
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కేశంపేట తహసీల్దార్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేసిన దాడిలో ఏకంగా రూ.93 లక్షల నగదు లభించిన సంగతి తెలిసిందే. అంతపెద్ద మొత్తం లెక్కపెట్టేందుకు ఏసీబీ అధికారులకు గంటపైగా సమయం పట్టింది..
ఏసీబీకే చెందిన సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
- ఏసీబీ అధికారులు వలపన్ని నమోదు చేసిన కేసుల్లో అసెంబ్లీ ఉద్యోగుల నుంచి పంచాయతీ అటెండర్ వరకు దాదాపు అన్ని శాఖల ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచే అధికం.
- సంక్షేమ పథకాల జారీలో ప్రతి దానికి లంచం అడగడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో అధిక శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే.
- భూ ప్రక్షాళన, పట్టాదారు పాసు పుస్తకాల జారీ విషయంలో రెవెన్యూ ఉద్యోగులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. కిందిస్థాయి అటెండర్ నుంచి వీఆర్‌ఏ, వీఆర్వో, తహసీల్దార్ వరకు అంతా అవినీతికి గేట్లు తెరిచారు. కొత్త జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోంది. దీన్ని కూడా వారు అవకాశంగా తీసుకుని బాధితుల వద్ద అందినకాడికి దండుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment