సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు లంచం అడిగితే ఫిర్యాదు చేయూలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డీఎస్పీ కె.రంగరాజు కోరారు. లంచం కేసుల నమోదుకు, శిక్ష పడేం దుకు ఫిర్యాదీ కచ్చితంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ అవినీతి నిర్మూలనా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
మొత్తం 12 కేసులు
ఈ ఏడాది ఇప్పటివరకు ఏసీబీ పరిధిలో జిల్లాలో ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఒకటి, ఏడు లంచం కేసులు, ఆకస్మిక తనిఖీలు నాలుగు సార్లు జరిపి నివేదికల్ని ఉన్నతాధికారులకు పంపించామన్నారు. గతేడాదితో పోల్చిచూస్తే ఈ సమయానికి ఎనిమిది లంచం కేసులు నమోదయ్యాయని, ఆకస్మిక తనిఖీలకు సంబంధించి ఈ ఏడాది ఒకటి ఎక్కువ నమోదు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదీలు ధైర్యంగా ముందుకు వచ్చి లంచగొండలపై సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఏసీబీలో జిల్లాలో రెండు సీఐ పోస్టులు ఖాళీ ఉండగా మొత్తం నలుగురు అధికారుల పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉందన్నారు. తను విధుల్లో చేరిన తరువాత మొత్తం నాలుగు కేసులు నమోదు చేసినట్టు రంగరాజు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు కేసుల్లో ..ఒకటి ఆదాయానికి మించి ఆస్తుల కేసు, మూడు లం చం కేసుల్లో నింది తులకు శిక్ష పడిం దని చెప్పారు.
స్పందన కరువు
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సంబంధించి ఈ జిల్లాకు స్పందన తక్కువగా ఉందని రంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. లంచం గురించి ఏసీబీకి ఫిర్యాదిస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోందనో, ఇబ్బందులుంటాయన్న భయంతో కొంతమంది వెనకాడుతున్నారన్నారు. ప్రభుత్వ సిబ్బంది లంచం అడుగుతున్నారని తమకు ఫోన్లు వస్తున్నా, వాస్తవరూపం వచ్చేసరికి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడం లేదన్నారు. వారం రోజుల నుంచి టోల్‌ఫ్రీ నంబర్ నుంచి తమకెలాంటి ఫిర్యాదులూ అందలేదని, ఫిర్యాదీలు కనీసం 94404-46124కు అయినా సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఏదైనా పనికి సంబంధించి ప్రభుత్వ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.
అవినీతిపై స్పందించండి
Published Tue, Dec 9 2014 1:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement