సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో నిరుపేద అసైన్డ్‌దారులను బెదిరించి బినామీలు, బంధువుల పేరిట కారు చౌకగా భూములను కొట్టేసిన మాజీ మంత్రి నారా యణ అధికారులనూ బెదిరించారని సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు బుధవారం నివేదించారు. ప్రభుత్వం తమదని, తాము చెప్పిందే చట్టమని, చెప్పినట్లు చేయాలంటూ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు.
అప్పటి అడ్వొకేట్ జ నరల్ (ఏజీ), న్యాయశాఖ, ముఖ్య కార్యద ర్శులు, ఐఏఎస్ అధికారులు వారించినా నారాయణ లెక్క చేయలేదని తె లిపారు. అసైన్డ్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో నారా యణే కీలక సూత్రధారి అని చెప్పారు. ఆయన సమీప బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలను కొనుగోలు చేసేందుకు రూ.18.10 కోట్లు వెచ్చించి నట్లు నివేదించారు. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైనే ఉంటుందని కోర్టు దృష్టికి తెచ్చారు. అసైన్డ్ భూములను ప్రభు త్వం వెనక్కి తీసుకుంటుందని, అంతిమంగా పేదలకు ఎలాంటి లబ్ధి చేకూరదంటూ గత ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు భయాందోళనలు రేకెత్తించారన్నారు.
చదవండి: రామోజీ.. మీ ఆకాంక్షే గాలిలో దీపం
అనంతరం అసైన్డ్‌దారుల నుంచి భూ ములను అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ల ద్వారా నామ మాత్రపు ధరలకు కొట్టేశారని తెలిపారు. ఆ తరువాత వాటిని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద సీఆర్‌ఏడీకు ఇచ్చి జీవో 41 (ల్యాండ్ పూలింగ్ స్కీం రూల్స్) ని అడ్డం పెట్టుకుని విలువైన నివాస, వాణిజ్య ప్లాట్లను పొందినట్లు తెలిపారు. కొన్నిటిని అధిక ధరలకు అమ్ముకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మొత్తం నేరంలో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి మంత్రి నారాయణ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని నివేదించారు.
దర్యాప్తులో సీఐడీ అధికా రులు స్వాధీనం చేసుకున్న నారాయణ ఫోన్ లో ఆయన కు మార్తె సింధూరతో జరిపిన సంభాషణలున్నట్లు తెలిపారు. తాను అసైన్డ్ భూములను కొన్నట్లు ఆ సంభాషణల్లో నారా యణ అంగీకరించారని చెప్పారు. అసైన్డ్ భూములు తమ పేర్లతో ఉంటే ప్రభుత్వం జైల్లో వేస్తుందని నారాయణ తన కుమార్తెతో చెప్పారన్నారు. ఆ సంభాషణల తాలుకూ పెన్ డ్రైవ్ ను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందజేశారు.
ఈ వ్యవహా రానికి సంబంధించి ఒరిజినల్ రి కార్డులను సైతం సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. ఏఏజీ వాదనలు పూర్తి కాక పోవడంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులిచ్చారు. అసైన్డ్ భూముల బద లాయింపులో అక్ర మాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, నారాయ ణ లపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీన్ని కొట్టివేయాలని కోరుతూ దాఖలైన క్వాష్ పిటి షన్లపై స్టే విధించిన కోర్టు ఇటీవల తుది విచారణ చేపట్టింది.
చట్టపరమైన రక్షణ ఉంది.. ప్రాసిక్యూషన్ తగదు
నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ సీఆర్‌డీఏ చట్టం కింద తీసు కున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వం, అధికారులు, అథారిటీలకు వ్యతిరేకంగా ఎలాంటి కేసులు దాఖలు చే యడానికి వీల్లేదన్నారు. చట్టం కింద రక్షణ ఉన్నందున నారాయణను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదన్నారు. తమ కున్న అధికారం మేరకే జీవో 41 జారీ చేశారని తెలిపారు. ఈ అధికారాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీ, ఎస్టీలెవరూ ఫిర్యాదుదారులు కాదన్నారు. అందువల్ల ఆ చట్టం కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు.
ఇతర టీడీపీ నేతలు కూడా..
అసైన్డ్‌దారులను బెదిరించి నారాయణ మాత్రమే కాకుండా అప్పటి అధికార పార్టీ నేతలైన రావెల కిషోర్‌బాబు, అనగాని సత్యప్రసాద్, పరిటాల శ్రీరామ్, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు కూడా భూములను సొంతం చేసుకున్నట్లు ఏఏజీ సుధా కర్‌రెడ్డి తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి అసైన్డ్ భూములను తీసుకురావడం, ఆ భూముల బదలాయింపుపై అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, జేసీ చెరుకూరి శ్రీధర్ అభ్యంతరం తెలిపారన్నారు. ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అసైన్డ్ భూ ముల విషయంలో చట్టపరమైన నిబంధనలను నారాయణకు స్పష్టంగా వివరించినట్లు వారు త మ వాంగ్మూలాల్లో స్పష్టంగా చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో స్టే ఎత్తివేసి సీఐడీ దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment