additional advocate general
-
చంద్రబాబును అన్ని ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసింది: ఏఏజీ
-
స్కామ్ కారకులనే నాడు అప్రమత్తం చేశారు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కాంను చాలా స్కిల్ ఫుల్‌గా జరిపించి.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ చేశారని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి సీఐడీ నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. సీమెన్స్ ఏజీ అనే జర్మన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో.. స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ. 3,300 కోట్లు ఫ్రీగా ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టులో 90 శాతం సీమెన్స్ కంపెనీ ఇస్తుందని.. ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు. రూల్స్ ప్రకారం అది వీలుకాదని అధికారులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అధికారులు చెప్పారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలన్న అధికారుల వాదనను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. పైగా ఏపీ ఖజానా నుంచి రూ.371 కోట్లు డిజైన్‌టెక్‌కు చెల్లించారు. చాలా నైపుణ్యంగా జరిగిన స్కామ్ ఇది. ప్రభుత్వ సంపదను చాలా సులభంగా దోచేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటైన.. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవకతవకల గురించి పుణే నుంచి జీఎస్టీ అధికారులు అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ ద్వారా అప్రమత్తం చేశారు. 2018, మే 14వ తేదీన ఏపీ ఏసీబీ డీజీకి లేఖ రాశారు. అంటే.. పుణే నుంచి ఈ స్కామ్ బయటపడింది. చూస్కోండి బాబూ.. రూ. 371 కోట్లు హాంఫట్ అయ్యాయని లేఖ ద్వారా అలర్ట్ చేశారు. అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఈ స్కాంకు కర్తనో.. ఆ ప్రభుత్వానికే ఆ లేఖ అందింది. అంటే.. కారకులనే పుణే జీఎస్టీ విభాగం అప్రమత్తం చేసిందన్నమాట. అందుకే వ్యవహారం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది అని ఏఏజీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు అడగబోతుండగా.. తానేం దర్యాప్తు అధికారిని కానని.. కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వాదనలు మాత్రమే వినిపిస్తున్నానని.. అందుకే తనకు చేరిన పత్రాలు, వివరాల ఆధారంగా మీడియాకు సమాచారం ఇస్తున్నానని ఆయన తెలిపారు. -
బేసిక్ లా తెలియని వారే అలా మాట్లాడతారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే కోర్టులో ప్రవేశపెట్టామని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. తీర్పు అనంతరం ఏఏజీ పొన్నవోలు.. మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రిమాండ్‌పై ఆయన తరపు న్యాయ వాదులు తీవ్రమైన వాదనలు వినిపించారు. సీఆర్.పీఎస్ చట్టంలో రెండు కస్టడీ పిటిషన్లే ఉన్నాయి. ఒకటి పోలీస్ కస్టడీ, రెండవది జ్యుడీషియల్ కస్టడీ. హౌస్ కస్టడీ పిటిషన్ అనేది లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాజమండ్రి సెంట్రలో జైలులో భద్రత లేదని వారి ఆరోపణ. చంద్రబాబు జైల్లో ఉన్న ప్రాంతం ఒక కోటలా మారింది. ప్రత్యేకంగా ఒక బ్యారెక్స్‌ను కేటాయించారు. 24x7 గంటలూ సీసీ కెమెరాల నిఘా, వైద్యులు అందుబాటులో ఉన్నారు. చంద్రబాబు భద్రత ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుంది. సెంట్రల్ జైల్ అంటేనే పటిష్టమైన భద్రతా ప్రదేశం. ప్రైవేట్ గృహంలో ఉంటేనే భద్రత ఉండదు.. అక్కడ ఏదైనా జరగొచ్చు. అదే జైల్లో ఉంటే ఎలాంటి భద్రతా పరమైన సమస్యా ఉండదు. జైల్లో ఫలానాది లేదని చెప్పమనండి.. ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుంది. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదనే వాదన సరైనది కాదు. బేసిక్ లా తెలియని వారు.. చట్టంపై అవగాహన లేని వారు చెప్పే మాటలే ఇవి’’ అని ఏఏజీ పేర్కొన్నారు. ‘‘ఎంక్వైరీలో పేరు ఉందా లేదా అనేదే ముఖ్యం. తనను ఉదయం 6 గంటలకే అరెస్ట్ చేశారని చంద్రబాబే కోర్టులో అంగీకరించారు. చంద్రబాబు ఇటీవల పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తానన్నారు. ఇప్పుడు తన అరెస్ట్ కేసులో హౌస్ కస్టడీ పిటిషన్ కోరడం ద్వారా ఖైదీలకు ‘‘వర్క్ ఫ్రమ్ హోం’’ అనే మెసేజ్‌ను ఇచ్చినట్లుంది. చంద్రబాబును ఐదురోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశాం. రేపు(బుధవారం) చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ వేసే అవకాశం ఉంది’’ అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. చదవండి: ‘హౌస్ అరెస్ట్‌లో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?’ -
అందుకే బాబును జైల్లోనే ఉంచాలనేది: ఏఏజీ
సాక్షి, విజయవాడ: రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత ఉందని.. ఇంటి భోజనం, మందులు అందిస్తూ ప్రభుత్వం అన్ని విధాల సదుపాయాన్ని కల్పిస్తున్న విషయాన్ని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మరోసారి ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయారని.. ఇప్పుడు న్యాయవ్యస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఏఏజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయారు. జైల్లో ఆయనకు పూర్తి భద్రత ఉంది. జైల్లో ఖైదీలు కాక.. స్వామిలు ఉంటారా?. చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు కూడా అందిస్తున్నారు. ఆయనకు అక్కడే అన్ని విధాల భద్రత ఉంటుందని మరోసారి ఉద్ఘాటించారు. అలాగే బెయిల్, హౌజ్ అరెస్ట్.. ఇలా పిటిషన్లు వేసుకునే హక్కులు అందరికీ ఉంటాయని తెలిపారాయన. అందుకే జైల్లో ఉండాలనేది ఇక కేవలం తన స్టేట్మెంట్ ఆధారంగానే కేసు నడవడాన్ని మాజీ అధికారి పీవీ రమేష్ ఆక్షేపించడాన్ని ఏఏజీ సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. జడ్జి ముందు పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉందని, అందులో వాస్తవాలు ఉన్నాయని, ఈ పరిణామాలు చూస్తుంటే అప్పుడే ఓ వికెట్ పడిపోయిందనే అనుమానాలు కలుగుతున్నాయని ఏఏజీ అంటున్నారు. పీవీ రమేష్‌ను అప్పుడే ప్రలోభ పెట్టినట్లు కనిపిస్తోందని.. ప్రలోభాలు, లోబర్చుకోవడం, మేనేజ్ చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని ఏఏజీ విమర్శించారు. కాబట్టే చంద్రబాబు జైల్లోనే ఉండాలని బలంగా చెబుతున్నామని ఏఏజీ అంటున్నారు. . దురదృష్టకరం తప్పు అని నిరూపిస్తే.. ఏ వ్యవస్థనైనా భ్రష్టు పట్టించగల సమర్థత వాళ్లకు ఉందని ఏఏజీ సుధాకర్‌రెడ్డి అంటున్నారు. అనుకూలంగా ఆర్డర్ రాకపోయేసరికి ఇప్పుడు న్యాయవ్యవస్థను సైతం నిందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై దాడి దురదృష్టకరమని.. న్యాయ వ్యవస్థను కూలదోయాలని ప్రయత్నిస్తే వాళ్లే కూలిపోతారని హితవు పలికారాయన. భయం నా బ్లడ్‌లోనే లేదు స్కిల్ స్కాం కేసులో సీఐడీ తరపున తాను తన వృత్తిపరంగానే పని చేస్తున్నానని, తనపై ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేవని స్పష్టం చేశారు ఏఏజీ పొన్నవోలు. అలాగే.. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసేవాళ్లను తాను పట్టించుకోబోనని అంటున్నారాయన. వాళ్లు చెబుతున్న డైలాగులే తాను చెబుతున్నానని, బెదిరింపులకు తాను భయపడే రకం కాదని.. భయం తన బ్లడ్‌లోనే లేదని ఆయన అన్నారు. లోకేష్ అలా ఎలా అంటారు? షెల్ కంపెనీల ద్వారా డబ్బులు క్రెడిట్ అయ్యాయని కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో తేలిందని, ఆధారాలు లేవని నారా లోకేష్ ఎలా అంటారని ఏఏజీ సుధాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని వ్యవస్థలకు పట్టిన చంద్ర గ్రహణం ఇప్పుడిప్పుడే వీడుతోందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారాయన. ఇదీ చదవండి: ఆ రెడ్ డెయిరీ ఏందో.. లోకేష్ ఏందో..! -
మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో నిరుపేద అసైన్డ్‌దారులను బెదిరించి బినామీలు, బంధువుల పేరిట కారు చౌకగా భూములను కొట్టేసిన మాజీ మంత్రి నారా యణ అధికారులనూ బెదిరించారని సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు బుధవారం నివేదించారు. ప్రభుత్వం తమదని, తాము చెప్పిందే చట్టమని, చెప్పినట్లు చేయాలంటూ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. అప్పటి అడ్వొకేట్ జ నరల్ (ఏజీ), న్యాయశాఖ, ముఖ్య కార్యద ర్శులు, ఐఏఎస్ అధికారులు వారించినా నారాయణ లెక్క చేయలేదని తె లిపారు. అసైన్డ్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో నారా యణే కీలక సూత్రధారి అని చెప్పారు. ఆయన సమీప బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలను కొనుగోలు చేసేందుకు రూ.18.10 కోట్లు వెచ్చించి నట్లు నివేదించారు. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైనే ఉంటుందని కోర్టు దృష్టికి తెచ్చారు. అసైన్డ్ భూములను ప్రభు త్వం వెనక్కి తీసుకుంటుందని, అంతిమంగా పేదలకు ఎలాంటి లబ్ధి చేకూరదంటూ గత ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు భయాందోళనలు రేకెత్తించారన్నారు. చదవండి: రామోజీ.. మీ ఆకాంక్షే గాలిలో దీపం అనంతరం అసైన్డ్‌దారుల నుంచి భూ ములను అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ల ద్వారా నామ మాత్రపు ధరలకు కొట్టేశారని తెలిపారు. ఆ తరువాత వాటిని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద సీఆర్ఏడీకు ఇచ్చి జీవో 41 (ల్యాండ్ పూలింగ్ స్కీం రూల్స్) ని అడ్డం పెట్టుకుని విలువైన నివాస, వాణిజ్య ప్లాట్లను పొందినట్లు తెలిపారు. కొన్నిటిని అధిక ధరలకు అమ్ముకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మొత్తం నేరంలో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి మంత్రి నారాయణ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని నివేదించారు. దర్యాప్తులో సీఐడీ అధికా రులు స్వాధీనం చేసుకున్న నారాయణ ఫోన్ లో ఆయన కు మార్తె సింధూరతో జరిపిన సంభాషణలున్నట్లు తెలిపారు. తాను అసైన్డ్ భూములను కొన్నట్లు ఆ సంభాషణల్లో నారా యణ అంగీకరించారని చెప్పారు. అసైన్డ్ భూములు తమ పేర్లతో ఉంటే ప్రభుత్వం జైల్లో వేస్తుందని నారాయణ తన కుమార్తెతో చెప్పారన్నారు. ఆ సంభాషణల తాలుకూ పెన్ డ్రైవ్ ను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేశారు. ఈ వ్యవహా రానికి సంబంధించి ఒరిజినల్ రి కార్డులను సైతం సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. ఏఏజీ వాదనలు పూర్తి కాక పోవడంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులిచ్చారు. అసైన్డ్ భూముల బద లాయింపులో అక్ర మాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, నారాయ ణ లపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీన్ని కొట్టివేయాలని కోరుతూ దాఖలైన క్వాష్ పిటి షన్లపై స్టే విధించిన కోర్టు ఇటీవల తుది విచారణ చేపట్టింది. చట్టపరమైన రక్షణ ఉంది.. ప్రాసిక్యూషన్ తగదు నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ సీఆర్డీఏ చట్టం కింద తీసు కున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వం, అధికారులు, అథారిటీలకు వ్యతిరేకంగా ఎలాంటి కేసులు దాఖలు చే యడానికి వీల్లేదన్నారు. చట్టం కింద రక్షణ ఉన్నందున నారాయణను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదన్నారు. తమ కున్న అధికారం మేరకే జీవో 41 జారీ చేశారని తెలిపారు. ఈ అధికారాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీ, ఎస్టీలెవరూ ఫిర్యాదుదారులు కాదన్నారు. అందువల్ల ఆ చట్టం కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు. ఇతర టీడీపీ నేతలు కూడా.. అసైన్డ్‌దారులను బెదిరించి నారాయణ మాత్రమే కాకుండా అప్పటి అధికార పార్టీ నేతలైన రావెల కిషోర్‌బాబు, అనగాని సత్యప్రసాద్, పరిటాల శ్రీరామ్, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు కూడా భూములను సొంతం చేసుకున్నట్లు ఏఏజీ సుధా కర్‌రెడ్డి తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి అసైన్డ్ భూములను తీసుకురావడం, ఆ భూముల బదలాయింపుపై అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, జేసీ చెరుకూరి శ్రీధర్ అభ్యంతరం తెలిపారన్నారు. ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అసైన్డ్ భూ ముల విషయంలో చట్టపరమైన నిబంధనలను నారాయణకు స్పష్టంగా వివరించినట్లు వారు త మ వాంగ్మూలాల్లో స్పష్టంగా చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో స్టే ఎత్తివేసి సీఐడీ దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించారు. -
గత ప్రభుత్వం పేదలను గాలికొదిలేసింది
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని పేదల నివాసాల నిమిత్తం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతోందని, అయితే గత ప్రభుత్వం మాత్రం పేదలను గాలికొదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పేదల కోసం రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కూడా కేటాయించలేదని, ఆ తప్పును తాము ఇప్పుడు సరిచేసి, చట్టానికి అనుగుణంగా 5 శాతం భూమిని పేదల నివాసకల్పన కోసం కేటాయించామని చెప్పారు. చట్ట ప్రకారం వ్యవహరించడం కూడా తప్పు అంటూ పిటిషన్ దాఖలు చేశారని ఆయన వివరించారు. పేదలులేని ప్రపంచస్థాయి రాజదాని కావాలని రాజధాని రైతులు కోరుకుంటున్నారని, తాము మాత్రం పేదలు సైతం రాజధానిలో ఇళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే పేదల కోసం ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేసి, వందల ఎకరాల భూమిని కేటాయించామన్నారు. రాజధాని రైతుల వాదనను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అంటరానితనం ఆలోచనలు ఉండటం దురదృష్టకరమని సుధాకర్‌రెడ్డి తెలిపారు. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్–57 ప్రకారం పూలింగ్ ద్వారా సమీకరించిన భూమిపై సర్వహక్కులు సీఆర్డీఏకే ఉంటాయన్నారు. ఆ భూమి సీఆర్డీఏ ఆస్తి అవుతుందే తప్ప, రైతులది కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ వ్యాజ్యాన్ని సైతం త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ఆయన ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇళ్లు కావాలని ఎవరూ అడగలేదు.. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెం గ్రామానికి చెందిన రైతు అవల నందకిషోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజలెవ్వరూ కోరలేదన్నారు. గ్రామసభల్లో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం చేయాల్సిన పనిని గత ప్రభుత్వం విస్మరించిందని, ఆ తప్పును సరిదిద్ది మాస్టర్ ప్లాన్‌కు ఓ విలువను తీసుకొచ్చామని, దాన్ని కూడా పిటిషనర్ తప్పుపడుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో 900 ఎకరాలను పేదల కోసం కేటాయించామని చెప్పారు. ప్రజలు తమకు ఫలానాది కావాలని అడిగేంత వరకు ప్రభుత్వాలు ఎదురుచూడవని.. వారి అవసరాలను గుర్తించడమే ప్రభుత్వ విధి అన్నారు. ఇదే అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, తరువాత పూర్తిస్తాయిలో విచారణ జరుపుతామన్నారు. ఈ సమయంలో ఇంద్రనీల్.. ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఏ ధర్మాసనమైనా ఒక్కటేనని, తాము చట్ట ప్రకారమే ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేశామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. దీనిపై తగిన ఉత్తర్వులు జారీచేసేందుకు ఈ వ్యాజ్యాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. -
న్యాయవ్యవస్థలో కుల ప్రస్తావన దురదృష్టకరం : ఏపీ అడిషనల్ ఏజీ పొన్నవోలు
-
రఘురామను అక్కడికి పంపడమంటే టీడీపీ ఆఫీస్‌కు పంపినట్టే: ఏఏజీ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికి పంపడమంటే టీడీపీ ఆఫీస్‌కు పంపినట్టేనని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని అతని తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్థావించారు. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడిచే రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం, వారు చెప్పిందే నివేదికగా ఇచ్చే అవకాశం ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు స్వయంగా జీజీహెచ్ బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రైవేట్ వైద్యులు, సీఆర్పీఎఫ్ భద్రత, కుటుంబ సభ్యులు ఉంటారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను హైకోర్టు నిన్న సాయంత్రం 6:40కే వెల్లడించిందని తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాక రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని సీఐడీ కోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని ఆయన వివరించారు. ఈ అంశాన్ని సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తే తమ తీర్పును సవరిస్తామని సీఐడీ కోర్టు తెలిపిన విషయాన్ని ఆయన వెల్లడించారు. చదవండి: ‘రఘురామకృష్ణరాజు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు’ -
ఆ బాలుడి సంరక్షణ ఎవరు చూస్తారు?
పట్నా : రెండు రోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై తల్లి మృతదేహాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించిన ఒక బాలుడి హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బీహార్‌కు చెందిన అర్బినా ఇన్ఫాత్ వలస కార్మికురాలు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోసం వలస వెళ్లిన ఆమె తన కొడుకు రహమత్‌తో కలసి గుజరాత్ నుంచి శనివారం శ్రామిక్ రైలులో తిరుగు పయనమైంది. అయితే ఎండ వేడిమితో పాటు వందల కిలోమీటర్లు తిండీ, తిప్పలు లేకపోవడంతో అనారోగ్యానికి గురై రైలులోనే తుది శ్వాస విడిచారు. తాజాగా ఈ వీడియోను పరిగణలోకి తీసుకొని పట్నా హైకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం కేసుపై విచారణ జరిపింది. (హృదయ విదారకం: చనిపోయిన తల్లిని లేపుతూ..) ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. 'ఆ ఘటన ఇప్పటికి షాకింగ్‌గా ఉంది.. నిజంగా అలా జరగడం దురదృష్టకరం' అంటూ పేర్కొంది. ఈ సంఘటన తమను తీవ్రంగా కలచివేసిందని ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలంటూ హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా బీహార్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. 'చనిపోయిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారా? నిజంగానే అర్బీనా ఆకలితో చనిపొయిందా లేక ఇంకా ఏమైనా కారణముందా? చట్టం అమలు చేసే విధంగా ఏజెన్సీలు ఏం చర్య తీసుకుంటాయి? ఒకవేళ ఆ మహిళకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు సంప్రదాయ పద్దతిలో నిర్వహించారా? తల్లి చనిపోవడంతో అనాథగా మారిన ఆ బాలుడి సంరక్షణ ఎవరు చూస్తారు? ' అంటూ హైకోర్టు జడ్జీలు ప్రశ్నల వర్షం కురిపించారు. ('కేసీఆర్‌ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి') దీనిపై ప్రభుత్వం తరపున రాష్ట్ర అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఎస్డీ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..' అర్బినా ఇన్ఫాత్‌ది సహజ మరణమే. సూరత్ నుంచి రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో సమయానికి తిండి లేక ఆమె ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతోనే మృతి చెందింది. ఈ విషయాన్ని మృతురాలి చెల్లి, ఆమె భర్త స్వయంగా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అర్బీనా మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించలేదు. అంతేగాక ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులకు అనుమతి కూడా ఇచ్చాము. మృతదేహాన్ని ముజఫర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై విడిచిపెట్టి వెళ్లడంపై అధికారుల వద్ద వివరాలను ఆరా తీశాము. అర్బీనా స్వస్థలం కతిహార్ అని, తన భర్తతో విడిపోయాక చెల్లి ఆమె భర్తతో కలిసి ఉంటుంది. అర్బినాకు మొదట కొడుకు ఒకడే అని పొరబడ్డాం. తరువాత అర్బినాకు ఇద్దరు కొడుకులని రహమాన్‌కు అన్న ఉన్నాడని, అతని పేరు ఫర్మాణ్ అని తెలిసింది. ప్రస్తుతం వారిద్దరిని తామే సంరక్షిస్తామని అర్బినా చెల్లి, ఆమె భర్త పేర్కొన్నారు. అంతేగాక ఈ కేసును మేము ప్రత్యేకంగా తీసుకున్నాం. అర్బినా కుటుంబాన్ని కలవడానికి కొంతమంది అధికారులను పంపించాం. వారికి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే సహాయం చేయాలని నిర్ణయించాం' అంటూ తెలిపారు.(మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత) ఎస్డీ యాదవ్ వాదనలు విన్న హైకోర్టు జూన్ 3న మరోసారి కేసును పరిశీలిస్తామని పేర్కొన్నారు. అప్పటిలోగా మీరు చెప్పిన ఆధారాలను ప్రత్యేక నివేదిక రూపంలో అందజేయాలని కోరింది. అయితే అర్భినా తండ్రి మహ్మద్ నెహ్రూల్ స్పందిస్తూ.. 'నా కూతురు ఏ వ్యాధితో బాధపడడం లేదని, కానీ ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా' అంటూ ఆవేదనతో తెలిపాడు. -
హరియానా ఏఏజీగా ఉదయ్‌కుమార్ సాగర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఉదయ్‌కుమార్‌సాగర్‌ను హరియానా ప్రభుత్వం అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ ఆన్ రికార్డుగా సుప్రీం కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయ్‌కుమార్ సాగర్, హరియానా ప్రభుత్వానికి సైతం సేవలు అందించనున్నారు. గత 25 ఏళ్లుగా సాగర్ హస్తినలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలంగాణలోని మెదక్‌జిల్లా వాసి అయిన ఉదయ్‌కుమార్ సాగర్ హరియానా ప్రభుత్వం ఎంపిక చేయడం విశేషం.