బాబు, లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నారు | tdp is being ruined by lokesh and chandrababu, say party cadre | Sakshi
Sakshi News home page

బాబు, లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నారు

Published Tue, Mar 7 2017 11:16 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

బాబు, లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నారు - Sakshi

బాబు, లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నారు

తెలుగుదేశం పార్టీని చంద్రబాబు, లోకేష్ కలిసి భ్రష్టు పట్టిస్తున్నారని పలువురు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్ల వ్యవహారంతో టీడీపీలో అసంతృప్తి సెగలు చెలరేగాయి. మాజీ మంత్రి పుష్పరాజ్‌ను పార్టీకి రాజీనామా చేయాలని ఆయన అనుచరులు పట్టుబడుతున్నారు.

ఎమ్మెల్సీ టికెట్ల పంపిణీ విషయంలో తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ముందునుంచి ఉండి కష్టపడినవారికి కాకుండా.. పైరవీకారులకే పెద్దపీట వేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  తమకు గౌరవం లేని పార్టీలో ఉండటం అనవసరమని ఆయన అనుచరులు వాదిస్తున్నారు. మొత్తమ్మీద ఎమ్మెల్సీ టికెట్ల పంపిణీ వ్యవహారంతో ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా ఇదే అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పుష్పరాజ్ వర్గం కూడా ఇదే అంశంపై ఆగ్రహంతో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement