బీజేపీలో అసమ్మతి రాజేసిన ‘నోటీసు’ | Two Yeddyurappa detractors get show-cause notice | Sakshi
Sakshi News home page

బీజేపీలో అసమ్మతి రాజేసిన ‘నోటీసు’

Published Wed, Nov 2 2016 11:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Two Yeddyurappa detractors get show-cause notice

బెంగళూరు:  భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సొగడుశివణ్ణకు ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు ఎన్.శంకరప్ప నోటీస్‌ జారీ చేయడం ఆ పార్టీలో అసమ్మతిని రాజేస్తోంది. రాజకీయ ప్రత్యర్థి, యడ్యూరప్ప ఆప్తుడైన మాజీ ఎంపీ జీ.ఎస్‌ బసవరాజ్‌ ఒత్తిడి వల్లే సొగడు శివణ్ణకు నోటీసులు జారీ చేశారని ఆ పార్టీలో కే.ఎస్‌ ఈశ్వరప్ప వర్గం భావిస్తోంది. ముఖ్యంగా యడ్యూరప్ప ఇటీవల జారీ చేసిన పధాధికారుల నియామకం విషయంలో తుమకూరు జిల్లాకు అన్యాయం జరిగిందని సొగడు శివణ్ణ పేర్కొనడమే నోటీసులు జారీ చేయడానికి కారణమని వారి వాదన.  
 
దీంతో నోటీసుల జారీ వెనక యడ్డీ హస్తం ఉందని వారు పేర్కొంటున్నారు ఈ విషయమై బెంగళూరులో బీజేపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో వాడివేడిగా చర్చజరిగినట్లు సమాచారం.  కాగా ఈనెల 27న బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున బెంగళూరులో వెనుకబడినవర్గాల(ఓబీసీ) సమావేశం జరపాలని కోర్‌ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశానికి అమిత్‌షా హాజరు కానున్నట్లు సమాచారం. ఇదే సమావేశంలో ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి శ్రీనివాసప్రసాద్‌  బీజేపీ తీర్థం తీసుకుంటారని సమావేశంలో పాల్గొన్న నాయకులు  చెబుతున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement