ప్రభుత్వ లాంఛనాలతో రుక్మిణీదేవి అంత్యక్రియలు | Rukmini's funeral with governmental honors | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ లాంఛనాలతో రుక్మిణీదేవి అంత్యక్రియలు

Published Mon, May 8 2017 11:27 PM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

ప్రభుత్వ లాంఛనాలతో రుక్మిణీదేవి అంత్యక్రియలు - Sakshi

ప్రభుత్వ లాంఛనాలతో రుక్మిణీదేవి అంత్యక్రియలు

మడకశిర : మడకశిర మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రుక్మిణీదేవి అంత్యక్రియలను సోమవారం స్వస్థలమైన మడకశిరలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. రుక్మిణీదేవి ఆదివారం అనంతపురంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె భర్త అంజినప్ప కూడా గతంలో నెల్లూరు ఎంపీగా పని చేశారు. అంత్యక్రియలను పెనుకొండ ఆర్డీఓ రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకు మునుపు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న తదితరులు రుక్మిణీదేవి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డితో పాటు అన్ని పార్టీలకు చెందిన నేతలు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ నేతల సంతాపం

మాజీ మంత్రి రుక్మిణీదేవి మృతి పట్ల స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపాన్ని తెలిపారు. ఆ పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి, మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్, జిల్లా కార్యదర్శి జీ రంగేగౌడ్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement