుక్రవారం ఈఎస్‌కు తన చాంబర్లో రవీందర్‌రెడ్డి రూ.30 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా ప్రతి మద్యం దుకాణం నుంచి నెలనెల మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. వైన్స్‌షాపుల నుంచి డబ్బులు తీసుకురావాలని సబార్డినేటర్లపై ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. ఈ దాడుల్లో జిల్లా ఏసీబీ ఇన్చార్జి వివి రమణమూర్తి, కరీంనగర్ ఏసీబీ సీఐ శ్రీనివాస్‌రాజ్ పాల్గొన్నారు. కాగా, మద్యం వ్యాపారి రవీందర్‌రెడ్డి కావాలనే తనపై కక్షతో ఏసీబీ అధికారులకు పట్టించాడని ఈఎస్ విజయ భాస్కర్‌రెడ్డి తెలిపాడు. -
చేయి తడపాల్సిందే!
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ప్రభుత్వ శాఖల్లో కీలకమైన రెవెన్యూ విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. గత ఏడాది అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల్లో ఈ శాఖ మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. భూములకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో రెవెన్యూ శాఖ కీలకం. ఈ యంత్రాంగం చేయి తడపనిదే ఫైళ్లు కదలవనే అపవాదు ఉంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు.. వాణిజ్య పన్నులు.. మైనింగ్.. రవాణా శాఖల్లోనూ అవినీతి వేళ్లూనుకుంది. అయితే రెవెన్యూ శాఖతో అన్ని వర్గాలకు అవసరాలు పెరిగిపోవడంతో అవినీతి కూడా అదే స్థాయిలో ఉంటోంది. ఏసీబీ అధికారులు గత సంవత్సరం 15 కేసులు నమోదు చేయగా.. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎనిమిది ఉండటం గమనార్హం. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కేసులు 2, ఏపీసీపీడీసీఎల్ శాఖ సిబ్బందిపై 2.. రవాణా, వ్యవసాయం, రాజీవ్ విద్యా మిషన్ సిబ్బందిపై ఒక్కో కేసు నమోదయ్యాయి. రెవెన్యూ శాఖలో వీఆర్వో మొదలుకొని తహశీల్దార్ వరకు వసూళ్లపర్వం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు, భూముల పట్టాలు, వారసత్వపు సర్టిఫికెట్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం.. ఇలా ఎన్నో ధ్రువపత్రాలు రెవెన్యూ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి. వీటి జారీలో కీలకమైన వీఆర్ఓలు, తహశీల్దార్లు అధిక శాతం అందినంత దండుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూకు కాసుల పంట పండిస్తున్నాయి. భూముల వివాదాలు, భూ విలువలను బట్టి పట్టాదారు పాస్ పుస్తకం జారీలో రూ.50 లక్షల వరకు చేతులు మారిన సందర్భాలు లేకపోలేదు. ఎలాంటి ఫీజు లేకుండా ఇవ్వాల్సిన పాస్ పుస్తకాలకు అన్నీ సవ్యంగా ఉన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. జూపాడుబంగ్లా తహశీల్దారుగా పని చేస్తున్న వెంకటేష్ నాయక్ పట్టాదారు పాస్ పుస్తకం జారీకి రూ.2 లక్షలు డిమాండ్ చేసి డబ్బు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల దాడుల్లో అత్యధికంగా లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి ఈయనే. నందవరం డిప్యూటీ తహశీల్దారు కూడా పట్టాదారు పాస్ పుస్తకం జారీకి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. రుద్రవరం మండలంలో ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, వీఆర్ఓలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. తహశీల్దార్ల నేతతృ్వంలో పని చేయాల్సిన సర్వేయర్లు కొందరు భూముల కొలతల్లో అడ్డుగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. దళారీలతో సంబంధం లేకుండా, తహశీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే అవసరం లేకుండా.. మీసేవ కేంద్రాల ద్వారా వివిధ ధ్రువ పత్రాలు పొందే అవకాశం కల్పించామని పాలకులు చెబుతున్నా అవినీతికి అడ్డుకట్ట పడని పరిస్థితి నెలకొంది. మీసేవ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ యంత్రాంగం కుమ్మక్కై పథకం ప్రకారమే ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. -
ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు
జహీరాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : పట్టణం సమీపంలో బీదర్ చౌరస్తా వద్ద గల ఆర్టీఏ చెక్ పోస్టుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు చెక్ పోస్టులో సోదాలు నిర్వహించి అదనంగా ఉన్న రూ. 81 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బుధవారం మెదక్, నిజామాబాద్ జిల్లాల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ సంజీవ్‌రావ్ విలేకరులకు వివరించారు. ఆర్టీఏ రమేష్ బాబు బీదర్ చౌరస్తాలో గల చెక్ పోస్టులో ఇద్దరు ప్రైవేటు ఏజెంట్లను పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని తమకు సమాచారం అందిందన్నారు. దీంతో తాము మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించామన్నారు. ఈ సమయంలో రమేష్ బాబుతో పాటు ఆయన నియమించుకున్న ఇద్దరు ఏజెంట్లు పాషా, రహమాన్లు కూడా చెక్‌పోస్టులో ఉన్నారన్నారు. వీరి నుంచి రూ.60 వేలు, ఏ లెక్కా లేని మరో రూ. 21 వేలు మొత్తం రూ.81 వేలును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెక్‌పోస్టులోనే మరో 91,300 వేలు లభించగా.. అవి ప్రభుత్వానికి సంబంధించినవిగా గుర్తించినట్లు వివరించారు. అధికారి ఇంట్లో సోదాలు చేయగా రూ.13 వేలు దొరికాయని, ఆ డబ్బులు తన జీతానికి సంబంధించినవిగా రమేష్ బాబు పేర్కొన్నారని ఆయన చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అక్రమాలకు పాల్పడుతున్న రమేష్‌బాబుతో పాటు విధుల్లో ఉండాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, జయప్రకాష్‌రెడ్డిలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎవరైనా అధికారులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటే 94404 46155 కు సమాచారం అందిస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కే శ్రీనివాస్ రెడ్డి, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.