భూమికి సంబంధించిన వివరాలను పహాణి లోకి రికార్డు చేయమని దరఖాస్తు చేసుకున్న రైతు నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్ స్పెక్టర్, వీఆర్వో ఏసీబీకి చిక్కారు. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన రైతు ఆది చంద్రమోహన్ తన భూమిని పహాణిలోకి ఎక్కించమని దరఖాస్తు చేసుకున్నాడు.
అతడిని వీఆర్వో రవీందర్ రూ. 3 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఆర్వో రవీందర్‌తో పాటు ఈ అవినీతి భాగోతంలో భాగస్వామి అయిన ఆర్‌ఐ లక్ష్మినారాయణను అదుపులోకి తీసుకున్నారు. అదనపు సమాచారంకోసం వారిని విచారిస్తున్నారు.