వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీమంత్రి
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయనను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొప్పన మాట్లాడుతూ వైఎస్ జగన్ పోరాటాలు, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితుడై పార్టీలో చేరినట్టు తెలిపారు. వైఎస్ జగన్ ను సీఎం చేసేందుకు జిల్లాలో తన వంతు కృషి చేస్తానన్నారు. కాగా కొప్పన మోహన్ రావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు.