హైదరాబాద్: ఇంటి నిర్మాణ అనుమతికి లంచం తీసుకుంటున్న హయత్‌నగర్ టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం పట్టుకున్నారు. గుర్రంగూడకు చెందిన జక్కిడి సుధాకర్‌రెడ్డి బీఎన్‌రెడ్డి నగర్‌లో ఇంటి నిర్మాణ అనుమతి కోసం హయత్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
ఇందుకోసం టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ఉమను సంప్రదించారు. ఇంటి నిర్మాణ అనుమతికి రూ.2 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రూ.1.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని సుధాకర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సరూర్‌నగర్‌లోని హయత్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో సుధాకర్‌రెడ్డి నుంచి రూ.1.5 లక్షలు టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ ఉమ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మణ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ తదితరఅధికారులు పట్టుకున్నారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపర్చారు.
Comments
Please login to add a commentAdd a comment