
గుర్‌గావ్: ప్రధాని మోదీ కేదార్‌నాథ్ పర్యటన ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో వీక్షించేందుకు ఆలయానికి వెళ్లిన బీజేపీ నేతలను రైతులు దిగ్బంధించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు సాగిస్తున్న రైతులను దుర్భాషలాడారంటూ మాజీ మంత్రి మనీష్ గ్రోవర్ లక్ష్యంగా రైతులు బీజేపీ నేతలను దాదాపు 8 గంటలపాటు ఎటూ కదలనీయలేదు. పోలీసులు జోక్యం చేసుకున్నా వెనక్కి తగ్గలేదు.
చివరికి మనీష్ గ్రోవర్ చేతులు జోడించి క్షమాపణ చెప్పాకే అందరినీ వదిలిపెట్టినట్లు రైతులు తెలిపారు. హరియాణా రాష్ట్రం రొహ్‌తక్ జిల్లా కిలోయిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, రైతులకు క్షమాపణ చెప్పారంటూ వచ్చిన వార్తలను మాజీ మంత్రి గ్రోవర్ ఖండించారు. మరో ఘటన.. హిసార్ జిల్లా నిర్నావుండ్ వద్ద కొందరు వ్యక్తులు బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ రామ్‌చందర్ కారు అద్దాలను పగులగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment